Jump to content

జగదీష్ లాల్ అహుజా

వికీపీడియా నుండి

జగదీష్ లాల్ అహుజా (1930 - 2021 నవంబరు 29) లంగర్ బాబా గా సుపరిచితుడు. అతను భారతదేశంలోని చండీగఢ్ చెందిన సామాజిక కార్యకర్త.[1] ఆకలితో ఉన్నవారికి, పేదలకు ఉచిత భోజనం అందించడంలో అతను ప్రసిద్ధి చెందాడు. [2][3] 2020లో సామాజిక సేవలో ఆయన చేసిన కృషికి గాను భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేశారు.[4]

ప్రారంభ జీవితం

[మార్చు]

భారతదేశ విభజన తరువాత 12 సంవత్సరాల వయస్సులో అహుజా పాకిస్తాన్ డొమినియన్ లోని పెషావర్ నుండి భారత డొమినియన్ కు వలస వచ్చాడు. అతని కుటుంబం పాటియాలా, తరువాత అమృత్ సర్, మన్సాలో ఆశ్రయం పొందింది.[5]

సామాజిక సేవ

[మార్చు]

అహూజా 2,500 మందికి రోజువారీ లంగర్ (సిక్కు దేవాలయాలలో ఉచితంగా బోజనం పెట్టే సత్రం) నిర్వహించడం ద్వారా పేదలు, ఆకలితో ఉన్న ప్రజలకు సేవ చేశాడు.[6] జనవరి 2000లో చండీగఢ్ లోణి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లంగర్ నిర్వహించడం ప్రారంభించాడు. క్యాన్సర్ చికిత్స కోసం అక్కడ చేరాడు. తరువాత ఆయన చండీగఢ్ లోని సెక్టార్ 32లోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో కూడా ఉచిత భోజనాన్ని అందించాడు.[2]

ఆయన మరణానికి ముందు 19 సంవత్సరాలుగా ప్రజలకు ఉచిత భోజనాన్ని అందించాడు.[7][4] ఉచిత భోజనానికి నిధులు సమకూర్చడానికి అతను తన 36 ఎకరాల పొలం, 9 ఎకరాల పొలమును, పంచకులలోని ఒక కనాల్ స్థలాన్ని, రెండు షోరూమ్‌లను విక్రయించాడు.[2]

గుర్తింపు

[మార్చు]

2020 జనవరి 26న సామాజిక సేవ రంగంలో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అహుజా అందుకున్నారు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Chandigarh's Langar Baba Jagdish Lal Ahuja passes away". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-11-29. Retrieved 2021-11-29.
  2. 2.0 2.1 2.2 "Padma Shri for 'Langar Baba', PGI doc". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Archived from the original on 2020-01-26. Retrieved 2020-01-27.
  3. "पंजाब के लंगर बाबा को मिलेगा पद्म श्री अवार्ड, पिछले 38 वर्षों से रोजाना बांट रहे लंगर". punjabkesari. 2020-01-26. Retrieved 2020-01-27.
  4. 4.0 4.1 "Chandigarh PGIMER doctor, 'langar baba' on Padma Shri list". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-01-26. Retrieved 2020-01-27.
  5. 5.0 5.1 Sehgal, Manjeet (26 January 2020). "Hawker turned social worker gets Padma Shri award for running free kitchen for poor in Chandigarh". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-01-27.
  6. Jain, Bharti; Dash, Dipak K. (26 January 2020). "Padma Awards 2020: 'Langar baba', elephant conservationist among unsung heroes who bagged Padma Shri". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-01-27.
  7. "UP's Langar Baba, 'Encyclopedia of Forest' Among 118 Personalities to Get Padma Shri Award". News18. Retrieved 2020-01-27.