చాణక్య శపథం
స్వరూపం
చాణక్య శపధం (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
---|---|
తారాగణం | చిరంజీవి, విజయశాంతి, సత్యనారాయణ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
చాణక్య శపథం 1986 లో వచ్చిన యాక్షన్ చిత్రం. చిరంజీవి, విజయశాంతి, రావు గోపాలరావు, సత్యనారాయణ నటించారు. దీనిని కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో డివిఎస్ రాజు నిర్మించాడు.[1]
కథ
[మార్చు]విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారి చాణక్య ఒక మిలిటరీ మేజర్ కుమారుడు. ఆయన చేసిన సేవలకు పద్మశ్రీ అవార్డు ప్రకటిస్తారు. రాణా స్మగ్లింగ్ రింగ్‌ను చాణక్య పట్టుకుంటాడు. అందుకు ప్రతీకారంగా వాళ్ళు, చాణక్య తండ్రి వజ్రాలను అక్రమంగా రవాణా చేస్తున్నాడని నిరూపిస్తారు. అవమానాన్ని ఎదుర్కొన్న చాణక్య, తన తండ్రి అమాయకత్వాన్ని రుజువు చేసి, నిందితులను చట్టానికి పట్టిస్తానని విలన్లకు సవాలు చేస్తాడు. విజయశాంతి చాణక్యతో కలిసి పనిచేసే ఎయిర్ హోస్టెస్. తన అక్కకు ఇవ్వాల్సిన కట్నం డబ్బును చెల్లించడం ఆమెకున్న సమస్య. ఇద్దరూ తమ తమ సమస్యలను ఎలా ఎదుర్కొంటారో మిగతా కథ చూపిస్తుంది.
తారాగణం
[మార్చు]నటుడు | పాత్ర |
---|---|
చిరంజీవి | చాణక్య |
విజయశాంతి | శశిరేఖ "శశి" |
రావు గోపాలరావు | రాణా |
కైకాల సత్యనారాయణ | మేజర్ నాగార్జున |
అన్నపూర్ణ | చాణక్య తల్లి |
సుధాకర్ | రాణా కొడుకు |
సుతివేలు | |
కాంతరావు | |
రంగనాథ్ | |
చలపతి రావు | |
ఈశ్వరరావు | |
బాబ్ క్రిస్టో |
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | నిడివి |
---|---|---|
1. | "మెల్లగా అల్లుకో" | |
2. | "వరి వరి వరిచేలో" | |
3. | "సోకు తోటలో" | |
4. | "వేడి వేడి వలపులు" | |
5. | "నీ బండబడ" |
మూలాలు
[మార్చు]- ↑ C, Narayana Rao (1987-01-02). "మరో చిరంజీవి మార్కు చిత్రం - చాణక్య శపథం" [Film with Chiranjeevi's Mark: Chanakya Sapatham] (PDF). Zamin Ryot. Archived from the original (PDF) on 2016-09-13. Retrieved 2020-08-04.