చర్చ:బాబు (కార్టూనిస్ట్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


బాబు (కార్టూనిస్ట్) వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2012 సంవత్సరం, 37 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

ఈ ప్రముఖ కార్టూనిస్ట్ గురించి తెలియవలసిన వివరాలు చాలానే ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు, నా దగ్గర ఉన్న కార్టూన్ల సంకలనం నుండి గ్రహించి కొంతవరకు వ్రాయగలిగాను. సభ్యులు ఈ క్రింది వివ్రాలు పొందుపరచగలిగితె వ్యాసం పూర్తవుతుంది-

  • కొలను వెంకటదుర్గాప్రసాదు కుటుంబ సభ్యుల పేర్లు
  • ఏ సంవత్సరంలో, ఎక్కడ జన్మించారు
  • వీరి వృత్తి ఏమిటి-గవర్నమెంటు ఉద్యోగి అనుకుంటాను
  • ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు, ఏమి చేస్తున్నారు
  • వీరి ఇతర రచనలు (కార్టూన్లు కాకుండా)
  • వీరి కార్టూన్ల సంకలనాల వివరాలు
  • మంచి ఫొటో(వారి అనుమతితో)

సభ్యులు ఎవరికి తెలిసినది వారు వ్యాసంలో జతపరచగలరు.--S I V A 10:43, 22 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం పేరును కొలను వెంకట దుర్గాప్రసాద్ గా మారిస్తే సమంజసమని అనిపిస్తుంది. బాబు అనేది తెలుగువారిలో చాలా మంది ముద్దు పేరు.Rajasekhar1961 04:25, 24 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

  • రాజశేఖర్‌గారూ! "బాబు" అనే పేరుతోనే కొలను వెంకట దుర్గా ప్రసాద్ ప్రపంచానికి తెలుసు. ఆయన తాను వేసిన అసంఖ్యాకమైన కార్టూన్లన్నిటికి "బాబు" ఆని మాత్రమే సంతకం చేస్తారు. కాబట్టి వ్యాసానికి బాబు అన్నపేరే సమంజసం. బాబు (చిత్రకారుడు) అని వ్రాయవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, బాబు అన్న పేరుతో ఒక శొభన్‌బాబు సినిమా ఉన్నది. "బాపు" మీద వ్యాసానికి ఆయన అసలు పేరు పెడితే ఎంతమందికి తెలుస్తుంది!!! మీ దగ్గర ప్రముఖ కార్టూనిస్ట్ బాబు గురించిన వివరాలు ఏమైనా ఉంటే, వ్యాసంలో పొందుపరచి, వ్యాసాన్ని మరింత పరిపుష్టం చెయ్యగలరు.--S I V A 18:54, 24 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • రాజశేఖర్‌గారూ! నేను మీ వ్యాఖ్యకు జవాబు వ్రాసిన కొద్ది క్షణాల్లోనే నాకు ఇ మైలు ద్వారా శ్రీ బాబు ఫొటో అందింది. అందులో చూడండి, వికీ పీడియా కోసరం పంపిన చిత్రంలో, ఆయన "బాబు" అని సంతకం చేసి పంపారు. కాబట్టి మీ సందేహం తీరినట్టుగా భావిస్తున్నాను.
బాబు గారు తన స్వహస్తాలతో తన పూర్తి బయోడేటా ఫొటో, కార్టూన్లతో పాటు, వికీలో వ్యాసం వ్రాయటానికి జయదేవ్‌కు పోస్టులో పంపారు. అవన్ని స్కాన్ చేసి, జయదేవ్ గారు నాకు ఇ మైల్‌లో పంపారు. ఈ వ్యాసం వ్రాయటానికి ప్రోత్సహించి, బాబు గారిని కాంటాక్ట్ చేసి వివరాలు సంపాయించి నాకు పంపిన జయదేవ్ గారికి, ఓపికగా నేను ఆడిగిన వివరాలన్ని అందచేసిన బాబు గారికి కృతజ్ఞతలు.(ఈ వ్యాఖ్యలు వ్రాసి, సంతకం మరచాను.--S I V A 17
19, 3 ఫిబ్రవరి 2009 (UTC))

కార్టూనిష్ట్ బాబు మరణం

[మార్చు]

శ్రీ కొలను వెంకటదుర్గా ప్రసాద్ గారు 3 అక్టోబర్ 2019 రోజున మరణించారు. సమాచారం ఆయన వ్యాసంలో పొందుపరిచాను.

కాని కుడిపక్కన పైన ఉన్న "బాక్స్" లో అప్డేట్ చెయ్యటం నాకు చేతకావటంలేదు అనే కంటె ఎలా ఎడిట్ చెయ్యాలో మర్చిపొయ్యాను అంటె సరిగ్గా ఉంటుంది.

తెలిసినవారు ఆ బాక్సులో కూడా సమాచారం సరిచెయ్యగలరు. 2019-10-03T11:13:52(UTC)‎ User:Vu3ktb

User:Vu3ktb గారికి, నేను సరిచేశాను. --అర్జున (చర్చ) 07:23, 5 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]