చెరుకు సుధాకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెరుకు సుధాకర్
చెరుకు సుధాకర్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2 జూన్ 2017 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 31 ఆగష్టు 1961
గుండ్రంపల్లి , చిట్యాల మండలం , నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ బీఆర్‌ఎస్‌
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
తెలంగాణ ఇంటి పార్టీ
తల్లిదండ్రులు చెరుకు ఉషాగౌడ్ , హంసమ్మ
జీవిత భాగస్వామి లక్ష్మి
సంతానం నుహస్ , నవ్య
నివాసం హైదరాబాద్ నకిరేకల్

చెరుకు సుధాకర్ గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యమకారుడు, వైద్యుడు, రాజకీయ నాయకుడు, కవి.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

చెరుకు సుధాకర్ 1961 ఆగస్టు 31లో తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, గుండ్రంపల్లి గ్రామంలో చెరుకు ఉషాగౌడ్, హంసమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు మిర్యాలగూడలో, 10వ తరగతి సూర్యాపేటలో పూర్తి చేశాడు. చెరుకు సుధాకర్ ఇంటర్మీడియట్ చార్మినార్ లోని నానక్ రామ్ భగవాన్ జూనియర్ కళాశాలలో, బీఎస్సీ హానర్స్ (డిగ్రీ) న్యూ సైన్స్ కళాశాలలో పూర్తి చేసి, గాంధీ మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశాడు.

వృత్తి జీవితం

[మార్చు]

డా.చెరుకు సుధాకర్ 1980లో సికింద్రాబాద్ లోని పార్శీగుట్టలో పీపుల్స్ క్లినిక్ ఏర్పాటు చేసి పేదలకు వైద్యసేవలను అందించాడు. ఆయన హైదరాబాద్ బర్కత్‌పురాలో క్లినిక్ ఏర్పాటు చేసి ఏడేళ్ల పాటు నిర్వహించిన తన తల్లి పేరిట నకిరేకల్లో ఆసుపత్రిని ఏర్పాటు చేశాడు. డా.చెరుకు సుధాకర్ నకిరేకల్, నల్గొండ పట్టణాల్లో నవ్య సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేసి పేదలకు వైద్యసేవలను అందిస్తున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

డా.చెరుకు సుధాకర్ విద్యార్థి దశ నుండే విద్యార్థి నాయకుడిగా పనిచేశాడు. ఆయన 1997లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం వివిధ సంఘాలతో కలిసి పనిచేసి ప్రజల్లో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం కల్పించాడు. తెలంగాణ మలిదశ ఉద్యమ పోరాటంలో భాగంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో కేసీఆర్ ఆహ్వానం మేరకు టిఆర్ఎస్ పార్టీలో చేరి టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశాడు.[1] ఆయన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పీడీ ఆక్ట్ లో అరెస్ట్ అయ్యి ఏడాది పాటు వరంగల్ సెంట్రల్ జైలులో జీవితం గడిపాడు.[2]

డా.చెరుకు సుధాకర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 మార్చి 22లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి, పొలిట్‌బ్యూరో పదవికి రాజీనామా చేశాడు.[3][4] ఆయన 2016లో తెలంగాణ ఉద్యమ వేదికను స్థాపించి [5] అనంతరం 2017 జూన్ 2లో తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించాడు.[6] చెరుకు సుధాకర్ 2021లో జరిగిన తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థిగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.[7]

2022 ఆగస్టు 5వ తేదీన తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి AICC కార్యాలయంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఆయన 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి[8] 2023 అక్టోబరు 21న బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాడు.[9] చెరుకు సుధాకర్ ను 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నల్లగొండ, నకిరేకల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల సమన్వయకర్తగా బీఆర్‌ఎస్‌ అధిష్టానం నియమించింది.[10]  

మూలాలు

[మార్చు]
  1. Sakshi (17 February 2014). "'తెలంగాణ'తో ఉద్యోగావకాశాలు". Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.
  2. The New Indian Express (9 December 2011). "Sudhakar released on bail". Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.
  3. The Hindu (26 March 2014). "Cheruku Sudhakar quits TRS" (in Indian English). Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.
  4. Sakshi (26 March 2014). "ఉద్యమ ద్రోహులకు టీఆర్‌ఎస్ టికెట్లు". Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.
  5. Sakshi (25 November 2016). "తెలంగాణ ఉద్యమ వేదిక దీక్ష భగ్నం". Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.
  6. Sakshi (3 June 2017). "ఆత్మగౌరవం కోసం మరో పోరాటం". Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.
  7. Andrajyothy (15 January 2021). "బతుకు తెలంగాణ కోసం ఉద్యమిద్దాం". Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.
  8. Namasthe Telangana (21 October 2023). "కాంగ్రెస్‌కు చెరుకు సుధాకర్‌ రాజీనామా". Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.
  9. Namasthe Telangana (21 October 2023). "బీఆర్ఎస్ పార్టీలో చేరిన చెరుకు సుధాక‌ర్.. గులాబీ కండువా క‌ప్పిన కేటీఆర్, హ‌రీశ్‌రావు". Archived from the original on 21 October 2023. Retrieved 21 October 2023.
  10. V6 Velugu (31 October 2023). "నల్గొండ, నకిరేకల్ ఇన్‌చార్జిగా చెరుకు సుధాకర్". Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)