Jump to content

చర్చ:వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


విషయాలను సర్దుబాట్లు చేశాను.Kumarrao 05:32, 8 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చారిత్రకముగా వ్రాయబడిన విషయములు ఉటంకించబడ్డాయి. సంఘటనలు తార్కికముగా సాధ్యమా కాదా అనేది అప్రస్తుతము. నాయుడుగారిని చెంచులు ద్వేషించుట సమర్ధనీయమా గాదా అనేది చరిత్రకు వదిలివేద్దాము.Kumarrao 07:22, 28 ఆగష్టు 2008 (UTC)
హంతకుడైన ఇతని పశ్చాత్తాపం అమరులైన చెంచుల్ని తిరిగి తెస్తుందా అని చెంచుల వాదన చెంచు అమర వీరుల గాధలు పాటలుగా వారు పాడుతారు.అందులో వాసిరెడ్డి నాయుళ్ళను నరహంతకులుగా ద్వేషిస్తారు.అయితే బడుగు వర్గాల అమర వీరులచరిత్ర వెలుగులోకి రాలేదు.ఇప్పటికైనా ఎరుకల చెంచులు యానాది ప్రజలు వారి పండుగ పబ్బాలలో పాడుకునే పాటలు సేకరించితే అసలు చరిత్ర వెలుగులోకి వస్తుంది.
చనిపోయినవారెవరూ తిరిగిరారు. సామ్రాట్ అశోకుడు చంపిన లక్షలాది కళింగులు ఆయన బౌద్ధమతము స్వీకరించినంత మాత్రాన బ్రతికివచ్చారా? విషయము మనస్సులోని పరివర్తనకు సంబంధించినది. మీరు చెంచులు, యానాదులు, ఎరుకల గురించి వికీలో వ్రాయండి. వారి చరిత్ర వెలుగులోనికి తీసుకు రండి. స్వాగతము.Kumarrao 11:14, 28 ఆగష్టు 2008 (UTC)
అవును అశోకుడు హంతకుడే.హంతకుల ఏ పరివర్తనా, మతావలంబనా మృతులను బ్రతికించలేదు.చంపినవా ళ్ళు ఏమతస్తులైనా హంతకులే అవుతారు.ఆ పాపం వారిని వదలదు. హతులైన కళింగ అమాయకవీరుల చరిత్రకూడా వెలుగులోనికి తీసుకు రావాలి.
మీరు తప్పక ఈ పని చేయాలి. యూసర్ పేరుతో లాగిన్ అయ్యి, నాలుగు టిల్డీస్ తో సంతకము చేస్తూ, వికీపీడియాలో మీరు వ్రాయు వ్యాసములకొరకు ఎదురుచూస్తాను.Kumarrao 11:06, 29 ఆగష్టు 2008 (UTC)
అయ్యా మీరేవరో కానీ నమస్కారం. మీ అభిప్రాయానికి సంతోషించినాము. ఎవరు మంచివారు అని నిగ్గు తేల్చటం వికీపీడియా పరిధిలో లేని అంశం. దాన్ని చర్చించటానికి మరేదైనా వేదిక సమంజసం. --వైజాసత్య 23:02, 29 ఆగష్టు 2008 (UTC)
ఇతనిని చెంచులే కాదు పూరావస్తుశాఖవారు కూడా ద్వేషిస్తారు.చింతపల్లి నుంచి అమరావతికి వలస వచ్చినప్పుడు నూతన భవన నిర్మాణం కోసం స్థూపాన్ని, కోటని ధ్వంశపరినాడు. పురావస్తుశాఖ వారి ఆంగ్లపుస్తకము అమరావతి హెచ్. సర్కార్ మరియు యస్పీ నాయర్ 2007.
రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అను జమీన్‌దారుడు తన రాజధానిని చింతపల్లి నుండి అమరావతికి మార్చి ఇక్కడ ఒక పట్టణమును, తాను నివసించుటకు గొప్ప భవనమును నిర్మించుకొనుటకు నిశ్చయించుకొనెను. అప్పుడు కావలసిన రాతికొరకు అమరావతికి పడమరగా చేరువనున్న పురాతన నగరమయిన ధరణికోట యొక్క గోడలను, అందలి దిబ్బలను త్రవ్వించెను. అట్లు త్రవ్వించిన దిబ్బలలో దీపాల దిన్నె ఒకటి. దీనిలోనే పూర్వపు బౌద్ధస్తూపము ఉండెను. అతని జనము ఈ స్తూపమునుండి పెద్ద పెద్ద యిటికలను, పాలరాళ్లను త్రవ్వించి తీసికొని పోయిరి.