Jump to content

చెరువుకొమ్ము పాలెం (నందిగామ)

అక్షాంశ రేఖాంశాలు: 16°46′30″N 80°10′43″E / 16.774890°N 80.178588°E / 16.774890; 80.178588
వికీపీడియా నుండి

చెరువుకొమ్ముపాలెం, కృష్ణా జిల్లా నందిగామ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

చెరువుకొమ్ముపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
చెరువుకొమ్ముపాలెం is located in Andhra Pradesh
చెరువుకొమ్ముపాలెం
చెరువుకొమ్ముపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°46′30″N 80°10′43″E / 16.774890°N 80.178588°E / 16.774890; 80.178588
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణాజిల్లా
నందిగామ నందిగామ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

సాగునీటి సౌకర్యం

[మార్చు]

ఈ గ్రామమునకు ఎగువున 99 ఎకరాలలో ఒక చెరువు విస్తరించియున్నది. ఈ వెరువుద్వారా ఈ గ్రామానికేగాక, పెద్దవరం, కాండ్రపాడు, బ్రహ్మభొట్లవారిపాలెం గ్రామాలలోని సుమారు 600 ఎకరాలకు సాగునీరు అందుచున్నది. ఈ భూములలో వరితోపాటు, మెట్ట పంటలు గూడా పండించుచున్నారు. అంతేగాక, ఈ చెరువును చేపల పెంపకానికి అద్దెకు ఇచ్చి, పంచాయతీకి ఆదాయం సమకూర్చుకుంటున్నారు.

దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

[మార్చు]

శ్రీ అలివేలుమంగా, పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవాలయం:- ఈ దేవాలయంలో, 2014,ఏప్రిల్-14, సోమవారం నాడు, లక్షమల్లెల అర్చన నేత్రపర్వంగా సాగినది. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని, మహిళలు సామూహికంగా లక్ష మల్లెల అర్చనలో పాలుపంచుకున్నారు. వేదపండితులు శాస్త్రోక్తంగా వేడుక నిర్వహించారు. గోవిందనామాలతో గ్రామం పులకించిపోయినది.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]