చెన్నపురీ విలాసము
స్వరూపం
(చెన్నపురి విలాసము నుండి దారిమార్పు చెందింది)
చెన్నపురీ విలాసము ఒక పద్య కావ్యము. దీనిని తెనాలికి చెందిన మతుకుమల్లి నృసింహ కవి 1863 సంవత్సరంలో రచించెను. దీనిని 1920 సంవత్సరంలో బ్రహ్మశ్రీ మతుకుమల్లి రఘోత్తమరాయశాస్త్రి గారు ముద్రించగా; చివరగా 1941 లో వావిళ్ళ రామస్వామి శాస్త్రులుగారి వావిళ్ళ ముద్రణాలయంలో ముద్రించారు.
ఈ కవి చెన్నపురిని, గూడూరు, వల్లూరు జమిందారైన బొమ్మదేవర నాగభూపాలునితో కలిసి సందర్శించాడు. దీనిని ఆరు అధ్యాయాలుగా విభజించారు. ఈ పుస్తకంలో 232 అచ్చ తెలుగు పద్యాలు, ఒక్కొక్క దానిలో 4-5 పంక్తులు కలిగినవిగా నాటి చెన్నపురి అనగా నేటి చెన్నైలో నివసించే ప్రజలు, వేషభాషలు, అలవాట్లను విపులంగా వివరించాయి. ఇందులో పట్టణంలోని వింతలు, విశేషాలు, నగర ప్రణాళిక మొదలైన వాటిని వివరించారు.