Jump to content

చర్చ:సాధారణ తెలుగు పదాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఇలా కాకుండా గృహోపకరణాలకు ప్రత్యేక వర్గం పెట్టి దానిలో ఖనిజఉపకరణాలు, కొయ్య ఉపకరణాలు, వస్త్రౌపకరణాలు, విద్యుదాదార ఉపకరణాలు, ఇతర గృహ ఉపకరణాలు, ఇలా విడగోడితే బావుంటుందిగా.. తరువాత మిగిలి వాటిని "వాడుక పదాలుగా మరొక వర్గం విడగొట్టవచ్చు...ఏమంటారు..విశ్వనాధ్. 07:27, 23 అక్టోబర్ 2007 (UTC)

ఈ వ్యాసపు ఉచితజ్ఞత..!?

[మార్చు]

తెలుగు పదాలను ఒక జాబితాగా పేజీలో చేర్చడం అవసరమా అనే ప్రశ్న ఎదురైంది నాకు. నాకున్న కారణాలు:

  • అసలు పదాలకు పేజీ ఎందుకు? ప్రవేశిక/ఉపోద్ఘాతమంటూ ఒకటి రాయలేని వ్యాసం వికీకి ఎందుకు?
  • చాలా జనరిక్‌గా ఉన్నది ఈ జాబితా. తెలుగులో ఉన్న పదాలన్నిటినీ చేర్చవచ్చు ఈ పేజీలో -అంత విస్తృతమైనది దీని పరిధి. ఎవరైనా ఏదైనా పదాన్ని చేర్చుకుంటూ పోవచ్చు. అది వికీలో ఉండదగినది కాదని నా ఉద్దేశం.
  • ప్రత్యేకంగా ఫలానా పదాలను మాత్రమే చేర్చవచ్చు అంటూ నిబంధన పెట్టి ఉంటే అదొక రకంగా ఉండేది బహుశా. లుప్తమైపోతున్న అక్షరాలతో ఏర్పడిన పదాలు అనో, వ్యవసాయంలో ఉపయోగించే పదాల జాబితా అనో, 20 వ శతాబ్దంలో విస్తృతంగా వాడి, ప్రస్తుతం అంతగా వాడుకలో లేని పదాలు అనో, ప్రబంధ కవులు మాత్రమే వాడిన పదాలు అనో,... ఇలా ఒక ప్రత్యేకత కలిగిన పదాలను ఒకచో చేర్చి, తగు ప్రవేశికతో, మౌలిక పరిశోధన లేకుండా, సముచిత మూలాలతో రాస్తే చక్కటి వ్యాసాలు అవుతాయి.

అయితే, ఈ వ్యాసంలో అనుభవజ్ఞులైన వాడుకరులు పాల్గొన్నారు. చాలా సమయం పెట్టారు. వారు ఏదో ఒక ఉచితజ్ఞతను గమనించే ఈ వ్యాసం రాసి ఉంటారు. అంచేత నా అభిప్రాయాన్ని వారిలో ప్రస్తుతం చురుగ్గా ఉన్న వారి ముందు (@Rajasekhar1961:, @B.K.Viswanadh:) చర్చకు పెడుతున్నాను. ఆ విధంగా ఒక సముచిత నిర్ణయం తీసుకోవచ్చని నా ఉద్దేశం. __చదువరి (చర్చరచనలు) 16:48, 5 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు మీరు చెప్పింది నిజం. ఇది అప్పట్లో వ్యాసాలు లేని పనిముట్లు, ఉపకరణాలు ఏవో తెలియడానికి మరియు కొత్తవాడుకరులు ఆ జాబితా నుండి తీసుకొని వ్యాసాలు రాయడానికి, తెలిసిన అన్ని జాబితాలో చేర్చుతూ తయారుచేయబడినది..ఇక ఇపుడు అవసర్ం లేదంటే లేని వ్యాసాలను (ఎరుపు) వరకూ ఉంచి మిగతా లిస్ట్ తీసేయవచ్చు. తదుపరి రాయవలసిన వాటిని మరేదైనా జాబితాకు తరలించ వచ్చు అని నా అభిప్రాయం..B.K.Viswanadh (చర్చ) 09:17, 8 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]