Jump to content

చలువ పందిరి

వికీపీడియా నుండి
చలువ పందిరి

పండుగ సమయంలో, పెళ్ళిళ్ళ సమయంలో, ప్రారంభోత్సవాల సమయంలో, తిరునాళ్ళ సమయంలో ద్వారం ముందర పచ్చని ఆకులతో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న పందిరిని చలువ పందిరి అంటారు.

పచ్చని ఆకులతో వేసుకున్న పందిరి కింద ఎండ జామున కూడా చల్లగా ఉంటుంది కాబట్టి దీనిని చలువ పందిరి అంటారు.

శ్రీరామనవమి నాడు భద్రాచలంలో పెద్ద పెద్ద చలువ పందిళ్ళు వేస్తారు.

చలువ పందిరి (షేడ్ హౌస్)

[మార్చు]

షేడ్ హౌస్ అనేది ఒక నీడనిచ్చే పందిరి వంటిది – నాలుగు ప్రక్కలా అగ్రోనెట్ (సాధారణంగా ఆకుపచ్చని రంగులో కనిపించే వలలు) తో గానీ లేక ఇతర విధంగా నేయబడిన వలల వంటి వాటితో గాని, కప్పివేయబడివుండి, అవసరమైన మేరకు సూర్యరశ్మి, తేమ, గాలి, ఆ వలలోని సందులగుండా ప్రసరించే విధంగా ఉంటుంది. ఇది మొక్కల పెరగుదలకు అనువైన సూక్ష్మ వాతారవరణాన్ని కల్పిస్తుంది. దీనినే షేడ్ నెట్ లేక నెట్ హౌస్ అని కూడా అంటారు.[1]

ఈ షేడ్ హౌస్ యొక్క ఉపయోగాలు

  • పూలమొక్కలు, గుబురు ఆకులు గల మొక్కలు, ఔషధగుణాలు గల మొక్కలు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాల మొక్కలు పెంచడానికి పనికివస్తుంది.
  • పళ్లు, కూరగాయ మొక్కల నర్సరీలకు, అలాగే అడవుల పెంపకానికి పనికి వచ్చే జాతుల మొక్కలను పెంచడానికి కూడా ఉపయోగించబడుతుంది
  • వివిధ వ్యవసాయోత్పత్తులను నాణ్యమైన విధంగా ఆరబెట్టడానికి కూడా ఇది పనికివస్తుంది.
  • చీడపురుగుల, తెగుళ్ల బారినుండి రక్షణకై ఉపయోగించబడుతుంది.
  • సహజంగా వాతావరణంలో సంభవిస్తూ వుండే ఒడిదుడుకులనుండి - అంటే గాలులు, వర్షం, మంచు వంటి వాటినుండి రక్షణ కల్పిస్తుంది.
  • అంటుమొక్కల పెంపకానికి, వాటిని అధికమైన వేసవికాలపు వేడినుండి కాపాడడానికీ ఉపయోగింపబడుతుంది.
  • కణజాల ప్రవర్ధన విధానం (టిష్యూ కల్చర్) లో పెంచబడే లేత మొక్కలను గట్టిపరచడానికి ఉపయోగించబడుతుంది.

షేడ్ హౌస్ నిర్మాణానికి ప్రణాళిక
పెంచబడే మొక్కల రకాలను, స్థానికంగా లభించే సామాగ్రి, స్థానిక వాతావరణ పరిస్ధితులను పరిగణనలోకి తీసుకుని ఇటువంటి షేడ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టాలి. భవిష్యత్తులో దీనిని ఇంకా విస్తృతపరచే వీలు ఉండాలి.

