జనువాడ రామస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జనువాడ రామస్వామి
Januvada Ramaswamy.jpg
జనువాడ రామస్వామి
జననం1952, జనవరి 15
రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్‌ మండలం, చిలుకూరు
నివాసంరంగారెడ్డి జిల్లా, మొయినాబాద్‌ మండలం, చిలుకూరు
వృత్తికవులు
ప్రసిద్ధులుతెలుగు ప్రొఫెసర్, కవులు
మతంహిందూమతం
భాగస్వామిసత్యవతి
తల్లిదండ్రులు
  • శ్రీ ఆగమయ్య (తండ్రి)
  • శ్రీమతి పార్వతమ్మ (తల్లి)

హృదయాలను సూటిగా తాకే శిల్ప విన్యాసంతో వచన కవితలు రచించే కొద్దిమంది కవులలో డా. జనువాడ రామస్వామి ఒకరు. ‘‘పుస్తకాలు మస్తిష్కానికి పదునుపెట్టే ఆకురాళ్లు’’ అని చెప్పిన వ్యక్తి. సామాజిక చేతన, చెప్పదలుచుకున్న అభిప్రాయానికి చక్కని భావుకత, అందుకు తగ్గ వర్ణనాత్మకత ఈయన కవిత్వంలో కనిపిస్తుంది.

జనువాడ రామస్వామి హైదరాబాద్ వెస్ట్ జోన్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంలో తీసిన ఫోటో

జననం[మార్చు]

జనువాడ రామస్వామి గారు శ్రీమతి పార్వతమ్మ, శ్రీ ఆగమయ్య దంపతులకు 1952, జనవరి 15రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్‌ మండలం, చిలుకూరు గ్రామంలో జన్మించారు.

చదువు - ఉద్యోగం[మార్చు]

తెలుగు లో ఎం.ఏ, పి.హెచ్‌.డి చేశారు. జ్యోతిష్య శాస్త్రం, సంస్కృతంలో ఎం.ఏ చేశారు. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ, మోత్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ తెలుగు ప్రొఫెసర్ గా విధులు నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ గా పదవి విరమణ పొందారు.

ప్రస్తుత నివాసం[మార్చు]

తన జన్మస్ధానమైన చిలుకూరులోనే వ్యవసాయం చూసుకుంటూ ఉంటున్నారు.

భార్య - పిల్లలు[మార్చు]

సత్యవతి - Raghavendra

ప్రచురితమయిన మొదటి కవిత[మార్చు]

కవితల జాబితా[మార్చు]

ప్రచురితమయిన పుస్తకాల జాబితా[మార్చు]

  1. కవితారామం (కవితా సంకలనం, 1986)
  2. మనోనేత్రం (కవితా సంకలనం, 1996)
  3. శ్రీ చిలుకూరు వెంకటేశ్వర శతకం (2002)
  4. జనువాడ కవితలు (2003)
  5. శ్రీ తిరుమలేశ శతకం (2010)

బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. యూ.ఎల్.ఐ లో జనువాడ కవితలు పుస్తకం
  2. శ్రీ తిరుమలేశ శతకం గురించి ఆర్. సుశీల గారు ఆంధ్రభూమిలో రాసిన వ్యాసం