చర్చ:ప్రవాస భారతీయులు
Jump to navigation
Jump to search
ప్రవాస భారతీయులు పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
వర్గం:హిందీ మాట్లాడే దేశాలు లో గల చర్చను ఇక్కడ తరలించడం జరిగినది. అహ్మద్ నిసార్ 10:34, 6 జూన్ 2009 (UTC)
వర్గం చర్చ:అరబ్బీ మాట్లాడే దేశాలులో చేసిన చర్చే దీనికి కూడా వర్తిస్తుందనుకుంటా. సభ్యుల అభిప్రాయం ప్రకారం దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు. -- C.Chandra Kanth Rao-చర్చ 19:11, 12 ఏప్రిల్ 2009 (UTC)
- చంద్రకాంతరావు గారు, చక్కటి పాయింట్లతో చర్చ ప్రారంభించారు. సభ్యుల అభిప్రాయాలకు స్వాగతం. బార్బడోస్, ఫిజీ లాంటి దేశాలలో హిందీ భాష ఉపయోగంలో వున్నదని తెలుసుకోవడం చదువరులకు ఉత్సుకను పెంచే విషయమని నా అభిప్రాయం. అలాగే ఇవికీ లో ఇంగ్లీషు మాట్లాడే దేశాలు, ఫ్రెంచి మాట్లాడే దేశాలు అనే వర్గాలు కానవస్తాయి. కానీ, చంద్రకాంతరావుగారు చెప్పినట్లు, "ప్రాతిపదిక" ముఖ్యం. ఎలాంటి ప్రాతిపదిక తీసుకుంటే బాగుంటుందో, సభ్యులు తమ అభిప్రాయాలు ఆమోదాలు తెలుపవలెనని మనవి. అహ్మద్ నిసార్ 19:28, 12 ఏప్రిల్ 2009 (UTC)
- మనం భవిష్యత్తును గురించి కూడా ఆలోచించాలి కదా! ప్రస్తుతం మనం ఒక ఉద్దేశ్యంతో ఒక వర్గాన్ని ప్రారంభిస్తున్నాం, అది సమంజసమే కావచ్చు. కాని మునుముందు మరొకరు మరో ఉద్దేశ్యంతో ఆలోచించవచ్చు. కాబట్టి ప్రాతిపదిక ఉంటే తర్వాత సమస్య, గందరగోళం ఉండదు. అధికార భాష లేదా అత్యధికులు (దీన్ని ఒక శాతంగా నిర్ణయించాలి) మాట్లాడే ప్రజలున్న దేశాలనే ఈ వర్గంలో చేర్చాలని నిర్ణయిస్తే బాగుంటుంది. లేకుంటే ఈ నియమం లేదు, నాకు తెలియదు, ముందే నిర్ణయించాల్సింది అని సభ్యులు చెప్పే అవకాశముంది. ప్రాతిపదిక యొక్క అవసరం నాకు ఇప్పుడిప్పుడే తెలిసివస్తోంది. -- C.Chandra Kanth Rao-చర్చ 19:40, 12 ఏప్రిల్ 2009 (UTC)
- ఈ వర్గం అనవసరమని నాకనిపిస్తుంది. అరబ్ లాగా హిందీ ఒక సంస్కృతి కాదు, జాతి అంతకంటేనూ కాదు. తెలుగు మాట్లాడేవాళ్ళున్నారని అమెరికాను, ఆస్ట్రేలియాను, ఇంగ్లాడును తెలుగు మాట్లాడే దేశాలు వర్గంలో చేర్చలేము. ఈ ఉదాహరణ కొంచెం వితండంగా అనిపించినా కేవలం సమస్య వివరించడానికే. ప్రవాస భారతీయులున్న దేశాలు వర్గం సరిపోతుందేమో కానీ భారతీయులు లేని దేశాలు తక్కువ. అమెరికాలాంటి దేశానికి ఇలాంటి వర్గాలు కొల్లలుగా చేర్చాల్సి వస్తుంది. నిసార్ గారూ, మీరు వివరించిన సమాచారం పాఠకులకు తెలపడానికి ప్రవాస భారతీయులు అన్న వ్యాసం మంచి వేదిక అనుకుంటా (ఇలాంటి వర్గం కంటే) --వైజాసత్య 19:48, 12 ఏప్రిల్ 2009 (UTC)
- మనం భవిష్యత్తును గురించి కూడా ఆలోచించాలి కదా! ప్రస్తుతం మనం ఒక ఉద్దేశ్యంతో ఒక వర్గాన్ని ప్రారంభిస్తున్నాం, అది సమంజసమే కావచ్చు. కాని మునుముందు మరొకరు మరో ఉద్దేశ్యంతో ఆలోచించవచ్చు. కాబట్టి ప్రాతిపదిక ఉంటే తర్వాత సమస్య, గందరగోళం ఉండదు. అధికార భాష లేదా అత్యధికులు (దీన్ని ఒక శాతంగా నిర్ణయించాలి) మాట్లాడే ప్రజలున్న దేశాలనే ఈ వర్గంలో చేర్చాలని నిర్ణయిస్తే బాగుంటుంది. లేకుంటే ఈ నియమం లేదు, నాకు తెలియదు, ముందే నిర్ణయించాల్సింది అని సభ్యులు చెప్పే అవకాశముంది. ప్రాతిపదిక యొక్క అవసరం నాకు ఇప్పుడిప్పుడే తెలిసివస్తోంది. -- C.Chandra Kanth Rao-చర్చ 19:40, 12 ఏప్రిల్ 2009 (UTC)
- అవునండి, చంద్రకాంతరావుగారు చెప్పినట్లు గందరగోళమేర్పడుతుంది. వైజాసత్య గారు ప్రతిపాదించినట్లు ప్రవాస భారతీయులు (ఈ మధ్యన విద్యా-ఉద్యోగాల కొరకు మైగ్రేషన్) లేదా భారత సంతతి గల దేశాలు (బాక్ట్రియా ప్రాంతం మరియు ఆగ్నేయాసియాలో వేల సంవత్సరాలనుండి భారత సంతతి గలదు) గల పేరుతో ఓ వ్యాసమే ఉచితమనిపిస్తుంది. క్లియర్ కట్ గాను అర్థవంతంగానూ వుంటుంది. అహ్మద్ నిసార్ 20:24, 12 ఏప్రిల్ 2009 (UTC)
సభ్యులు అభిప్రాయాలు తెలిపిన ఆధారంగా, ఈ వర్గానికి "భారత సంతతి గల దేశాలు" సబబుగా వున్నదని నేను భావిస్తున్నాను. ఈ వర్గానికి "భారత సంతతి గల దేశాలు" గా మార్చడానికి ప్రతిపాదిస్తున్నాను. సభ్యులు అంగీకారం తెలుపవలెను. అహ్మద్ నిసార్ 16:18, 5 మే 2009 (UTC)