చర్చ:రామాయణం జరిగినదేనా?
స్వరూపం
ఈ వ్యాసం ఉండదగినది కాదు
[మార్చు]వ్యాసంలో కింది సమస్యలున్నాయి.
- మూలాలు అస్సల్లేవు. పైగా వివాదాస్పద విషయాలు రాసారు. ఒక వర్గపు ప్రజల విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉంది. స్వంత అభిప్రాయాలు రాసారు. - పూర్తిగా స్వకపోల కల్పితం లాగా ఉంది. తక్షణం తొలగించాలి. అంచేత తొలగిస్తున్నాను.
ఇంకా ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. మచ్చుకు కొన్ని:
- ఎవరో అజ్ఞాత ఎక్కడి నుండో కాపీ చేసి పెట్టినట్టుగా తోస్తోంది (నిర్ధారణగా తెలియదు) - కాపీహక్కుల ఉలంఘన కావచ్చు.
- "దైవ శక్తులు ఉన్న హనుమంతుడు కూడా హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఔషధ మొక్కలను గుర్తుపట్టలేక ఏకంగా పర్వతాన్నే ఎత్తుకురావడం విడ్డూరం." - కోడిగుడ్డుపై ఈకలు పీకడం లాంటి ఇలాంటి వాక్యాలున్నై.
- "ఉదాహరణకు దానిమ్మ రసం చనిపోయే వ్యక్తికి ఇస్తే అతడు మరి కొన్ని రోజులు బ్రతికే అవకాశమున్నది." లాంటి మూఢ నమ్మకాలు (ఇలాంటివి గట్టి మూలం లేకుండా రాస్తే దాన్ని మూఢ నమ్మకమే అంటారు) రాసారు.
- అసలు వ్యాసాన్ని వదిలేసి, ఒక చిన్న శాఖను (కిరాతులు) పట్టుకుని వ్యాసంలో 70% రాసారు. బాపు రమణలు చెప్పినట్టు కోతి కొమ్మచ్చి ఇది.
మొత్తమ్మీద ఈ వ్యాసం, పుస్తకాలు రాసి ప్రచురించుకోడానికి పనికొస్తదేమో గానీ, వికీపీడియా లాంటి విజ్ఞాన సర్వస్వానికి పనికే రాదు. తొలగించేస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 02:11, 18 మార్చి 2020 (UTC)
- ఇప్పటికే ఈ వ్యాసాన్ని రెండు సార్లు తొలగించారు, ఇది మూడోసారి. ఈ పేరుతో ఉన్న పేజీని సంరక్షించాను. భవిష్యత్తులో ఇలాంటి పేరునే పెట్టి, ఇలాంటి పాఠ్యం తోటే, ఇలాగే మూలాలు లేకుండా వ్యాసం రాస్తే, దాన్ని నేరుగా తొలగించడమే కాకుండా, దాన్ని దుశ్చర్యగా భావించి సదరు వాడుకరిపై సందర్భానుసారం (లాగినైన వాడుకరి అయితే హెచ్చరిక, అజ్ఞాత అయితే నిరోధం వంటివి) తగు చర్య తీసుకోవచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 02:18, 18 మార్చి 2020 (UTC)
- చదువరి గారు, మంచి పని చేసారు. దీనిమీద మనం ఓ కన్నేసి ఉంచుదాం. రవిచంద్ర (చర్చ) 06:35, 18 మార్చి 2020 (UTC)