నంద్యాల నర్సింహా రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నంద్యాల నర్సింహారెడ్డి

పదవీ కాలం
1994 - 1999
ముందు ఎం. రఘుమారెడ్డి
తరువాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నియోజకవర్గం నల్గొండ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1956
నల్గొండ, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ సి.పి.ఎం.
తల్లిదండ్రులు యెల్లరెడ్డి

నంద్యాల నర్సింహారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నల్గొండ నియోజకవర్గం నుండి 1994 - 1999 వరకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

నంద్యాల నర్సింహా రెడ్డి 1956లోతెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, నల్గొండ పట్టణంలో జన్మించాడు. ఆయన నల్గొండలో 1976లో ఎన్.జి కాలేజీ నుండి బి.కామ్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

నంద్యాల నర్సింహా రెడ్డి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుండి సీపీఎం తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చకిలం శ్రీనివాసరావు పై 29163 మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయనకు ఈ ఎన్నికల్లో 63646 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ అభ్యర్ధికి 34483 ఓట్లు లభించాయి.[2]

నర్సింహా రెడ్డి 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో 4440 ఓట్ల తేడాతో ఓడిపోయాడు, 2004లో సీపీఎం తరపున పోటీ చేసి మూడో స్థానంలో నిలిచి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో 8377 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2007 నుండి ప్రస్తుతం సీపీఎం పార్టీ నల్గొండ జిల్లా కార్యదర్శిగా ఉన్నాడు.[3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (20 October 2023). "ఏక్‌బార్‌.. ఎమ్మెల్యే". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  2. Election Commission of India (2004). "Partywise Comparison Since 1978". Archived from the original on 12 December 2021. Retrieved 12 December 2021.
  3. Sakshi (27 December 2014). "ఎవరో..?". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.