అక్షాంశ రేఖాంశాలు: 34°02′49″N 77°55′50″E / 34.04704°N 77.93054°E / 34.04704; 77.93054

చాంగ్ లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చాంగ్ లా
సముద్ర మట్టం
నుండి ఎత్తు
5,360 m (17,585 ft)
ఇక్కడ ఉన్న
రహదారి పేరు
సింధు లోయ నుండీ పాంగోంగ్ సరస్సుకు వెళ్ళే రోడ్డు
ప్రదేశంలడఖ్
శ్రేణిహిమాలయాలు
Coordinates34°02′49″N 77°55′50″E / 34.04704°N 77.93054°E / 34.04704; 77.93054
చాంగ్ లా is located in Ladakh
చాంగ్ లా
లడఖ్‌ పటంలో చాంగ్ లా స్థానం

చాంగ్ లా లడఖ్‌లో 5,391.3024 మీ. (17,688.000 అ.) ఎత్తున లడఖ్ శ్రేణిలో లేహ్ కూ, ష్యోక్ నది లోయకూ మధ్య ఉన్న ఎత్తైన కనుమ మార్గం.[1] [2] చాంగ్ లా, లేహ్- కరు - శక్తి - జింగ్రాల్ -చాంగ్ లా- దుర్బుక్ - టాంగ్ట్సే - పాంగోంగ్ లేక్ రహదారిపై ఉంది.[3] లెహ్- మనాలి NH-3 పై ఉన్న కరూ, చాంగ్ లా, పాంగోంగ్ సరస్సును లేహ్ భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు కలుపుతుంది. 2021 సెప్టెంబరులో BRO కే లా పాస్ ( 5,669.28 మీ. or 18,600.0 అ. ) ద్వారా జింగ్రాల్, టాంగ్ట్సే మధ్య మరొక ప్రత్యామ్నాయ తారురోడ్డును వేసింది.[4] [5]

జింగ్రాల్ గ్రామం నుండి చాంగ్ లాకు బాగా వాలుగా ఉండే తారు రోడ్డు ద్వారా చేరుకోవచ్చు. ఈ మార్గంలో వాహనాలను జాగ్రత్తగా నడపాలి. 10-15 కి.మీ. వరకు, చాంగ్ లాకు ఇరువైపులా ఉన్న రహదారి చలికాలం తర్వాత వదులుగా, బురదగా మారుతుంది. వేసవి నెలల్లో ప్రత్యేకంగా పర్యాటక సీజన్‌లో, రహదారికి అడ్డంగా చిన్న ప్రవాహాలు కనిపిస్తాయి, బైకర్లకు ఎక్కడం ఒక సవాలుగా మారుతుంది. చాంగ్ లా నుండి టాంగ్ట్సే లేదా దార్బుక్ వైపు దిగడం కూడా చాలా నిటారుగా ఉంటుంది. 20-25 నిమిషాల కంటే ఎక్కువ సేపు పైభాగంలో ఉండడం వల్ల ఆలిట్యూడ్ సిక్‌నెస్ వచ్చే అవకాశం ఉంది.

వ్యుత్పత్తి

[మార్చు]

చాంగ్ లా అంటే "ఉత్తర కనుమ" అని అర్థం(చాంగ్ = ఉత్తరం, లా = పాస్).[3]

చాంగ్లా కనుమ నుబ్రా ప్రాంతానికి ప్రధాన ద్వారం. సమీపంలో టాంగ్‌స్టె అనే చిన్న పట్టణం ఉంది.[3]

డిఆర్‌డివో పరిశోధనా కేంద్రం

[మార్చు]

ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన పరిశోధనా కేంద్రం చాంగ్ లాలో 17,664 అడుగుల ఎత్తున ఉంది. దీన్ని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ స్థాపించింది.[3]

గ్యాలరీ

[మార్చు]

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. GeoNames. "Chang La Pass". Retrieved 2009-06-17.
  2. Jina, Prem Singh (31 August 1998). Ladakh: The Land & The People. India: Indus Publishing. pp. 25–26. ISBN 978-81-7387-057-6.
  3. 3.0 3.1 3.2 3.3 Service, Tribune News. "At 17,500 ft, world's highest research station becomes functional in Ladakh". Tribuneindia News Service. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "new2" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. World's highest motorable road at 18600 ft inaugurated in Ladakh, The News Minute, 21 SEPTEMBER 2021.
  5. MP Ladakh inaugurates road connecting Zingral to Tharuk, Tangtse, Govt of Ladakh, accessed Sept 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=చాంగ్_లా&oldid=4307180" నుండి వెలికితీశారు