చిలకా గోరింక
స్వరూపం
(చిలక గోరింక నుండి దారిమార్పు చెందింది)
చిలకా గోరింక (1966 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ప్రత్యగాత్మ |
---|---|
నిర్మాణం | కె.ప్రత్యగాత్మ |
తారాగణం | కృష్ణంరాజు (తొలి పరిచయం), కృష్ణకుమారి, యస్వీ రంగారావు, అంజలీదేవి, పద్మనాభం, రమణారెడ్డి |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | ఆత్మా ఆర్ట్స్ |
భాష | తెలుగు |
ఈ చిత్రం జున్ 10,1966లో విడుదలలైన తెలుగు చలన చిత్రం.[1] ప్రముఖ నటుడు కృష్ణంరాజు, హాస్యనటి రమాప్రభ ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. హిందీ నటి 'నూతన్' కూడా ఇందులో పాత్ర పోషించారు. ఆమె ఒక పాట పాడటం కూడా ఇందులో ఒక విశేషం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ ఉత్తమ చిత్రంగా 1966 వ సంవత్సరానికి రజిత నంది అవార్డు ప్రకటించింది.
నటీనటులు
[మార్చు]- కృష్ణంరాజు (తొలి పరిచయం)
- కృష్ణకుమారి
- యస్వీ రంగారావు
- అంజలీదేవి - శాంత
- పద్మనాభం
- రమణారెడ్డి|
- రమాప్రభ (తొలి పరిచయం)
పాటలు
[మార్చు]అన్ని పాటల రచయిత శ్రీశ్రీ, సంగీతం సమకూర్చినది సాలూరు రాజేశ్వరరావు.
పాట | గాయకులు |
---|---|
నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే ఊరించు తొలి దినాలే ఈరేయి పిలువసాగే |
ఘంటసాల |
పాపా! కథ విను బాగా విను విను | ఘంటసాల, సుశీల, బేబి కౌసల్య |
బొట్టు బొట్టుగా గూడబెట్టి దాచిన డబ్బు మందు మాకుల (పద్యం) | మాధవపెద్ది |
ఎరుపెక్కెను చక్కని నీ చెక్కిలి బరువెక్కెను బరువెక్కెను | టి.ఆర్.జయదేవ్, రమోలా |
ఆశలడుగంటె ఆరటమదికమాయే కప్పుకొనివచ్చే (పద్యం) | మాధవపెద్ది |
ఈ గాలి నిన్నే పిలిచేనే నా కళ్ళు నిన్నే వెదికేనే | టి.ఆర్.జయదేవ్ |
చెమ్చాతో సముద్రాన్ని తోడ శక్యమా | మాధవపెద్ది, స్వర్ణలత |
ధనికుడాతడు సంతాన ధనములేదు పిల్లలు ఇచట (పద్యం) | మాధవపెద్ది |
నడూ నడూ నడచిరా.. హంసవలె నెమలివలె | టి.ఆర్.జయదేవ్, పి.సుశీల |
నేనే రాయంచనై చేరి నీ చెంతనే | నూతన్, టి.ఆర్.జయదేవ్, పి.సుశీల, ఎస్.జానకి |
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
మూలాలు
[మార్చు]- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966లో విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 18.