చార్ కమాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చార్మినారు నుండి చార్ కమాన్ దృశ్యం

చార్ కమన్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చారిత్రక కట్టడాలు.[1] 1592లో చార్మినార్ కమాన్‌, కాలీ కమాన్‌, మచిలీ కమాన్‌, షేర్‌ ఏ బాతుల్‌ పేరుతో 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఇడో పర్షియన్‌ పద్ధతిలో చార్మినారుకు నాలుగు వైపులా కమాన్‌లు నిర్మించడం జరిగింది.[2]

నిర్మాణం

[మార్చు]

1551లో మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో చార్మినారు నిర్మాణం జరిగింది. ఆ మరుసటి సంవత్సరం అనగా 1552లో చార్మినారుకు నాలుగు వైపులా చార్మినార్ కమాన్, కాలీ కమాన్, మచిలీ కమాన్, షేర్ ఏ బాతుల్ కమాన్ అనే పేరుతో నాలుగు కమాన్లను నిర్మించారు. వీటిని చార్ కమాన్ లు అని పిలుస్తారు. 60 అడుగుల ఎత్తుతో, 30 అడుగుల వెడల్పుతో ఇడో పర్షియన్‌ పద్ధతిలో ఈ కమాన్‌ల నిర్మాణం జరిగింది.[3][4]

వారసత్వ సంపదగా గుర్తింపు

[మార్చు]

చార్మినారుతో పాటు హైదరాబాద్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ నాలుగు కమాన్లను భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ చారిత్రక వారసత్వ కట్టడంగా గుర్తించింది.[5]

ఇతర వివరాలు

[మార్చు]

చారిత్రక వారసత్వ సంపదైన చార్ కమాన్లను పునరుద్దరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికోసం ప్రత్యేకంగా రూ. 87లక్షలు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కేటాయించింది. ఈ కమాన్లపై విచ్చలవిడిగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను, మేకులను తొలగించడం, పక్కన ఉన్న షాపులను తరలించడంతోపాటూ పెచ్చులు ఊడిన కమాన్లకు మరమ్మతులు కలరింగ్ పనులు జరిగాయి.

మూలాలు

[మార్చు]
  1. Henry, Nikhila (2011-07-10). "Char kaman in Old City faces monumental neglect - Times Of India". Times of India. Retrieved 12 December 2018.
  2. "Andhra Pradesh / Hyderabad News : Charminar pedestrianisation a far cry?". Chennai, India: The Hindu. 2010-07-01. Archived from the original on 2010-07-07. Retrieved 12 December 2018.
  3. నమస్తే తెలంగాణ (11 April 2018). "నగరంలో హెరిటేజ్ నిర్మాణాల‌కు పూర్వ వైభ‌వం". Archived from the original on 12 December 2018. Retrieved 12 December 2018.
  4. ఆంధ్రజ్యోతి, తెలంగాణ రాజధాని వార్తలు (12 April 2018). "వారసత్వ కట్టడాలకు పునర్వైభవం". Archived from the original on 12 December 2018. Retrieved 12 December 2018.
  5. "HERITAGE - SITES". INTACH Hyderabad Chapter. Archived from the original on 6 అక్టోబరు 2011. Retrieved 12 డిసెంబరు 2018.