చెల్లమెల్ల సుగుణ కుమారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెల్లమెల్ల సుగుణ కుమారి
చెల్లమెల్ల సుగుణ కుమారి

చెల్లమెల్ల సుగుణ కుమారి


ముందు జి. వెంకటస్వామి
తరువాత జి. వెంకటస్వామి
నియోజకవర్గము పెద్దపల్లి

వ్యక్తిగత వివరాలు

జననం (1955-07-25) 1955 జూలై 25 (వయస్సు: 64  సంవత్సరాలు)
హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్, India
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి డా. ఎం. రాజేంద్రప్రసాద్
సంతానము 2 కొడుకులు
నివాసము హైదరాబాద్
మూలం http://parliamentofindia.nic.in/ls/lok12/biodata/12ap36.htm

డాక్టర్ చెల్లమల్ల సుగుణ కుమారి (Dr. Chellamalla Suguna Kumari) ప్రముఖ పార్లమెంటు సభ్యురాలు. [1]

ఈమె హైదరాబాద్లో 1955 సంవత్సరం జన్మించింది. ఈమె తండ్రి సి. పోచయ్య. ఈమె ఉస్మానియా వైద్య కళాశాల నుండి M.B., B.S., M.D., D.G.O. and D. Ch. పూర్తిచేసి ఆధునిక వైద్యంలో ప్రజలకు సేవ చేస్తున్నది. ఈమెకు సాంఘిక సేవ మీద మక్కువ ఎక్కువ.

ఈమె 1981 సంవత్సరంలో డా. ఎం. రాజేంద్రప్రసాద్ ను వివాహం చేసుకున్నది. వీరికి ఇద్దరుకుమారులు.

ఈమె 1998లో పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి 12వ లోకసభ తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా పోటీచేసి, గెలిచి భారత పార్లమెంటులో ప్రవేశించింది. ఆ తరువాత 2004 రెండవసారి అదే నియోజకవర్గం నుండి 13వ లోకసభకు ఎన్నికయ్యింది.

మూలాలు[మార్చు]