చర్చ:భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం పేరుకు వ్యాసానికి తగినంతగా సంబంధం లేనట్టుగా ఉంది. దేవా 02:06, 22 అక్టోబర్ 2007 (UTC)

ఇలాంటి ట్రివియా కలెక్షన్ వికీపీడియాలో అనుమతించకూడదేమో? అని నా అనుమానం --వైజాసత్య 02:12, 22 అక్టోబర్ 2007 (UTC)
ఇవి చెల్లాచెదురు అవకుండా ఒక వర్గం సృష్టించి అందులో ఉంచితే మంచిది. చిట్టాగా గాని లిస్ట్‌లుగా గాని ఇవి మంచి సమాచారాన్ని అందిస్తాయి. కాని ఇలాంటి పేజీలకు ఒక ఫార్మాట్ ప్రతిపాదించి, దానికి అనుగుణంగా రచిస్తే బాగుండవచ్చు.దేవా 02:17, 22 అక్టోబర్ 2007 (UTC)

వ్యాసం విభజన[మార్చు]

ఈ జాబితాను దీక్షతో విస్తరిస్తున్న చంద్రకాంత్‌కు అభినందనలు. వ్యాసం నిడివి ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున దీనిని విభజించి, 'భారత దేశం జాబితాలు' అన్న పోర్టల్ ద్వారా లింక్ చేస్తే బాగుంటుంది. అంటే, ఉదాహరణకు ఈ జాబితాలో "మొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత" పేరు ఉంటుంది. మరో జాబితాలో మొత్తం " జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు" పేర్లు ఉంటాయి. చంద్రకాంత్! దేవా! వీటికి తగిన ఫార్మాట్‌లను ప్రతిపాదించండి.

"ఇలాంటి ట్రివియా కలెక్షన్ వికీపీడియాలో అనుమతించకూడదేమో" ఎందుకు కూడదు? ఉచితమేనని నా అభిప్రాయం --కాసుబాబు 04:43, 9 డిసెంబర్ 2007 (UTC)

విద్యార్థులకు, అద్యాపకులను, పోటీపరీక్షలకు తయారయ్యే నిరుద్యోగులకు, సమాచారం కోసం అన్వేసించే నెటిజన్లకు ఇలా ప్రతిఒక్కరికీ ఉపయోగపడే విధంగా సమాచారం మొత్తం ఒకే చోట ఉంటేనే బాగుంటుందని నాఅభిప్రాయం. చిన్న చిన్న జాబితాలుగా విభజిస్తే సమాచారం ముక్కలయ్యే ప్రమాదం ఉంది. సమాచారం తిప్పి తిప్పి చూడడానికి అంత ఓపిక, నేర్పు అందరికీ ఉండకపోవచ్చు. అయినా ఎవరైనా తగిన ఫార్మాట్ తయారుచేస్తారంటే చూద్దాం.C.Chandra Kanth Rao 13:47, 9 డిసెంబర్ 2007 (UTC)

కొంత వ్యాసాలలో రిడండన్సీ ఉండటంలో ఇబ్బందేమీ లేదని నా అభిప్రాయం. ఇలా ఒక పొడుగాటి జాబితాను అలాగే ఉంచి. చిన్న చిన్న జాబితాలు కూడా చేయవచ్చు. కాకపోతే మరీ చిన్న విస్తృతి (స్కోపు) ఉన్న జాబితాలు చేయకుండా ఉంటే బాగుంటుంది --వైజాసత్య 18:16, 10 డిసెంబర్ 2007 (UTC)
వైజాసత్య గారూ ! నేను అనుకున్నదే మీరు చెప్పారు. ఈ వ్యాసాన్ని ఇలాగే వదిలేద్దాం. సమాచారం మొత్తం ఒకే వ్యాసంలో ఉంటుంది. చిన్న వ్యాసాలు కూడా సృష్టిద్దాం. ఎవరికి ఎలా అవసరమనుకుంటే వారలా ఉపయోగించుకుంటారు. చిన్న వ్యాసాలకు ఒకదానితో మరొకటి మరియు ఈ పేజికి లింకిస్తే సరిపోతుంది.C.Chandra Kanth Rao 18:25, 10 డిసెంబర్ 2007 (UTC)
కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.

శీర్షిక అర్థవంతంగా లేదు[మార్చు]

ఈ శీర్షిక అర్థవంతంగా లేదు.భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు అంటే శీర్షిక చూడగానే హోమో సేపియన్స్ వలసలు అనే మరో అర్థం సూచిస్తుంది. శీర్షిక కాస్త పొడవుగా ఉన్న "విభిన్న రంగాలలో భారతదేశపు మొట్టమొదటి వ్యక్తులు" లేదా ఇదే అర్థాన్ని సూచించే మరో పేరుతో నైనా మార్చితే వ్యాసానికి తగిన అర్థవంతంగా ఉంటుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయాలు తెలుపగలరు. యర్రా రామారావు (చర్చ) 16:38, 11 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]