సరైన ప్రదేశాన్ని ఎంచుకోవడం
ఈ షేడ్ హౌస్ మార్కెట్ కు దగ్గరగా ఉండాలి - కావలసిన వనరులు (ఇన్ పుట్స్) అందుబాటులో వుండడానికి, దాని ఉత్పత్తులను అమ్మడానికి కూడా అనువుగా ఉంటుంది. దీని నిర్మాణాన్ని భవనాలు, చెట్లు ఉన్నచోటుకి దూరంగా ఉండేటట్లు చూసుకోవాలి, అలాగే పారిశ్రామిక ప్రాంతం నుండి, వాహనాల నుండి వెలువడే కాలుష్యానికీ కూడా దూరంగా ఉండాలి. ఈ ప్రదేశం మురుగు నీటి పారుదల కలిగి ఉండాలి. విద్యుత్తు, మంచి నాణ్యత కలిగిన నీరు కూడా అందుబాటులో ఉండాలి. అయితే, ఈ షేడ్ హౌస్ నిర్మాణానికి గాలి అవరోధాలు కూడా 30 మీటర్లకు దూరంగానే ఉండాలి.

నిర్మాణం ఉండే దిశ
ఈ షేడ్ హౌస్ ని ఏ దిశగా నిర్మించాలి అన్న దానికి ముఖ్యంగా రెండు ప్రామాణకాలున్నాయి. ఒకటి ఈ పందిరిలోకి వచ్చే వెలుతురు ఒకే విధంగా ఉండడం. రెండవది గాలి ప్రసరించే దిశ. ఒకే ఒక అడ్డదూలంతో ఉండే షేడ్ హౌస్ తూర్పు-పడమర దిశలో గాని లేక ఉత్తర-దక్షిణ దిశలో గాని నిర్మితమై ఉండాలి. వెలుతురు ఒక క్రమ పధ్దతిలో, సమ తీవ్రతతో పడే లాగ చూడడానికి అవి ఉత్తర-దక్షిణ దిశలో వుండాలి,

నిర్మాణానికుపయోగించే సామగ్రి
ఇటువంటి షేడ్ హౌస్ నిర్మాణం ప్రధానంగా రెండు అంశాలతో ముడిపడి ఉంటుంది. అవి చట్రం (ఫ్రేమ్), చుట్టూ కప్పడానికి ఉపయోగించే వస్త్రం. ఈ షేడ్ హౌస్ యొక్క ఫ్రేమ్, చుట్టూ కప్పబడినదానికి సపోర్టుగా ఉండి, గాలి నుండి, వర్షం నుండి కాపాడే విధంగా రూపకల్పన చేయబడి ఉంటుంది. ఈ షేడ్ హౌస్ నిర్మాణానికుపయోగించే ఎమ్.ఎస్. స్టీల్ యాంగిల్ ఫ్రేము ఒక క్రమమైన కాలవ్యవధితో తుప్పును నిరోధించే పధ్దతిని అనుసరించినట్లయితే 25 ఏళ్ల దాకా ఉంటుంది. కానీ, గెడబొంగులతో నిర్మించబడినట్లయితే, అది ఒక మూడేళ్ల కాలం వరకూ ఉండవచ్చు. ఈ వ్యవసాయ సంబంధిత షేడ్ హౌస్ వాతావరణ పరిస్థితులననుసరించి మూడు నుండి ఐదేళ్ల వరకూ ఉండవచ్చు. ఈ షేడ్ నెట్స్ అనేవి వివిధ రంగులలో, 25, 30, 35, 50, 60, 75, 90 శాతం రంగుతో విస్తృతమైన రంగులశ్రేణిలో లభిస్తాయి, . ఈ పందిరి యొక్క ఫ్రేముల రూపకల్పన అవసరాన్ని బట్టి, ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని బట్టి ఉంటుంది. నిర్మాణానికి ఉపయోగపడే క్వోన్ సెట్ (అర్ధచంద్రాకారంలో), వాలుగా ఉండే ఇంటి కప్పు ఆకారంలో లేక విల్లు వంపు ఆకారం, లేక స్వల్ప మార్పులతో ప్రాంతీయ పరిస్ధితులకు అనువుగా ఉండే ఫ్రేములు ఒడిషా వంటి అత్యధిక వర్షపాతం ఉండే ప్రదేశాలకు సిఫార్సు చేయబడుతున్నాయి.

షేడ్ హౌస్ రూపకల్పన, నిర్మాణం
ఒడిషా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం, భువనేశ్వర్, లోని సూక్ష్మమాన సేద్య అభివృధ్ది కేంద్రంలో రెండు రకాలైన షేడ్ హౌస్ డిజైన్లకు రూపకల్పన చేయడం జరిగింది. ఇటువంటి షేడ్ హౌస్ ల ప్రధాన లాభం ఏమిటంటే నిర్మాణం జరిగే ప్రదేశంలో వీటిని నిర్మించడానికి ఏ విధమైన వెల్డింగ్ చేయవలసిన అవసరం లేదు. మరొక లాభం ఏమిటంటే, పునాది స్తoభాలు చెదల బారి నుండి కాపాడే రీతిలో ఎంచుకోబడి ఉంటాయి. ఈ షేడ్ హౌస్ ల యొక్క వివరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

S నీడనిచ్చే పందిరి-I
ఈ డిజైన్ (చిత్రం-1) లో నిర్మాణ చట్రంగా ఎమ్.ఎస్. (మైల్డ్ స్టీల్) యాంగిల్ (35 మి.మి. x 35 మి.మి .x 6 మి.మి.), గెడబొంగు వాడబడ్డాయి. ఈ స్ధంభం చివరి పై భాగం గెడబొంగును గట్టిగా పట్టుకుని వుండే విధంగా ‘U’ క్లిప్ ను కలిగివుంటుంది. గెడబొంగును అడ్డంగాను, పైకప్పు నిర్మాణానికి, ఉభయత్రా ఉపయోగించవచ్చు. లే అవుట్ ప్లాన్ లో ఉన్న విధంగా ఈ పందిరిని నిర్మించడానికుపయోగించే స్ధలాన్ని చదును (లెవెలింగ్) చేసిన తరువాత లే అవుట్ ప్లాన్ గీయడం జరుగుతుంది. పునాది స్ధంభాలను నిలువుగా పాతడానికి గోతులు తీయడం జరుగుతుంది. ఈ గోతులు కొంతవరకు ఇసుక, కంకరతో నింపి గట్టి చేయబడతాయి. అటు తర్వాత స్ధంభాలను సమానాంతరంగా ఉండే మూడు వరుసలలో, ఎత్తు సమాన స్ధాయిలో ఉండే విధంగా, సిమెంట్, కాంక్రీటుతో నిలబెట్టడం జరుగుతుంది. గెడబొంగులను నీటితో తడిపిన తరువాత, సరైన సైజునకు ముక్కలుగా చేసి పై కప్పుకు అడ్డంగాను, విల్లు ఆకారంలో ఒంగదీసి ఆర్చ్ గానూ ఉపయోగించి, గట్టిగా కట్టివేయడం జరుగుతుంది. ముందుగా తయారుచేయబడిన వెనుక ఫ్రేము, ద్వారబంధాలున్న ఫ్రేము, నట్లు, బోల్టులతో ప్రధాన నిర్మాణానికి బిగించబడతాయి తరువాత 50 – 75 శాతం వరకు వుండే ఆగ్రో షెడ్ నెట్ పైకప్పు భాగానికి బిగించబడుతుంది. అలాగే, ఫ్రేమ్ పక్క భాగాలకు 30 శాతం వరకూ కప్పగలిగి ఉండే వలలను బిగించడం జరుగుతుంది. వెనుక వైపు, ముందు వైపు ఉండే ఫ్రేములు, తలుపులు కూడా షేడ్ నెట్ తో కప్పబడి ఉంటాయి. చివరిగా, ఈ నిర్మాణానికి మధ్యభాగంలో నడవడానికి వీలుగా ఉండే చిన్న కాలిబాట వంటి దారిని నిర్మించడంతో బాటుగా ఈ మొత్తం నిర్మాణానికి చుట్టూ కూడా ఇటుకలతో ఒక గట్టు వంటిది సరిహద్దులాగ కట్టబడుతుంది.

సామగ్రి జాబితా (షేడ్ హౌస్ -I)

క్రమ సంఖ్య వివరాలు ఐటమ్ కొలతల వివరాలు (స్పెసిఫికేషన్స్) పరిమాణం (క్వాంటిటీ)
1 పునాది స్ధంభాలు ‘U’ క్లిప్పుతో ఎమ్.ఎస్.యాంగిల్ ఇనుము, ఎమ్.ఎస్. ఫ్లాట్ 35ఎమ్.ఎమ్.x35 ఎమ్.ఎమ్x6 ఎమ్.ఎమ్. 25 ఎమ్.ఎమ్ x 6 మి.మి. 209 కి.గ్రా. 7 కి.గ్రా.
2 ద్వారబంధాలు, వెనుక వైపు ఫ్రేమ్ ఎమ్.ఎస్.యాంగిల్ ఇనుము 35ఎమ్.ఎమ్.x35 ఎమ్.ఎమ్x6 ఎమ్.ఎమ్. 71 కి.గ్రా
3 పైకప్పు నిర్మాణం గెడబొంగు 75 ఎమ్.ఎమ్.- 100 ఎమ్.ఎమ్ వ్యాసం (డయా) 20 నంబర్లు
4 పైకప్పు, సైడ్ కవరు వ్యవసాయ సంబంధిత, నీడనిచ్చే వల (ఆగ్రోషేడ్ నెట్) 50%- 70% &30% 328 చ.మీ.
5 పునాదిని తవ్వడం, సిమెంట్ మోర్టర్ తో నింపడం సిమెంట్ కాంక్రీట్ 1:2:4 12 ఎమ్.ఎమ్. సైజు చిన్న రాళ్లతో 1.3 మీ3
6 తుప్పు పట్టకుండా తీసుకునే వివారణ చర్యలు ఎనామెల్ పెయింట్, తిన్నర్ --- 4 లీటర్లు
7 నిర్మాణాన్ని నిలబెట్టడం (ఎరక్షన్ ఆఫ్ స్ట్రక్చర్) (1) నట్లు, బోల్టులు (ii) జి.ఐ. వైరు (i) 3/8 x 1” (ii) 4 ఎమ్.ఎమ్. (i) 1 కి.గ్రా. (ii) 2 కి.గ్రా.
8 కాలిబాట (పేవ్ మెంట్) ఇటుక కట్టడం సిమెంట్ మోర్ట్రర్ (1:6) 2.4 ఎమ్

సామగ్రి జాబితా (షేడ్ హౌస్ -II)
ఈ డిజైన్ (చిత్రం-2) లో పునాది స్ధంభాలు, పైకప్పుకు సరిపోయే అడ్డంగా ఉండే దూలం, వెనుక వైపు ఫ్రేమ్, షేడ్ హౌస్ యొక్క తలుపుల కోసం ఎమ్.ఎస్. యాంగిల్ (40 ఎమ్.ఎమ్ x40 ఎమ్.ఎమ్ x 6 ఎమ్.ఎమ్)ను ఉపయోగించడం జరుగుతుంది. నాలుగుపక్కలా కప్పడానికుపయోగించే సామగ్రికి సపోర్టునిచ్చే చట్రాలకి (హుప్స్) ఎమ్.ఎస్. ఫ్లాట్ ఉపయోగించబడుతుంది. పునాది స్ధంభాలపై ఈ చట్రం వంటి దానిని, పైకప్పు దూలాన్ని నట్స్ తోను, బోల్ట్స్ తోను బిగించడానికి వీలు కలిగివుంటుంది. అదే విధంగా, ఎమ్.ఎస్. ఫ్లాట్ ను ఉపయోగించే ఈ చట్రాలు ఈ అడ్డు దూలాన్ని బిగించడానికి వీలును కలిగివుంటాయి. నిర్మాణం జరుగుతూ వుండే ప్రదేశంలో భూమిని చదును (లెవెలింగ్) చేయడం, ప్లాన్ లే అవుట్, వగైరా ఇంతకు ముందు వివరించిన మాదిరిగానే ఉంటుంది. పునాది స్ధంభాలను గోతులలో నిలబెట్టి, సిమెంట్, కాంక్రిట్ తో వాటిని నింపడం జరుగుతుంది, అలాగే వరుసగా 7 రోజులపాటు నీటితో వీటిని తడుపుతూ ఉండడం కూడా చేయబడుతుంది. నట్లను, బోల్టులను ఉపయోగిస్తూ, అడ్డు దూలాలను, చట్రాన్ని, వెనుక వైపు ఫ్రేమును, తలుపుల ఫ్రేమును బిగించడం జరుగుతుంది. అటు తరువాత, ఈ నిర్మాణానికి వలలు బిగించబడతాయి. చివరిగా నిర్మాణానికి మధ్యలో కాలిబాట నిర్మింపబడుతుంది, మొత్తం నిర్మాణానికి చుట్టూ ఒక గట్టువంటిది, సరిహద్దులాగ ఇటుకలతో కట్టబడుతుంది. ఈ మాదిరి నీడనిచ్చే పందిరి నిర్మాణానికి అయ్యే ఖర్చు ఒక యూనిట్ కు ఇంచుమించుగా. రు. 500/చ.మీ. అవుతుంది ఇటువంటి నిర్మాణానికి ఉపయోగించవలసిన సామగ్రి వివరాలు టేబుల్-II లో ఇవ్వబడ్డాయి.

క్రమ సంఖ్య వివరాలు ఐటమ్ కొలతల వివరాలు (స్పెసిఫికేషన్స్) పరిమాణం (క్వాంటిటీ)

క్రమ సంఖ్య వివరాలు ఐటమ్ కొలతల వివరాలు (స్పెసిఫికేషన్స్) పరిమాణం (క్వాంటిటీ) 1. పునాది స్ధంభాలు ఎమ్.ఎస్.యాంగిల్ 40ఎమ్.ఎమ్.x40 ఎమ్.ఎమ్x6 ఎమ్.ఎమ్. 336 కి.గ్రా. 2. అడ్డు దూలాలు, వెనుక వైపు ఫ్రేములు ఎమ్.ఎస్.యాంగిల్ 40ఎమ్.ఎమ్.x40 ఎమ్.ఎమ్x6 ఎమ్.ఎమ్. 305 కి.గ్రా. 3. తలుపుల ఫ్రేములు ఎమ్.ఎస్.యాంగిల్ 40ఎమ్.ఎమ్.-40 ఎమ్.ఎమ్x6 ఎమ్.ఎమ్. 41 కి.గ్రా. 4. ఇనుప చట్రాలు ఎమ్.ఎస్.ఫ్లాట్ 30ఎమ్.ఎమ్.x6 ఎమ్.ఎమ్. 159 కి.గ్రా. 5. పైకప్పు, సైడ్ కవర్ ఆగ్రో షేడ్ నెట్ 50 శాతం,- 70 శాతం , 30 శాతం. 328 చ.మీ. 6. పునాదిని తవ్వడం, నింపడం సిమెంట్, కాంక్రీట్ 1:2:4, 12 ఎమ్.ఎమ్. చిన్న రాళ్లతో 1.8 ఎమ్3 7. కాలిబాట (పేవ్ మెంట్) ఇటుకతో కట్టడం సిమెంట్ మోర్టర్ (1:6) 2.4 ఎమ్3 8 నిర్మాణాన్ని నిలబెట్టడం (ఎరక్షన్ ఆఫ్ స్ట్రక్చర్) (1) నట్లు, బోల్టులు, (ii)జి.ఐ.వైర్ 3/8x 1” 4 ఎమ్.ఎమ్. 4 కి.గ్రా. 4 కి.గ్రా. 9. తుప్పు పట్టకుండా తీసుకునే వివారణ చర్యలు ఎనామెల్ పెయింట్, తిన్నర్ 8 లీటర్లు

చిత్రమాలిక

[మార్చు]

వనరులు

[మార్చు]
  1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]

ఇవి కూడా చూడండి

[మార్చు]

గుంజలు

బయటి లింకులు

[మార్చు]