చర్చ:బీరా ఆండ్రూ సూరజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యక్తిగత ప్రచారం[మార్చు]

ఈ వ్యాసం (బీరా సూరజ్) గతంలో వ్యక్తిగత ప్రచారం కింద తొలగించాము. మళ్ళీ వేరే పేరుతో ఈ వ్యాసం సృష్టించబడింది. ఈ వ్యాసం తొందర్లో తొలగించబడుతుందని గమనించండి. అభ్యంతరాలుంటే కింద రాయండి.- రవిచంద్ర (చర్చ) 06:43, 21 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్ల వికీలో విపరీతమైన వ్యక్తిగత ప్రచారం పేరుతో తొలగించారు. ఆ లింకు ఇక్కడ. https://en.wikipedia.org/w/index.php?title=Draft:Suraj_Beera&action=edit&redlink=1- రవిచంద్ర (చర్చ) 06:53, 21 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
గతంలో "సూరజ్ బీరా" అనే పేరుతో ఉన్న పేజీ ఇది. ఆ తొలగించిన పేజీనే మళ్ళీ సృష్టించారు. దాని తొలగింపుకు సంబంధించిన చర్చను చర్చ:సూరజ్ బీరా వద్ద చూడవచ్చు. వాడుకరి:Teluguthanam‎ గారూ, ఈ చర్చ పేజీలో పైన వాడుకరి:రవిచంద్ర గారు రాసినదాన్ని తీసేసారు. దానికి మీ సమాధానం రాయవచ్చు గానీ, చర్చా పేజీల్లో అలా తీసివెయ్యడం చెయ్యకూడదు. నేను దాన్ని వెనక్కి తీసుకెళ్ళాను. అలాగే వ్యాసం పేజీలో రవిచంద్ర గారు పెట్టిన తొలగింపు మూసను కూడా తీసేసారు. తొలగింపు ఎందుకు చెయ్యకూడదో రాయండి. అంతేగానీ, తగిన కారణంతో పెట్టిన మూసను చర్చ లేకుండా తీసెయ్యకూడదు. ఇకపై ఇలాంటివి చెయ్యకండి. __చదువరి (చర్చరచనలు) 09:36, 21 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యక్తి సూరజ్ బీరాపై అనేక జాతీయ కథనాలు వచ్చాయి. ప్రజలు కారణం లేకుండా అతని పేజీని తొలగిస్తున్నారు. మేము పేజీలోని మొత్తం ప్రచార కంటెంట్‌ను తీసివేసాము మరియు ఈ పేజీని పూర్తిగా ప్రచార రహితంగా చేసాము. అంతర్జాతీయ సంగీత ప్రసార సేవ అయిన స్పాటిఫై ద్వారా న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌లో ప్రదర్శించబడిన మొదటి తెలుగు వ్యవస్థాపకుడు మరియు కళాకారుడు సూరజ్ బీరా. Teluguthanam (చర్చ) 09:40, 21 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
అప్పుడు ఇచ్చిన "డబ్బులిచ్చి రాయించుకునే వ్యాసాల" మూలాలనే ఇప్పుడు కూడా మూలాలుగా ఇచ్చారు. అప్పుడు రాసిన ముగ్గురు వాడుకరులను స్పాము చేస్తున్నారనే కారణంతో స్టీవార్డులు నిషేధించారు. ఇప్పుడు ఈ పేజీని తొలగించాను. ఈ పేజీని మళ్ళీమళ్ళీ సృష్టిస్తే ఇప్పుడు కూడా స్టీవార్డులకు ఫిర్యాదు చెయ్యవలసి ఉంటుంది. __ చదువరి (చర్చరచనలు) 09:45, 21 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
వారికి జీతం ఇస్తున్నారని ఎవరు చెప్పారు. కథనాలలో ప్రచార లేదా బ్రాండ్ ట్యాగ్ లేదు. మీరు దానిని ఎలా నిర్ణయిస్తున్నారు? ఈ వ్యక్తిపై మీకు వ్యక్తిగత ద్వేషం ఎందుకు? Teluguthanam (చర్చ) 09:55, 21 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు, సర్. నేను మీ సూచనలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను మరియు మీరు సూచించిన విధంగా నియమాలకు కట్టుబడి ఉంటాను. మనం ఫోన్‌లో కూడా టచ్‌లో ఉండటానికి ఏదైనా మార్గం ఉందా? Teluguthanam (చర్చ) 09:43, 21 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఆంగ్ల వికీపీడియాలో వినియోగదారు వికీ తెలుగు వ్యతిరేక వ్యక్తి మరియు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు వికీపీడియాలో పేజీలను పెట్టడం ఇష్టం లేదు, అతను పేజీలను తొలగించకుండా భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నాడు. మీరు ఆన్‌లైన్‌లో కూడా తనిఖీ చేయవచ్చు వికీపీడియా పేజీలను తయారు చేస్తున్నారో 25,000- 50,000 రూపాయలకు మరియు జాతీయ కొత్తలో పెరోస్న్ ప్రదర్శించబడినప్పుడు కూడా పేజీలను తొలగించడానికి బ్లాక్‌మెయిల్ చేయడం ద్వారా దీన్ని వ్యాపారంగా మార్చడం. Teluguthanam (చర్చ) 09:46, 21 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
SIR, మీరు ఎటువంటి కారణం లేకుండా పేజీని ఎందుకు తొలగిస్తున్నారు? ప్రచార కంటెంట్ లేదు. ఇది చాలా తప్పు మరియు అన్యాయం. Teluguthanam (చర్చ) 09:48, 21 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియాలో చాలా నకిలీ మరియు చెల్లింపు పేజీలు ఉన్నాయి, మీరు వాటిని ఎందుకు తొలగించడం లేదు? Teluguthanam (చర్చ) 09:53, 21 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Teluguthanam గారూ,
  • ఇది ప్రచారమేనని నేను పైన చూపిన పాత చర్చ పేజీలో స్పష్టంగా తేలింది.
  • అందులో ఇచ్చిన మూలాలు డబ్బులిచ్చి రాయించుకున్న వ్యాసాలకు చెందినవని తేలింది.
  • స్పామర్లను స్టీవార్డులు నిషేధించారు కూడాను.
  • ఇదే స్పాము ఎన్వికీ, వికీడేటాల్లో కూడా చేసారని తేలింది.
ఆ వ్యాసాన్నే అలాంటి మూలాల తోనే మీరు మళ్ళీ సృష్టించారు. పై కారణాల వల్ల దీన్ని తొలగించడం సబబే.
పోతే, వికీపీడియాలో చెల్లింపు పేజీలున్నాయంటూ మీరు చేస్తున్న ఆరోపణకు అనుగుణంగా తగు ఆధారాలిస్తూ ఆ పేజీలను తొలగించే ప్రతిపాదన పెట్టండి. చర్చలో అలా తేలితే వాటిని తొలగించవచ్చు. అంతే గానీ ఊరికే ఆరోపణలు చెయ్యకండి. __ చదువరి (చర్చరచనలు) 10:15, 21 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]