Jump to content

జనెట్టి రైలు ప్రమాదం

వికీపీడియా నుండి
జనెట్టి రైలు ప్రమాదం
వివరాలు
తేదీ1911
స్థానంజనెట్టీ, ఇటలీ
దేశంఇటలీ
రైలు మర్గముజనెట్టి రైలు
ప్రమాద రకంతప్పిపోయినది
గణాంకాలు
రైళ్ళు1
మరణాలు104

జనెట్టి రైలు ప్రమాదం1911లో ఇటలీలో జరిగింది. ఈ రైలులో 100 మంది ప్రయాణికులు 6 రైల్వే సిబ్బందితో మొత్తం 106 మంది రోమ్‌ నగరం నుంచి ఆ ట్రైన్‌ బయలుదేరింది.[1]ఈ ప్రమాదంలో 104 మంది ప్రయాణికులు మరణించారు.[2]

ప్రమాదం

[మార్చు]

జనెటి కంపెనీ మూడు బోగీల న్యూ మోడల్‌ ట్రైన్‌ను ప్రవేశపెట్టింది.ఈ రైలు లో ఉచిత ప్రయాణం చేయవచ్చు అని జనెటి కంపెనీ ప్రకటించింది.ఈ రైలులో ప్రయాణం చేసేందుకు 100 మంది ప్రయాణికులు 6 రైల్వే సిబ్బందితో మొత్తం 106 మంది రోమ్‌ నగరం నుంచి ఆ ట్రైన్‌ బయలుదేరింది. దారిలో పర్వత ప్రాంతం మీదుగా కిలోమీటరు పొడవున్న సొరంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఆ ట్రైన్‌ మరో స్టేషన్‌ని చేరుకోలేదు. కనీసం ఆ సొరంగాన్ని కూడా దాటలేదు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని భావించిన రైల్వే అధికారులు సొరంగాన్ని చేరి, కిలోమీటరు పొడవునా అణువణువూ గాలించారు. ఎలాంటి ఆధారం దొరకలేదు. ఆ ట్రైన్‌ నుంచి ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. రైలు నుంచి దూకిన ఆ ఇద్దరు ప్రయాణికులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యి ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆ ఇద్దరిలో ఒకతను అసలు విషయం బయటపెట్టాడు. ఆ రోజు రైలు సొరంగంలోకి ప్రవేశించగానే తెల్లని పొగ కమ్మేసిందని, రైల్లో ఉన్నవాళ్లంతా పెద్దపెద్దగా అరవడం విని భయంతో బయటకు దూకేశామని, ఆ తర్వాత రైలు ఏమైందో తెలియదని చెప్పాడు.తరువాత జరిగిన యుద్ధంలో ఆ సొరంగం దెబ్బతినగా, దాన్ని శాశ్వతంగా మూసివేశారు. అయితే ఆ రైలును ‘ఘోస్ట్ ట్రైన్‌’గా పిలవడం మొదలుపెట్టారు.ఆ 104 మందిలో ఒక వ్యక్తి దగ్గర డన్హిల్‌ కంపెనీకి చెందిన సిగార్‌ పెట్టె దొరికింది. దాని మీద 1907 సంవత్సరం ప్రింట్‌ అయ్యి ఉంది.1907 అని భవిష్యత్తు సంవత్సరం గురించి రాసి ఉందన్నారు.ఇక ఇప్పటికీ మెక్సికోలోని మ్యూజియంలో ఉందని నివేదికలు పేర్కొన్నారు.[3][4]

మెక్సికోలో ప్రత్యక్షం

[మార్చు]

1911లో మిస్సయిన రైలు 104 మంది ప్రయాణికులు 1845 సంవత్సరానికి చేరుకున్నారనే ఓ రిపోర్ట్‌ 1926లో అంటే ట్రైన్‌ మిస్‌ అయిన పదిహేనేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. అప్పటి మెక్సికో అధికారిక సమాచారం ప్రకారం 1845 సంవత్సరంలో ఆ 104 మంది ప్రయాణికులు మేమంతా ఇటలీలోని రోమ్‌ నుంచి జనెటి ట్రైన్‌లో ఇక్కడికి వచ్చాం అని చెప్పారు.అయితే పదివేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మెక్సికో–ఇటలీల మధ్య రైల్వే మార్గం లేదు. సముద్రయానం తప్ప మరో దారే లేదు. అక్కడ అధికారులు వాళ్లని పిచ్చివాళ్లుగా భావించి మానసిక చికిత్సాలయంలో చేర్పించారు. ఆ తర్వాత మెక్సికో అధికారులు ఇటలీ అధికారులని సంప్రదించారు.అయితే, అది 1845వ సంవత్సరం కావడం వల్ల అప్పటికి 1911 ట్రైన్‌ మిస్సింగ్‌ ఘటన ఇటలీలో చోటుచేసుకోలేదు. దాంతో ఆ 104 మంది తమ దేశం వాళ్లు కాదని, అలాంటి ట్రైన్‌ తమ వద్ద లేనే లేదని ఇటలీ ప్రకటించింది.

సొరంగం శిధిలం

[మార్చు]

జనెటి ట్రైన్‌ని మాయం చేసిన ఆ సొరంగం.. ప్రపంచయుద్ధ సమయంలోని వైమానిక దాడుల్లో నాశనం అయింది. ఇటలీలోని రైల్వే మ్యూజియంలో నేటికీ ఆ ట్రైన్‌ మోడల్‌ ప్రదర్శనకు ఉంది. ఇక ఆ ట్రైన్‌లో లభించిన 1907 నాటి సిగార్‌ ప్యాకెట్‌ని ఇప్పటికీ మెక్సికోలోనే భద్రపరిచారు.

మూలాలు

[మార్చు]
  1. "Italy's mysterious train disappeared with 104 passengers, no clue foun". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2021-12-30.
  2. "జెనెట్టి రైలు ప్రమాదం". సాక్షి. Archived from the original on 2021-12-14.
  3. "ఆ గుహలోకి వెళ్లగానే మాయమైన రైలు.. 106 మంది ప్రయాణికులు మిస్సింగ్, అక్కడ ఏం జరిగింది?". Samayam Telugu. Retrieved 2021-12-24.
  4. Telugu, TV9 (2021-05-25). "ఇది ఒక దెయ్యం రైలు కథ..106 మందితో బయలుదేరిన రైలు అదృశ్యమైంది..? ఇప్పటి వరకు తిరిగి రాలేదు." TV9 Telugu. Retrieved 2021-12-24.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)