చర్చ:లెనిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసంలో -

  1. రచయిత అభిప్రాయాలు కనిపిస్తున్నాయి.. ముఖ్యంగా ఈ చివరి వాక్యాలు.. "అధికారం కోసం మనుషుల్ని అరమరికలు లేకుండా హతమార్చి దానికి సిద్ధాంతపు తొడుగు చూపిన లెనిన్ ఈ శతాబ్దంలోని స్టేట్ టెర్రరిజానికి పితామహుడు. ఆయన్ను స్మరించకుండా టెర్రరిస్టు ఎవరూ తమ కృషిని సాగించలేరేమో."
  2. మిగతా చోట్ల కూడా మూలాలు చూపించవలసిన అవసరం ఉంది.
__చదువరి (చర్చరచనలు) 02:55, 19 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

1985 తరువాత కాలంలో కొన్ని తెలుగు పత్రికలలో నరిశెట్టి ఇన్నయ్య లెనిన్ కు వ్యతిరేకగా వివాదాస్పద వ్యాసాలు వ్రాసాడు. ఆ వ్యాసాలు నిరాధారమైనవి కాబట్టి వాటి నుంచి సేకరించిన కథనాలని తొలిగిస్తున్నాను.

ఇన్నయ్య గోర్బచేవ్ ప్రభావిత ప్రతిరోధకవాది. అతను గోర్బచేవ్ కాలంలో వ్రాసిన వ్యాసాలని నమ్మలేము.

పైన చదువరి గారు వ్రాసిన వ్యాఖ్యలు చదవలేదా. ఈ వ్యాసంలో ఇన్నయ్యగారి పాఠ్యంతో సమస్యలున్నాయని గుర్తించాం. కానీ ఇన్నయ్యను నమ్మకూడదు లాంటి బ్లాంకెట్ స్టేట్‌మెంటులు చేస్తే మీరు వ్రాసినవి కూడా ఎందుకు నమ్మాలి? ఆ పాఠ్యంలో తగుమార్పులు చెయ్యాలనే ఒక నోటీసు పెట్టారు కదా. ఈ తొలగింపులు, ప్రతిస్థాపన యుద్ధాలను ఆపండి. ఇస్లాం వ్యతిరేకంగా శటానిక్ వర్సెర్ వ్రాస్తే సల్మాన్ రధ్దీ గొప్పవాడయ్యాడు. లెనిన్ ను ఇన్నయ్య గారు విమర్శిస్తే మాత్రం ఇది వివాదాస్పదమయ్యింది. ఇందులో ఇన్నయ్యగారు సరైన ఆధారాలు లేని చాలా సొంత వ్యాఖ్యలు చేశారని ఒప్పుకుంటాను. అవి తొలగించి వీలైతే సరిచేయండి --వైజాసత్య 05:19, 10 డిసెంబర్ 2008 (UTC)

కమ్యునిజం - లెనిన్ పరిపాలన[మార్చు]

కమ్యునిజం భావాలు ఎంతో ఉన్నతమైనవి. కాని లెనిన్ పరిపాలన అంతా నియంతృత్వ భావాల తో జరిగంది. కారల్ మార్క్స్ బావాలకు పుర్తిగా విరుద్దం.