చిరాగ్ పాశ్వాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిరాగ్ పాశ్వాన్
చిరాగ్ పాశ్వాన్

2016లొ చిరాగ్ పాశ్వాన్


లోక్‌సభ సభ్యుడు, భారత పార్లమెంటు
పదవీ కాలం
2014 మే 16 – ప్రస్తుతం
ముందు భూడియో చౌరరి
నియోజకవర్గం జమూయ్ లోక్‌సభ నియోజకవర్గం

అధ్యక్షుడు, లోక్‌ జనశక్తి పార్టీ

వ్యక్తిగత వివరాలు

జననం (1983-10-31) 1983 అక్టోబరు 31 (వయసు 40)
ఖగారియా, బీహార్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ లోక్‌ జనశక్తి పార్టీ
నివాసం బీహార్, న్యూఢిల్లీ
వృత్తి రాజకీయ నాయకుడు

చిరాగ్ పాశ్వాన్ (1983 అక్టోబరు 31) ఒక భారతదేశ రాజకీయవేత్త, లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడు. అతను భారతదేశ పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ స్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు. [1][2]

అతను 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో బీహార్ లోని జమూయ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికలలో అతని తండ్రి హాజ్పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. వీరిరువురూ లోక్‌జనశక్తి పార్టీ నుండి పోటీ చేసారు.[3]

బాల్యజీవితం, నటనా జీవితం[మార్చు]

అతను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్.[4][5] అతను బాలీవుడ్ లో "మిలే నా మిలే హం" చిత్రంలో 2011లో నటించాడు.[6] ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విఫలమైంది. అందువల్ల అతని సినిమా కెరీర్ ఆగిపోయింది. [7]

రాజకీయ జీవితం[మార్చు]

పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ తరపున 2014 ఎన్నికలలో జాముయ్ నియోజకవర్గం నుండి పోటీ చేసాడు. సమీప రాష్ట్రీయ జనతాదళ్ కు చెందిన ప్రత్యర్థి సుధాంసు భాస్కర్ పై 85,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు. 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో అతను మొత్తం 528,771 ఓట్లను సాధించి, సమీప ప్రత్యర్థి భూడియో చౌదరిని ఓడించి పాశ్వాన్ తన స్థానాన్ని నిలుపుకున్నాడు.[8]

తన రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు అతను చిరాగ్ కా రోజ్గార్ అనే ఎన్జీఓను స్థాపించాడు.[9]

బీహార్ ఫస్ట్ బీహారీ ఫస్ట్ - రాబోయే బీహార్ ఎన్నికలకు ముందు చిరాగ్ పాస్వాన్ బీహార్ యువత దృష్టిని ఆకర్షించేందుకు "బీహార్ ఫస్ట్ బీహారీ ఫస్ట్ క్యాంపెయిన్" ను ప్రారంభించాడు. ఈ క్యాంపైన్ బీహార్ రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సృష్టించబడినది. బీహార్‌ను 'నంబర్ వన్' రాష్ట్రంగా మార్చడం చాలా అవసరమని అతను అన్నాడు.[10]

మూలాలు[మార్చు]

  1. https://www.oneindia.com/politicians/chirag-kumar-paswan-32686.html
  2. "Chirag Paswan, LJP's 'humble' Jamui District nominee". Deccan Herald. 30 March 2014. Retrieved 2014-05-18.
  3. "LJP chief Ram Vilas Paswan, son Chirag Paswan win". Daily News & Analysis. 16 May 2014. Retrieved 2014-05-18.
  4. "Political sons shun politics".
  5. "Jamui MP Chirag Paswan of LJP".
  6. "Politics over Bollywood for Ram Vilas Paswan's actor-son Chirag". India Today. 11 June 2013. Retrieved 24 February 2014.
  7. "Chirag Paswan, LJP's 'humble' Jamui District nominee". Deccan Herald. 30 March 2014. Retrieved 2014-05-18.
  8. "Jamui Election Results 2019 Live Updates: Chirag Kumar Paswan of LJP Wins". News18. Retrieved 29 May 2019.
  9. "Chirag Ka Rojgar, director Saurabh Pandey". Archived from the original on 29 మే 2019. Retrieved 29 May 2019.
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-03-23. Retrieved 2020-06-12.