జడ్జిగారి కోడలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జడ్జిగారి కోడలు
(1977 తెలుగు సినిమా)
Judge gari kodalu.jpg
దర్శకత్వం వి. మధుసూదన రావు
తారాగణం రామకృష్ణ ,
జయప్రద
నిర్మాణ సంస్థ సూర్యశ్రీ పిక్చర్స్
భాష తెలుగు

జడ్జిగారి కోడలు చిత్రం జయప్రదా కథానాయికగా నటించిన తెలుగు చిత్రం. ఈ చిత్రం 1977, మార్చి 22న విడుదలయ్యింది.

తారాగణం[మార్చు]

 • సత్యనారాయణ - జడ్జి నారాయణమూర్తి
 • జయప్రద - జానకి
 • రామకృష్ణ - రాజా
 • మాధవి - జయ
 • కృష్ణకుమారి - జడ్జి భార్య
 • గిరిబాబు - గోపీ
 • హలం - తార నర్తకి
 • రాజబాబు
 • మాడా
 • త్యాగరాజు
 • కె.వి.చలం

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకుడు : వి.మధుసూధనరావు
 • నిర్మాత: కె.ఎస్.రామకృష్ణారావు
 • ఛాయాగ్రహణం: కె.ఎస్.రామకృష్ణారావు
 • కథ: శశిభూషణ్
 • మాటలు: సత్యానంద్
 • పాటలు: ఆత్రేయ
 • సంగీతం: కె.వి.మహదేవన్

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను ఆత్రేయ రచించగా, కె.వి.మహదేవన్ సంగీతంలో పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడారు. [1]

క్ర.సం. పాట పాడినవారు
1 అనురాగ బంధం అపురూప బంధం ఆ బంధాల పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
2 రాతిరి రాతిరి వస్తానన్నావు మావా రాతి గంధం తీసి ఉంచాను పి.సుశీల
3 ఓయమ్మో ఇదెక్కడి మొగుడమ్మా వద్దమ్మ ఈ కాపురం పి.సుశీల
4 తల్లి తండ్రి దైవం అంటారు ఈ ముగ్గురు కలసిన మూర్తిని పి.సుశీల
5 ఈ చిక్కునెలా విడదీసేది ఈ బ్రతుకునెలా దరిచేర్చేది పి.సుశీల
6 ఈ గీతలో ఏ రాతలున్నవో ఏ జీవితా లెటు చెదరిపోవునో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

కథ[మార్చు]

రిటైర్డు జడ్జి నారాయణమూర్తి గతంలో తను ఇచ్చిన తీర్పు వల్ల ఒక నిరపరాధి కుటుంబం నాశనం కాగా అనాథాశ్రమంలో పెరిగిన అతని బిడ్డ కోడలుగా చేసుకుని ఆవిధంగా మనశ్శాంతిని పొందుతాడు. జానకి భర్త రాజా పోలీసు అధికారి. జానకి తన అత్తామామల ఆదరాభిమానాన్ని, భర్త మెప్పును పొందింది. వయసులో ఉన్న ఆడబిడ్డ జయ దుర్మార్గుడైన గోపీ వలలో పడటం చూచి ఆమెను కాపాడడం కోసం ఆమె వ్రాసిన ప్రేమలేఖలు చేజిక్కించుకోవటానికై వెళ్లి తన శీలానికే ముప్పురాగా అనుకోని పరిస్థితులలో హంతకురాలయ్యింది జానకి. ఆధారాలవల్ల తన భార్య జానకే హంతకురాలని రుజువు కావడంతో హతాశుడవుతాడు రాజా. జానకి ముద్దాయిగా బోనులో నిలబడవలసి వచ్చింది. ఆ హత్య తానే చేశానని ఒప్పుకుని ప్రేమలేఖలు వ్రాసిన ఆడకూతురు వెల్లడించడానికి నిరాకరించడంతో ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన మామ నారాయణమూర్తి డైలమాలో పడతాడు. తన కోసం, తన మానమర్యాదలు కాపాడటం కోసం వదిన చేస్తున్న త్యాగానికి జయ భరించలేక లోలోపల కుమిలి పొతుంది. గోపీకి ప్రేమలేఖలు వ్రాసింది జయ అన్న విషయం ఎలా తెలిసింది? గోపీ ఎవరివల్ల ప్రాణాలు కోల్పోయాడు? జానకి హంతకురాలు కాదని ఉత్తమురాలని నారాయణమూర్తి ఎలా నిరూపించాడు? మొదలైన ప్రశ్నలకు సమాధానం పతాక సన్నివేశంలో తెలుస్తుంది[2].

మూలాలు[మార్చు]

 1. కొల్లూరి భాస్కరరావు. "జడ్జిగారి కోడలు - 1977". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 8 February 2020.
 2. రెంటాల (6 March 1977). "చిత్ర సమీక్ష - జడ్జిగారి కోడలు". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 8 February 2020.

బయటిలింకులు[మార్చు]