Jump to content

చర్చ:బుద్ధావతారం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

దశవతారం

[మార్చు]

అవును.బుద్దుడు విష్ణువు యొక్క అవతారంకాదు.పాలగిరి (చర్చ) 15:40, 30 సెప్టెంబర్ 2013 (UTC)

బుద్దుడు విష్ణువు అవతారమేనా?

[మార్చు]

Bramhasri Samavedam Shanmukha Sarma గారు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వివరణ ను ఈ దిగువనుదహరింపబడినది.----K.Venkataramana (talk) 04:55, 26 అక్టోబర్ 2013 (UTC)


దశావతారాలలో " బౌద్ధ అవతారం అంటే గౌతమ బుద్ధుడా? అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది....
దాని గురించి పూజ్య గురువుదేవులు శ్రీ సామవేదం గారు "ఋషిపీఠం " పత్రిక 2002 జులై లో ప్రచురింబడ్డ "జిఙ్యాస అనే
శీర్షిక లో ఇచ్చిన సమాధనము మరోసారి గుర్తుచేసుకుందాము...
దశావతారాలలో "బౌద్ధవతారం" అంటే చరిత్రలోని గౌతమ బుద్ధుడేనా?
నమో బౌద్ధ అవతారాయ
దైత్యస్త్రీ మానభంజినే
అచింత్యాశ్వత్థ రూపాయ
రామాయాపన్నివారిణే
అని " శ్రీ మదాపన్నివారకరామస్తొత్రం" లో ఉంది. దీని గురించి తెలుప ప్రార్ధన" అని
ఒక పాఠకులు అడిగిన ప్రశ్న కి గురుదేవులు ఇలా వర్ణించారు..
దశావతారాలలో పేర్కొన్న బుద్ధుడు " గౌతమ బుద్ధుడు కాదు అని చెప్పుకోవాలి
దశావతారాలలో పేర్కొన్న బుద్ధుడు గౌతమ బుద్ధుడు కాదనే చెప్పుకోవాలి.
ప్రాచీన పురాణ వాఙ్మయాన్ని పరిశీలిస్తే ఈ విషియం స్పష్టమవుతుంది.
త్రిపురాసురుల భార్యలు మహాపతివ్రతలు. వారిపాతివ్రత్య శక్తి వల్ల త్రిపురలను ఎవరు జయించలేకపోతారు.
అప్పుడు ఆ శక్తిని ఉపసమ్హరింపచేయ్యడానికి లోకరక్షణ, ధర్మ రక్షణ కోసం శ్రీ మహా విష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు.
కాని ఆ బుద్ధుడు ,గౌతమ బుద్ధుడు అవతారాలు, రూపాలు వేరు !
సమ్మోహనకరమైన రూపముతో, ఒక అశ్వత్థ వృక్షమూలాన సాక్షాత్కరించిన అతనిని జూచి ,మోహితులై ,ధర్మాన్ని తప్పారు ఆ స్త్రీలు.
దానితో త్రిపురుల బలం క్షీణించింది. శివుని చేత హతులయ్యారు.
ఇదే విషియం "ఆపన్నివారక స్తోత్రము " లో ఉంది. "ద్వైత్యస్త్రీమనభంజినే" అంటే రాక్షస స్త్రీల పాతివ్రత్యాన్ని
భంగం చేసినవాడు అని అర్ధం.
ఇలాగ మన పురాణ్ణాలలో బుద్ధుడు గురించి చెప్పిన విషియము!
పైన వృత్తాంతాన్ని అన్నమయ్య "దశావతార వర్ణనలో" పేర్కొన్నాడు.
'పురసతుల మానములు పొల్లజేసినచేయి.
ఆకాసాన బారేపూరి
అతివలమానముల కాకుసేయువాడు"
ఆకాసాన విహరించే ఊరులు - త్రిపురాలు.
వారి మగువల ధర్మాన్ని తప్పించినవాడు. అప్పటి పరిస్థితుల బట్టి లోకరక్షణ కోసం స్వామి ధరించిన లీలావతారమిది.
ఆ బుద్ధునికీ గౌతమ బుద్ధునికి సంబంధం లేదు !


K.Venkataramana గారు, మూలంగా చేర్చాను.--అర్జున (చర్చ) 23:53, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]