చర్చ:బమ్మెర పోతన
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
భాగవతం ఒక్క శ్రీకృష్ణుడి కథ మాత్రమే కాదు. మొత్తం దశావతారాలకు సంబంధించిన కథలతో బాటు, అంబరీషుడు, ధృవుడు, లాంటి భక్తుల కథలు కూడా ఉన్నాయి. భక్తుల కథలనే భాగవతంగా భావిస్తారని కూడా చదివాను. పలికెడిది భాగవతమట పలికించినవాడు రామభద్రుండట కదా?
నిజమే కానీ భాగవతమునందు శ్రీకృష్ణుని కథకు ఓ ప్రత్యేకత ఉన్నది
మొత్తం అన్ని స్కంధాలలో ఇదే పెద్దది!
207.46.50.70 05:57, 14 మార్చి 2006 (UTC)
విషయం
[మార్చు]ఈ వ్యాసంలో ఎక్కువగా పోతన రాసిన పద్యాలే ఉన్నాయి. పోతన గురించిన వ్యాసమే కాబట్టి ఉదాహరణకు రెండు మూడు పద్యాలు ఉంచి మిగతావన్నీ తీసివేయాలని భావిస్తున్నాను. మిగతా సభ్యులకు ఏదైనా అభ్యంతరాలుంటే తెలపండి. --రవిచంద్ర (చర్చ) 09:27, 3 జూలై 2010 (UTC)
వినతి
[మార్చు]భక్త పోతనగారి గురించి వ్యాసములో ఆయన గురించి ఇంకా సమాచారాన్ని జతచేయాల్సిందిగా కోరుతూ.... పద్యాలు అలానే ఉంచగలరు.... త్రైలంగ
వినతి
[మార్చు]దయచేసి పద్యాలు తొలగించకండి. ఇంకా అద్బుత పద్యాలు అనేకం కలవు . అవి కూడా పెడదాం.... , భాను రెడ్డి 11:01, 1 ఆగష్టు 2012 (UTC)
==
[మార్చు]మహాకవి పోతన గారి సమాధి, ఆయన వ్యవసాయం చేసిన పొలం, బావి యింకనూ ఉన్నవి...
దయచేసి తెలుగువారు కనీసం యిపుడైన మేలుకుని వాటిని పరిరక్షించాలని కోరుతున్నాను
== మొన్నీమధ్యే బమ్మెర వెళ్ళాను. పోతన గారి సమాధి, బావి శిథిలమైపొయాయి. అక్కడకు కారు వెళ్ళలేదు. ప్రభుత్వం కట్టిన గుడి పక్కనున్న గది (some kind of a hall)..కర్రాళ్ళు కలిసి బీర్లు తాగడానికి వాడుకుంటున్నారు. తెలుగే యెన్నిరోజులు బ్రతుకుతుందో అన్నట్టుగా ఉంటే, పోతనగారి సమధేమి లెక్క? I left that place with a very bad feeling. How many of the new generation kids know to read prose and how many of them can ever read/enjoy Pothana's poetry? Let's take this treasure to our graves gracefully. --122.169.142.155 16:23, 24 అక్టోబరు 2015 (UTC) ==
పోతన పద్యాలు
[మార్చు]- పోతన గారి పద్యాలు మాత్రము విడిగా "వికీసోర్స్"నకు జత చేయవచ్చును అని నా అభిప్రాయము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:19, 3 ఫిబ్రవరి 2013 (UTC)
సగం గ్రాంధికము సగం వ్యావకహారికము
[మార్చు]ఈ వ్యాసము సగం గ్రాంధికము సగం వ్యావకహారికములొ ఉంది. సమగ్రమైన పరిశోధన చేసి వ్యాసాన్ని మారుస్తాను. వ్యాసాన్ని వేరే చోట నుంచి సరాసరి కాపీ పేస్ట్ చేసినట్టు ఉంది. Tpathanjali (చర్చ) 06:52, 11 ఫిబ్రవరి 2020 (UTC) పతంజలి టి