చర్చ:పెళ్లకూరు జయప్రద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసకర్త వ్యాసాన్ని అభివృద్ధి చేస్తున్నానని చెప్పే మూస వాడాలి

[మార్చు]

{{New page}} అన్న ఈ మూస వ్యాసంలో వాడితే వ్యాసకర్త ఆ వ్యాసాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఉన్నారని, కొన్నినాళ్ళలోనే మొలకస్థాయి దాటి కనీసం ఆరంభస్థాయి వ్యాసాలైనా తయారవుతాయని నిర్వాహకులు అర్థం చేసుకుంటారు. ఇది నిర్వాహకుని చర్చపేజీలో వ్యాసకర్త వ్రాసిన దాన్ని పురస్కరించుకుని చేసిన సూచన. నిజానికి నేనే మార్పు చేయవచ్చు కానీ నేను ఈ వ్యాసాన్ని విస్తరించే సమాచారంతో లేను, అందుకనే ఆ మూస చేర్చమని స్వరలాసిక గారినే కోరుతున్నాను. దానివల్ల నిర్వాహకులు అతికొద్ది సమాచారం ఉందంటూవున్న మూసను తీసివేయగలుగుతారు.(మీరే తీసేయవచ్చేమో కూడాను, నాకు తెలియదు సరిగ్గా)--పవన్ సంతోష్ (చర్చ) 03:39, 27 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసం విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు. అప్పుడే వ్యాసం సృష్టించబడి ఆ వాడుకరి ఆ వ్యాసం పుర్తి చేయడానికి కొంత సమయం అవసరమై ఆ వ్యాసం పూర్తి అయ్యే వరకు ఎవరి జోక్యం ఆ వ్యాసంలో ఉండరాదని భావించినపుడు వెంటనే ఆ వ్యాసంలో {{in use}} మూసను చేర్చితే ఆ వాడుకరి ఆ వ్యాసం పూర్తి చేసిన వరకు ఎవరూ ఆ వ్యాసం లో మార్పులు చేయరు. వ్యాసం విస్తరించు క్రమంలో ఉన్నప్పుడు {{New page}} వాడినా తప్పులేదు. వ్యాస కర్త విషయం వ్రాయడం పూర్తి అయిన తరువాత ఆ వ్యాసం 2 కె.బి కంటె తక్కువ ఉంటే {{మొలక}} మూసను లేదా {{విస్తరణ}} మూసను చేర్చాలి.-- కె.వెంకటరమణ 01:14, 28 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]