చర్చ:పెళ్ళి కాని పిల్లలు (1961 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముందు కలిసుంటా... తర్వాతే పెళ్లి! అయినా అమ్మ ఏమీ అనదు కాబోయేవాడిలో నాన్న సుగుణాలుండాలి ఇషాడియోల్ వెల్లడి పెళ్లికి ముందే కాబోయే వాడితో కొంతకాలం కలిసుంటాను. తర్వాత అతను నచ్చితేనే పెళ్లి చేసుకుంటాను...' అని నటుడు ధర్మేంద్ర , అందాల తార హేమమాలిని గారాల పట్టి అయిన ఇషా డియోల్ చెప్పింది. ఇందుకు అమ్మ కూడా ఎదురు చెప్పదని విశ్వసిస్తున్నట్లు తెలిపింది. తనకు కాబోయే భర్తలో మాత్రం తన తండ్రి సుగుణాలు కచ్చితంగా ఉండి తీరాలంటోంది. 'ప్రేమ వివాహం పై నాకు నమ్మకుముంది. మా నాన్న లాంటి సుగుణాలున్న అందగాడి కోసం వేచి చూస్తున్నా'అని ఇషా తన మనసులో మాట చెప్పింది. 'తనకు కాబోయే వాడిలో తన తండ్రి గుణాలు కొన్నైనా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుందని నా అభిప్రాయం. నేను కూడా అదే కోరుకుంటున్నా. ప్రస్తుతానికి మా నాన్న తో మాత్రమే నేను సన్నిహితంగా ఉన్నాను. నాన్న గుణాలు నచ్చాయి. అందుకే నాకు కాబోయేవాడు కూడా మా నాన్నలాగే ఉండాలనుకుంటున్నాను'అని ఇషా పేర్కొంది. అయితే మరోపక్క 25 ఏళ్ల ఇషాకు తల్లిదండ్రులుపెళ్లి సంబంధాలు చూస్తున్నారు. 'మా అమ్మ ఆధునిక మహిళ . ఒకవేళ నేను పెళ్లికి ముందే ఒకరితో కొన్నేళ్లు కలిసి ఉన్నా ఏమీ అనదు. కనీసం రెండేళ్లు కలసి ఉండాలనుకుంటున్నాను. తర్వాతే అతనితో పెళ్లి గురించి ఆలోచిస్తా'అని ఇషా వివరించింది.విడాకులు తీసుకున్నాక ఓ వ్యక్తి మంచివాడా, కాదా? అని ఆలోచించడం కంటే పెళ్లికి ముందే అర్థం చేసుకోవడం మంచిది కదా? అని ప్రశ్నించింది. 'నాకు, అమ్మకు కూడా డ్యాన్స్, నటన అంటే ఇష్టం. అందువల్ల ఇద్దరం చాలా విషయాలు పరస్పరం పంచుకుంటాం. అంతేకాదు జీవితంలో అమ్మ ఇప్పటి వరకు ఎన్నో విషయాల్లో నాకు బాసట గా నిలిచింది' అని ఇషా వివరించింది.(ఈనాడు 5.9.2008)


భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ వ్యాసం మొలకతరగతి చెందిన వ్యాసం అని వికీప్రాజెక్టు భారతదేశం ద్వారా యాంత్రికంగా కొలిచారు. దీనికి కారణం ఈ వ్యాసంలో మొలక అనే పేరు ఉన్న మూసను ఉపయోగించటమే, లేదా వ్యాసంలో ఉన్న సమాచారం బాగా తక్కువ వుండటం కూడా ఇంకో కారణం.
  • మీరు దీనిని అంగీకరిస్తే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి.
  • మీరు దీనిని అంగీకరించకపోతే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} మూసలోని, తరగతి పారామీటరు మార్చాండి. ఆ తరువాత {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి, తరువాత వ్యాసం నుండి మొలక అని ఉన్న మూసను కూడా తొలగించండి.