చర్చ:మాచర్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్రహ్మనాయుని గెలుపు?

[మార్చు]

@68.126.149.46 ఇందులో బ్రహ్మనాయుడు గెలిచాడన్న వాక్యం ఎందుకు తీసేసానంటే 1)బ్రహ్మనాయుడు ఆ యుద్ధంలో గెలవలేదన్నది చారిత్రక సత్యం. 2)బ్రహ్మనాయుడు రాజు కాదు.కేవలం మంత్రి మాత్రమే. నాగమ్మ పక్షం గెలిచినా, బ్రహ్మనాయుని పక్షం గెలిచినా పర్వవసానాలు మారే స్థితిలో లేవు. చరిత్రలో చాలా చిన్న యుద్ధం పల్నాటి యుద్ధం. కానీ ఎందుకు ప్రముఖమైందో వివరిస్తూ కాకతీయ సామ్రాజ్య విస్తరణకు మార్గం సుగమం చేసిందని రాశాను. --వైజాసత్య 00:17, 29 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మాచర్ల - మాచెర్ల

[మార్చు]

వికీపీడియాలో మాచర్ల, మాచెర్ల అనే రెండు పేర్లు వాడుకలో ఉన్నాయి. బయట కూడా ఈ రెండు పేర్లూ వాడూకలో ఉన్నాయి. ఏయే పేరు ఎలా వాడుతున్నారో గమనిస్తే ఫలితాలు ఇలా ఉన్నాయి:

  1. గూగుల్లో:
    • మాచెర్ల గుంటూరు -wikipedia.org, -macherla, -macharla అని వెతికితే (గుంటూరుకు చెందిన మాచెర్ల అయి ఉండాలి, వికీపీడియాలో ఫలితాలు రాకూడదు, ఇంగ్లీషు పేర్లు macherla, macharla అనేవి ఫలితాల్లో రాకూడదు): 9,940 ఫలితాలొచ్చాయి.
    • మాచర్ల గుంటూరు -wikipedia.org, -macherla, -macharla అని వెతికితే (గుంటూరుకు చెందిన మాచర్ల అయి ఉండాలి, వికీపీడియాలో ఫలితాలు రాకూడదు, ఇంగ్లీషు పేర్లు macherla, macharla అనేవి ఫలితాల్లో రాకూడదు): 41,700 ఫలితాలొచ్చాయి.
  2. https://guntur.nic.in/te/గ్రామాలు/ అనే ప్రభుత్వ సైట్లో: మాచర్ల అని ఉంది.
  3. meebhoomi.ap.gov.in సైటులో మాచర్ల అని ఉంది.
  4. మాచర్ల రైల్వే స్టేషను బోర్డు: తెలుగులో మాచర్ల అని, హిందీ, ఇంగ్లీషుల్లో మాచెర్ల అనీ రాసి ఉంది. (ఊరి పేరు మీద రైల్వే వారి గౌరవం ఇది!)
  5. గూగుల్ మ్యాప్స్: మాచెర్ల అంటోంది.

అన్నిటినీ గమనిస్తే మాచర్ల అనేది ఎక్కువగా వాడుకలో ఉంది అని తెలుస్తోంది. అందుచేత శీర్షికలో మాచెర్ల అని ఉన్న పేజీలన్నిటినీ మాచర్ల కు తరలిస్తూ, మాచెర్లను దారిమార్పుగా ఉంచుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 05:52, 28 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]