Jump to content

చెట్టి ఫాల్గుణ

వికీపీడియా నుండి
చెట్టి ఫాల్గుణ

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 నుండి 3 జూన్ 2024
ముందు కిడారి సర్వేశ్వర రావు
తరువాత రేగం మత్యలింగం
నియోజకవర్గం అరకు

వ్యక్తిగత వివరాలు

జననం 26 జనవరి 1963
శీకారి, పెదబయలు మండలం, విశాఖపట్నం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి అనురాధ
సంతానం వికాస్, వినయ్, సాయి శ్రీనివాస్‌
వృత్తి రాజకీయ నాయకుడు

చెట్టి ఫాల్గుణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.ఆయన 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అరకు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

చెట్టి ఫాల్గుణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, పెదబయలు మండలం, శీకారి గ్రామంలో 26 జనవరి 1963లో జన్మించాడు. ఆయన 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు శీకారి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో, 6, 7వ తరగతిపెదబయలు లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు అరకులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశాడు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏ (పాలిటిక్స్) పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

చెట్టి ఫాల్గుణ రాజకీయాల్లోకి రావడానికి ముందు ఆయన 33 సంవత్సరాలు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా లో ఉద్యోగం చేశాడు. చెట్టి ఫాల్గుణ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరకు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిడారి శ్రావణ్‌కుమార్‌ పై 33172 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీ లోకి అడుగు పెట్టాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ దళపతులు". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
  3. Sakshi (2019). "Araku valley Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.
  4. Andrajyothy (25 June 2021). "అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు: ఎమ్మెల్యే ఫాల్గుణ". Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.