చర్చ:ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రాజెక్టు సమాచారం

[మార్చు]
వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పుస్తకాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


జాబితా పరిధి

[మార్చు]

ఇది నాకు నచ్చిన పుస్తకాల జాబితా వంటిది కాదు. అన్ని పుస్తకాలు, రచయితల జాబితా అంతకంటే కాదు.


ఇది వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా చేయబడిన తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం కలిగిన పుస్తకాల జాబితా. ఈ జాబితాలో ఏ పుస్తకాలు చేర్చబడినాయో, ఇంకా ఎలాంటివి చేర్చవచ్చునో వంటి వివరాలు ఇక్కడ వివరించబడినాయి. ఈ జాబితాను విస్తరించడానికి స్పష్టమైన విధానాన్ని వాడండి.

ఈ జాబితాలోని పుస్తకాలు ఎంపిక చేయడంలో ఈ క్రింది పరిధులు పరిగణించబడినాయి.


ప్రాచీన రచనలు

[మార్చు]

(1870 ముందు వెలువడినవి)

  • పింగళి లక్ష్మీ కాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర, ద్వారకానాధ శాస్త్రి - తెలుగు భాషా చరిత్ర: ఈ రెండు రచనలలో ఆయా కవుల, రచనల గురించి వ్రాసే సందర్భంలో 'ఇది ముఖ్యమైన రచన', 'విశిష్ట స్థానం ఉన్నది' వంటి విశేషణాలు వాడినవి
  • అష్ట దిగ్గజాలలో ఒక్కొక్కరిది కనీసం ఒక్కొక్క రచన

ఈ రచనలు అవి వెలువడిన కాలం అనుగుణంగా (షుమారుగా) జాబితాలో ఇవ్వబడినాయి.

ఆధునిక రచనలు

[మార్చు]

ఈ రచనలు ఆయా విభాగాలలో అకారాది క్రమంలో ఇవ్వబడ్డాయి.

జాబితా విస్తరణ

[మార్చు]

ఇది మీకు ఇష్టమైన పుస్తకాల జాబితా కాదు. అలాగని ఈ జాబితాను మఅర్చకూడదని లేదు.

  • పైన ఉన్న మార్గ దర్శకాలకు అనుగుణంగా ఇంకా పుస్తకాలను ఈ జాబితాలో చేర్చవచ్చును.
  • ఫైన ఉన్న మార్గదర్శకాలను కూడా మీరు మార్చవచ్చును. అందుకు అనుగుణంగా జాబితాను మార్చవచ్చును. ఏ వైనా మార్పులు చేసినపుడు కారణాలు చర్చాపేజీలో వ్రాయండి.
  • ఒక్కో రచయిత, లేదా సబ్జక్టు గురించిన పుస్తకాలు వ్రాయాలంటే అందుకు వేరే జాబితాలు తయారు చేయండి. స్పష్టమైన ఎన్నుకొనే ప్రమాణాలు లేకుండా ఈ జాబితాను పెంచవద్దు.
  • ఏదైనా పుస్తకం గురించి వ్యాసం వ్రాయాలంటే నిస్సంశయంగా వ్రాయండి. స్వాగతం. ఆ పుస్తకం ఈ జాబితాలో ఉండాలని నియమం లేదు.

ఈ జాబితాలో 'ఇస్లామీయ పుస్తకాలు' అనే అంశాన్ని కూడా చేర్చితే బాగుంటుంది.

ఈ చర్చా పేజీ జాబితా కూర్పుల రచయితలు

[మార్చు]

ఈ జాబితాలో చలం పుస్తకాలు చేర్చడం గురించి

[మార్చు]

శివా! ఈ జాబితాలో మీరు చలం పుస్తకాలు చాలా చేర్చారు. ఈ జాబితా ఉద్దేశ్యమూ, అందులో ఉంచాల్సిన పుస్తకాల పరిధిని గురించి పైన వివరంగా వ్రాశాను. పరిశీలించండి. చలం పుస్తకాల గురించి వ్రాయడానికి అవి ఈ జాబితాలోనే ఉండాల్సిన అవుసరం లేదు. చలం రచనల జాబితా వ్యాసం చాలును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:46, 20 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నిజమే! తరువాత గమనించాను, సరిచేస్తాను.--SIVA 08:39, 20 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీలత మన: తృష్ణ

[మార్చు]

శ్రీలత గారు రచించిన మన: తృష్ణ గురించి వెతికాను, దొరకలేదు. అంత ప్రాముఖ్యము కాని పుస్తకము ఇక్కడ అవసరము లేదు అని చిదివిన తరువాత తీసివేశాను. కిరణ్మయీ 16:48, 27 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]