చిలుకూరు క్షేత్ర చరిత్ర (పుస్తకం)
Jump to navigation
Jump to search
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
తెలంగాణ తిరుమలగా ఖ్యాతి గాంచిన హైదరాబాదుకు అతి సమీపంలోని చిలుకూరు గ్రామంలో వెలిసిన చిలుకూరు బాలాజీ దేవాలయంపై బులెమోని వెంకటేశ్వర్లు సుమారు మూడు సంవత్సరాలపాటు పరిశోధన చేసి వ్రాసిన గ్రంథం "చిలుకూరు క్షేత్ర చరిత్ర".
సా.శ.1067లో అప్పటి రాజు అసగ మారస నేతృత్వంలో నిర్మించిన ఈ చిలుకూరు దేవాలయాల గూర్చి పూర్తి స్థాయిలో పరిశోధన చేసి, నాటి శిలా శాసనాలు, వాటి వివరాలు సహా ప్రచురించిన ఈ గ్రంథాన్ని 25 మార్చ్ 2005న అప్పటి శాసన సభ స్పీకర్ కె.ఆర్. సురేశ్ రెడ్డి విడుదల చేశారు.
ఈ "చిలుకూరు క్షేత్ర చరిత్ర" గ్రంథాన్ని నెక్స్ట్ స్టెప్ పబ్లికేషన్స్ ప్రచురించగా, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, నవోదయ బుక్ హౌస్, ప్రజాశక్తి బుక్ హౌస్ లు సమ్యుక్తంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.
అప్పట్లో కేవలం రెండు రోజుల్లో 10వేల కాపీలు అమ్ముడుపోయి ఈ గ్రంథం చరిత్ర సృష్టించింది.