చిత్తలూరు వీరస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిత్తలూరు వీరస్వామి

చిత్తలూరు వీరస్వామి (1929- 2015) ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు [1] , తెలంగాణా సాయుధ పోరాట యోధుడు చిత్తలూరు వీరస్వామి తెలంగాణా సాయుధ పోరాటం లో బి. యన్ రెడ్డి. మల్లు స్వరాజ్యం , నల్లా నరసింహుల తో కలిసి పోరాటం చేశారు. రావి నారాయణ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ,అంతరంగికుడిగా వ్యవహరించిన వీరాస్వామి గెరిల్లా యుద్ధతంత్రంలో గోప్పయోదుడిగా పేరుగాంచారు. .85 యేండ్ల కమ్యూనిస్టు యోధుడు పంతులు నల్లగొండ జిల్లా వర్థన్నపేటకు చెందిన చిత్తలూరు వీరస్వామి నిజాం విధించిన వురిశిక్ష నుండి నల్లా నరసింహులు , నంద్యాల నరసింహరెడ్డి లను తప్పించే దాడిని(popularly known as 'great escape') లీడ్ చేసారు. చివరికి వాళ్ళను ఉరిశిక్ష నుండి తప్పించ గలిగారు .దానితో తనకు జైలు శిక్ష పడింది .. సత్ప్రవర్తన వల్ల ముందే విడుదల య్యాడు. ఆయనకు భార్యా, నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు వున్నారు. అణువణువునా దేశభక్తిని రంగరించుకున్న ఆయన తన బిడ్డలకు దేశభక్తులైన సుభాష్, భగత్,యుగంధర్,చంద్రశేఖర్ ల పేర్లు పెట్టుకున్నారు.

నేపథ్యం[మార్చు]

నల్లగొండ జిల్లా వర్ధమానకోటకు చెందిన వీరస్వామి ఏడో తరగతి వరకు చదువులోనే అపారమైన ప్రతిభ కనబరచి, ప్రభుత్వ స్కాలర్ షిప్ తో ఉన్నతపాఠశాల విద్యకు హైదరాబాదుకు వచ్చారు. ఎఫ్ ఎ చదువుతో తహసీల్దార్ ఉద్యోగంలో చేరారు. కాని ఆయన హైదరాబాదులో గడిపిన ఆ కాలం విద్యుదుత్తేజపు కాలం. ఒకవైపు ఆర్యసమాజం, మరొకవైపు స్టేట్ కాంగ్రెస్, ఇంకొకవైపు కమ్యూనిస్టు పార్టీ–ఆంధ్ర మహాసభ. హైదరాబాద్ రాజ్యం నిజాం వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక, బ్రిటిష్ వ్యతిరేక ఆలోచనలతో, ఆచరణలతో అట్టుడికిపోతున్న కాలం అది. ఆ కుతకుత ఉడుకుతున్న అగ్నిపర్వత సదృశ సామాజిక వాతావరణంలో విద్యావంతుడిగా, సున్నిత, మానవీయ స్పందనలున్న వ్యక్తిగా వీరస్వామి ఉద్యమజీవి అయ్యారు. తహసీల్దార్ ఉద్యోగం వదిలేసి ప్రజాఉద్యమంలోకి దూకారు. సాయుధ దళాలలో, ప్రజాఉద్యమ నిర్మాణంలో ఆయన కృషి ఇంకా పూర్తిగా అక్షరాలకెక్కలేదు గాని, ఉరిశిక్ష పడి, ఇతర కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న నల్లా నర్సింహులునూ, నంద్యాల శ్రీనివాసరెడ్డినీ తప్పించిన వీరోచిత ఘట్టం మాత్రం సంక్షిప్తంగానైనా నమోదయింది.

