Jump to content

చర్చ:రాంచీ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

"టైం జోన్" ని "సమయ ప్రాంతం" గా రాశాము, ఎవరైనా ఈ మూసను మార్చగలరా? Navamoini 17:14, 26 అక్టోబర్ 2009 (UTC)

భారతదేశంలో ఒకే టైంజోన్ ఉంది కాబట్టి దేశంలోని అన్ని ప్రాంతాలు ఒకే జోన్‌కు అనగా గ్రీనిచ్+5.30 కు చెందుతాయి. మూసలో సరిగానే ఉంది. మీరు రాసినదానికి ఈ సమాధానం కాదనుకుంటే మళ్ళీ అడగండి. -- C.Chandra Kanth Rao-చర్చ 18:53, 26 అక్టోబర్ 2009 (UTC)

చంద్రకాంత్ గారు, మూసలో "టైం జోన్" అని ఉంది. కానీ కొన్ని వేరే మూసలలో "సమయ ప్రాంతం" అని రాసి ఉంది. కాబట్టి "టైం జోన్" అని వాడే కన్న అన్ని చోట్ల "సమయ ప్రాంతం" అని రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ మూసను ఎలా దిద్దాలో నాకు తెలియదు, అందుకని సహయం అర్థిస్తున్నాను. Navamoini 19:08, 26 అక్టోబర్ 2009 (UTC)

మీ సమస్య ఇప్పుడు అర్థమైంది. కాని దాన్ని మార్పు చేయాలంటే ఈ పేజీ మూసలో కాకుండా ప్రధానమూసలో మార్పు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ మూస ఉన్న అన్ని వ్యాసాలలో మార్పు వస్తుంది. కాబట్టి మిగితా సభ్యుల అభిప్రాయాలు కూడా తీసుకుందాం. -- C.Chandra Kanth Rao-చర్చ 20:30, 26 అక్టోబర్ 2009 (UTC)

తప్పకుండా , తెలుగు మాధ్యమం పుస్తకాలలో "కాలాంశం" అని చదివినట్టుగా గుర్తు, "కాలాంశం" అని మారిస్తే బాగుంటుంది. ఆలోచించండి Navamoini 22:23, 26 అక్టోబర్ 2009 (UTC)

అవును, బాగా గుర్తు చేశారు టైంజోన్ని కాలాంశం అంటారు. అక్షాంశము, రేఖాంశము లాగా అన్నమాట --వైజాసత్య 05:19, 27 అక్టోబర్ 2009 (UTC)
చర్చ:భారత ప్రామాణిక కాలమానం లో కొంతచర్చ జరిగింది అప్పుడూ సమయప్రాంతం అసలు వాడుకలో లేనిది అని కూడా అనుకున్నాం కానీ. కాలాంశం అంటారని గుర్తుకురాలేదు --వైజాసత్య 05:23, 27 అక్టోబర్ 2009 (UTC)

రాంచీ గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి