చల్లా కోదండరామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చల్లా కోదండరామ్
చల్లా కోదండరామ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2 జనవరి 2019 - 31 జులై 2021
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం 1959
చల్లావారిపల్లె గ్రామం, తాడిపత్రి మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జీవిత భాగస్వామి పద్మావతి
సంతానం షణ్ముఖ భారతి
పూర్వ విద్యార్థి ఆంధ్రా యూనివర్సిటీ

చల్లా కోదండరామ్‌ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 2019 జనవరి 2 నుండి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 31 జూలై 2021 వరకు పనిచేశాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

చల్లా కోదండరాం 1959లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలం, చల్లావారిపల్లె గ్రామంలో జన్మించాడు. ఆయన 1983లో ఆంధ్రా యూనివర్సిటీ (నైట్ కాలేజీ) నుంచి లా డిగ్రీ పూర్తి చేశాడు.[2][3]

వృత్తి జీవితం[మార్చు]

చల్లా కోదండరామ్‌ లా పూర్తి చేశాక 1979 నుంచి 1988 వరకు పారిశ్రామిక రంగంలో కాంట్రాక్టర్‌గా పనిచేశాడు. ఆయన 1988 జూన్‌ 24న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని న్యాయవాది ఎ.వెంకటరమణ, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.పర్వతరావు వద్ద జూనియర్ గా చేరి న్యాయవాద వృత్తిలో మెళకువలు నేర్చుకొని ట్యాక్స్‌యేషన్ కేసుల్లో సుప్రీంకోర్టు, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు హైకోర్టుల్లో కేసులు వాదించాడు. చల్లా కోదండరామ్‌ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా 2013 ఏప్రిల్ 12న నియమితులయ్యాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ \ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2014 సెప్టెంబరు 08న బాధ్యతలు చేపట్టి[4] 31 జూలై 2021న పదవీ విరమణ చేశాడు.

మూలాలు[మార్చు]

  1. Telangana High Court (2021). "HONOURABLE SRI JUSTICE CHALLA KODANDA RAM". Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.
  2. Namasthe Telangana (31 July 2021). "రాత్రి కళాశాలలో లా చేశాను..!". Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.
  3. V6 Velugu (31 July 2021). "నైట్‌ కాలేజీలో లా చేసి జడ్జిగా ఎదిగా" (in ఇంగ్లీష్). Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Sakshi (2 January 2019). "కొలువుదీరిన కొత్త హైకోర్టు". Archived from the original on 19 October 2021. Retrieved 19 October 2021.