చర్చ:సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
స్వరూపం
వ్యాసం పేరు
[మార్చు]ఈ వ్యాసం పేరును సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గా మార్చాలని ప్రతిపాదిస్తున్నాను. హిందీలో सुशांत सिंह राजपूत అని రాశారు. దీని యదాతథంగా తెలుగులో రాస్తే సుశాంత్ సింహ్ రాజ్‌పూత్ అని రాయాలి. కానీ ఈ పదం చాలా తక్కువగా వాడుకలో ఉంది. మిగతా సభ్యులు తమ అభిప్రాయాలు తెలియజేయగలరు. గూగుల్ శోధనలో ఫలితాలు ఇలా ఉన్నాయి.
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ - 1,50,000
- సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ - 10,400
- సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ - 670
- సుషాంత్ సింఘ్ రాజ్‌పుట్ - 180
- సుశాంత్ సింహ్ రాజ్‌పూత్ - 80
- సుశాంత్ సింఘ్ రాజ్‌పూత్ - 0
- రవిచంద్ర (చర్చ) 14:46, 8 సెప్టెంబరు 2020 (UTC)
- "సుశాంత్ సింగ్ రాజ్‌పుత్" పేరు ఎక్కువ వాడుకలో ఉన్నట్లు తెలుస్తుంది. హిందీలో सुशांत सिंह राजपूत, కన్నడంలో ಸುಶಾಂತ್ ಸಿಂಗ್ ರಾಜ್ಪೂತ್ అనే శీర్షికతో వ్యాసాలున్నాయి. రెండింటిలో "రాజ్ పూత్" అని ఉన్ననూ తెలుగులో అంతర్జాలంలో శోధించగా ఎక్కువగా "రాజపుత్" వాడుకలో ఉన్నట్లు తెలుస్తుంది. కనుక రవిచంద్ర చెప్పినట్లు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కు శీర్షికను మార్చితే బాగుంటుంది. K.Venkataramana(talk) 15:17, 8 సెప్టెంబరు 2020 (UTC)
- ఇటీవలే నేను ఒక చర్చలో హిందీ భాషను అనుకరించవద్దని చెప్పింది సరిగ్గా ఇలాంటి వాటికే. హిందీకీ తెలుగుకు ఉచ్ఛారణలో చాలావాటికి తేడా ఉంటుంది. "సింగ్"యే సరైనది. ఉత్తరభారతం సంప్రదాయం ప్రకారం ఇది తప్పు కావచ్చు కాని తెలుగు సమాజంలో ఎలా వాడుకలో ఉంటే దాన్నే అనుసరించడం తెవికీ నియమం. సి. చంద్ర కాంత రావు- చర్చ
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ "సింగ్"యే సరైనది, శీర్షికను మార్చితే బాగుంటుంది. ప్రభాకర్ గౌడ్ నోముల 04:52, 10 సెప్టెంబరు 2020 (UTC)
- స్పందించిన User:K.Venkataramana , సభ్యుడు:C.Chandra Kanth Rao, వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గార్లకు ధన్యవాదాలు. ఈ వ్యాసాన్ని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కి దారి మారుస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 05:40, 10 సెప్టెంబరు 2020 (UTC)