తెలంగాణ రైతాంగ సాయుధ పొరాటం[మార్చు]

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటకారులపై నిజాం రాజ్యంలో, ఆ తర్వాత సైనిక పాలనలో, పౌర పాలనలో పెట్టిన కేసులన్నిటిలో కలిపి దాదాపు 50 మందికి ఉరిశిక్షలు వేశారు. సాధారణంగా కింది కోర్టు వేసిన ఉరిశిక్షను హైకోర్టు ధృవీకరించవలసి ఉంటుంది. నిజాం పాలనలో ఆపైన కూడ పునర్విచారణ అవకాశం ఉండేది. నిజాం పాలనాకాలంలో ఉరిశిక్ష పడినవారిని ఎవరినీ ఉరి తీయలేదు. కాని భారత ప్రభుత్వ సైనిక పాలకుడు జె ఎన్ చౌధురి పాలనాకాలంలో ఉరిశిక్షలు అమలుచేయడానికి హైకోర్టు ధృవీకరణ నిబంధనను కూడ పక్కనపెట్టి 1949 జూలైలో ఎనిమిది మంది మీద ఉరిశిక్ష అమలు చేయడానికి ప్రయత్నించారు. ఆ ఉరితీత నిర్ణయానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా నిరసన పెల్లుబికింది. ఆ ఉరి అమలు కాబోయేవారిలో ఎర్రబోతు రాంరెడ్డి అనే పదిహేనేళ్ల యువకుడు ఉండడం, అంతకుముందే ఆయన గురించి ఆయన ఫొటోతో సహా టైం పత్రిక రాయడంతో అనేక దేశాలలో ఈ ఉరిశిక్ష అమలుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ఈలోగా సైనిక పాలన అయిపోయి కె ఎం వెల్లోడి అనే ఐసిఎస్ అధికారిని ముఖ్యమంత్రిగా ప్రకటించి పౌరపాలన మొదలయిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడతగా హైకోర్టు ధృవీకరించిన 12 మంది రైతాంగ పోరాట యోధులను ఉరితీయాలని వెల్లోడి నిర్ణయించాడు. ఈ హత్యాకాండకు ఆయన నిర్ణయించిన తేదీ 1950 జనవరి 22-23 రాత్రి. అంటే ఇంకొక మూడు రోజులకు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి, ఉరిశిక్ష అమలుకు అంతిమ పునర్విచారణ అధికారం భారత సుప్రీంకోర్టుకు వచ్చేలోగానే ఆయన తన హత్యాకాండ కొనసాగించదలచాడు. ఈసారి కూడ ప్రపంచం భగ్గుమన్నది. ‘సేవ్ తెలంగాణ 12’ అని అనేక దేశాల్లో డిఫెన్స్ కమిటీలు ఏర్పడ్డాయి. నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఎన్నో దేశాల ప్రభుత్వాలు, ప్రజాసంస్థలు భారత ప్రభుత్వానికి నిరసన లేఖలు రాశాయి. ఈ కేసు వాదించడానికి బ్రిటన్ నుంచి డి ఎన్ ప్రిట్, బొంబాయి నుంచి డేనియల్ లతీఫ్ వంటి సుప్రసిద్ధ న్యాయవాదులు వచ్చారు. ఈ విశ్వప్రయత్నం మీద మొత్తానికి ఆ ఉరి కూడ రద్దయింది. అప్పటికీ మరొక ముప్పై మంది మీద ఉరిశిక్ష కత్తి వేలాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అప్పటికే మూడు ఉరిశిక్షలు పడి, హైకోర్టు అప్పీలు విచారణ సాగుతున్న నల్లా నర్సింహులును, నంద్యాల శ్రీనివాసరెడ్డిని జైలు నుంచి తప్పించాలని పార్టీ నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని 1950 మే 3న విజయవంతంగా అమలుచేసి, ఆ ఇద్దరినీ ఉరికంబం మీది నుంచి రక్షించిన బృందంలో ముఖ్యుడు వీరస్వామి.

మూలాలు[మార్చు]

  1. 202.41.85.234:8000/hi-res/hcu_images/G4.pdf