చర్చ:బాబిలోనా
స్వరూపం
విషయ ప్రాముఖ్యత లేని వ్యాసం
[మార్చు]ఎంటర్‌టైనర్స్ విషయంలో, అదీ పోర్నోగ్రాఫిక్ ఎంటర్‌టైనర్స్ విషయంలో, ప్రాముఖ్యత కలిగిన పలు అవార్డులు సాధించడం, ప్రత్యేక పోర్నోగ్రాఫిక్ జాన్రాలలో విశిష్టత సాధించడం, పలుమార్లు ప్రాధాన స్రవంతి మీడియాలో చెప్పుకోదగ్గ వ్యాసాలు రావడం (వివాదాల గురించి చెదురుమదురు వ్యాసాలు కాదు, వారి గురించే పూర్తిస్థాయి ఫీచర్లు) విషయ ప్రాముఖ్యత ఇవ్వదగ్గ అంశాలు. వీటిని నిర్ధారించడానికి ప్రామాణిక పత్రికలు, పుస్తకాల్లో వీరి గురించి వ్యాసాలు రావాలి. ఈ వ్యాస విషయానికి అటువంటి విషయ ప్రాధాన్యత కనిపించడం లేదు, దీన్ని నిర్ధారించలేకపోతే తొలగించడం జరుగుతుంది. --పవన్ సంతోష్ (చర్చ) 14:00, 15 జూన్ 2018 (UTC)
5 నెలల పాటు వేచి చూసినా ఈ వ్యాసంలో నిర్మాణాత్మకంగా విషయ ప్రాముఖ్యత నిర్ధారించే మార్పుచేర్పులు జరగనందున వ్యాసాన్ని తొలగించడం జరుగుతుంది. --పవన్ సంతోష్ (చర్చ) 08:16, 18 నవంబర్ 2018 (UTC)- ఈ వ్యాసంలో @K.Venkataramana: పనిచేశారని తెలుస్తోంది. విషయ ప్రాధాన్యతకు ఉన్న ఏకైక అవకాశం "షకీలా తర్వాత అంతే స్థాయిలో శృంగార పండించిన తారల్లో బాబిలోనా ఒకరు." అన్న వాక్యం. ఆ మూలం ఉన్న వెబ్సైట్, అది రాసివున్న వ్యాసం ఉన్నత స్థాయిలో ఉన్నవి కాదు. దీనిపై కాస్త మెరుగైన మూలాల కోసం వెతికితే ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ ఇంటర్వ్యూ దొరికింది. దీని ఇంట్రోలో దక్షిణాది ఐటంసాంగ్ గర్ల్ అని, పెద్దగా ఏ సినిమాల్లోనూ హీరోయిన్ గా చేయలేదని రాశారు. పోనీ ఇంటర్వ్యూ కూడా ఏమీ ఆమె ప్రాచుర్యం చెందిన నటి అన్న ఉద్దేశంలో చేయలేదు, ఇంట్రోలో "సినిమా జీవితాల తెర వెనక నీలినీడలు ఎలా ఉంటాయి? ఏ పేరున్న అగ్రతారలనో అడిగితే తెలివిగా సమాధానాలను దాటవేయవచ్చు. అదే దక్షిణాది ఐటమ్‌సాంగ్ గర్ల్ బాబిలోనాను అడిగితే.. ఉన్నది ఉన్నట్లు గలగలా మాట్లాడేస్తుంది." అన్న ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేసినట్టు సూటిగా రాశారు. ఈ వ్యాసం ఈ విధంగా చూస్తే విషయ ప్రాముఖ్యత ఉన్నదని అనిపించట్లేదు. దయచేసి రమణ గారు కూడా అభిప్రాయం చెప్తే దీనిపై ఆ వెనువెంటనే నిర్ణయం తీసుకోవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 08:30, 18 నవంబర్ 2018 (UTC)
- పవన్ సంతోష్ గారూ, సరైన మూలాలు లేకుండా ఉన్న ప్రాముఖ్యత లేని ఈ వ్యాసాన్ని తొలగించవచ్చు.--కె.వెంకటరమణ⇒చర్చ 05:03, 19 నవంబర్ 2018 (UTC)
- తొలగింపు నిర్ణయాన్ని అమలు చేశానండీ. --పవన్ సంతోష్ (చర్చ) 07:45, 19 నవంబర్ 2018 (UTC)
- పవన్ సంతోష్ గారూ, సరైన మూలాలు లేకుండా ఉన్న ప్రాముఖ్యత లేని ఈ వ్యాసాన్ని తొలగించవచ్చు.--కె.వెంకటరమణ⇒చర్చ 05:03, 19 నవంబర్ 2018 (UTC)
- ఈ వ్యాసంలో @K.Venkataramana: పనిచేశారని తెలుస్తోంది. విషయ ప్రాధాన్యతకు ఉన్న ఏకైక అవకాశం "షకీలా తర్వాత అంతే స్థాయిలో శృంగార పండించిన తారల్లో బాబిలోనా ఒకరు." అన్న వాక్యం. ఆ మూలం ఉన్న వెబ్సైట్, అది రాసివున్న వ్యాసం ఉన్నత స్థాయిలో ఉన్నవి కాదు. దీనిపై కాస్త మెరుగైన మూలాల కోసం వెతికితే ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ ఇంటర్వ్యూ దొరికింది. దీని ఇంట్రోలో దక్షిణాది ఐటంసాంగ్ గర్ల్ అని, పెద్దగా ఏ సినిమాల్లోనూ హీరోయిన్ గా చేయలేదని రాశారు. పోనీ ఇంటర్వ్యూ కూడా ఏమీ ఆమె ప్రాచుర్యం చెందిన నటి అన్న ఉద్దేశంలో చేయలేదు, ఇంట్రోలో "సినిమా జీవితాల తెర వెనక నీలినీడలు ఎలా ఉంటాయి? ఏ పేరున్న అగ్రతారలనో అడిగితే తెలివిగా సమాధానాలను దాటవేయవచ్చు. అదే దక్షిణాది ఐటమ్‌సాంగ్ గర్ల్ బాబిలోనాను అడిగితే.. ఉన్నది ఉన్నట్లు గలగలా మాట్లాడేస్తుంది." అన్న ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేసినట్టు సూటిగా రాశారు. ఈ వ్యాసం ఈ విధంగా చూస్తే విషయ ప్రాముఖ్యత ఉన్నదని అనిపించట్లేదు. దయచేసి రమణ గారు కూడా అభిప్రాయం చెప్తే దీనిపై ఆ వెనువెంటనే నిర్ణయం తీసుకోవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 08:30, 18 నవంబర్ 2018 (UTC)