చర్చ:వెలిగండ్ల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రసాద్ గారూ మండల వ్యాసంలో గ్రామ వ్యాసం సమాచారపెట్టె అవసరంలేదు.అలాగే గ్రామ వ్యాసంలో మండల సమాచార పెట్టె అవసరంలేదు. అలాగే గ్రామ వ్యాసానికి మండలంలోని గ్రామాలు మూస, మండల వ్యాసానికి జిల్లాలోని మండలాల మూస మాత్రమే తగిలించాలి. రెండిటికీ ఒకే వ్యాసం అయితే రెండూ ఉండాలి. ఇది ప్రాధమిక సూత్రం. మనం ఇప్పుడు మండలానికి ప్రత్యేక పేజీలు సృష్టిస్తున్నాం. కనుక గమనించగలరు. ఏమి అనుకోవద్దు. గ్రామ వ్యాసాల మార్గదర్శకాలు ఇక్కడ పరిశీలించగలరు.--యర్రా రామారావు (చర్చ) 12:30, 8 ఫిబ్రవరి 2019 (UTC)

యర్రా రామారావు మీరు చెప్పినది నిజమేనండి. కానీ నేను ఈ సమాచార పెట్టెలు అవగాహన గురించి నేను పని చేసి చాలాకాలం అయ్యింది. నేను సరి చేయాలంటే నాకు ప్రస్తుతం ఎలా చేయాలో జ్ఞాపకం లేదు. ప్రస్తుతం నేను ఇతర తెవికీ పెద్దలు చేస్తున్న అనుసరిస్తున్న విధానంలోనే వారి అడుగుజాడలలో నా వంతుగా తెలుగు సేవలు చేస్తున్నాను. నాకు ఒకసారి ఎలా చేయాలో ఎవరైనా గుర్తు చేస్తే ఇంక ముందు ఇటువంటి సమస్య రాకుండా చూడగలను. నేను ఏదైనా స్వంతంగా పెద్ద మార్పులు చేస్తే, అటువంటి చేసిన పనులు మీద నన్ను సరిగా అర్థం చేసుకోక అపార్థం చేసుకునే అవకాశం ఉన్నది. ఇప్పటికే నా మీద సదుద్దేశ్య మనసులు కొరవడినాయి. ఇటువంటి విపత్కర పరిస్థితులలో ఎంతో భయంతో నా వంతు పని చేస్తున్నాను. నన్ను మంచి మనసుతో అర్థం చేసుకునే వాళ్ళు తెవికీలో పెరిగిన తదుపరి, మీరు చెప్పిన పనులు ధైర్యంగా చేయగలను. నేను నిరంతర విధ్యార్ధిని, ఎవరు ఏ విషయము తెవికీ గురించి మంచి మనసుతో చెప్పినా, తప్పకుండా నేర్చుకుని ముందుకు వెళ్ళతాను, నేను ఏమీ అనుకోను. మీకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 12:47, 8 ఫిబ్రవరి 2019 (UTC)
యర్రా రామారావు గారు, మండలాలు పేజీలు సరిచేశానండి.JVRKPRASAD (చర్చ) 12:52, 9 ఫిబ్రవరి 2019 (UTC)