జమునా దేవి
జమునా దేవి | |
|---|---|
| మధ్య ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి | |
| In office 1998–2003 | |
| మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యురాలు | |
| In office 2003–2010 | |
| అంతకు ముందు వారు | బాబుల్ గౌర్ |
| తరువాత వారు | సత్యదేవ్ |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1929 నవంబరు 19 శారదాపూర్, మధ్య ప్రదేశ్, భారతదేశం |
| మరణం | 2010 సెప్టెంబరు 24 (వయసు: 80) ఇండోర్, మధ్య ప్రదేశ్ , భారతదేశం |
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
| సంతానం | 1 కూతురు |
| వృత్తి | రాజకీయ నాయకురాలు |
| As of జూన్ 17, 2018 | |
జమునా దేవి (1929 నవంబరు 19 - 2010 సెప్టెంబరు 24) మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. జమునా దేవి మధ్య ప్రదేశ్ శాసనసభ సభ్యురాలుగా మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలుగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.[1] జమునా దేవి ఝబువా నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. జమున దేవి 1978 నుండి 1981 వరకు రాజ్యసభ సభ్యురాలుగా పనిచేసింది.[2]
రాజకీయ జీవితం
[మార్చు]జమునా దేవి 1952 నుండి 1957 వరకు మధ్య ప్రదేశ్రాష్ట్ర మొదటి శాసనసభ సభ్యురాలుగా పనిచేసింది., ఆ తర్వాత 1962 నుండి 1967 వరకు ఝబువా పార్లమెంటు సభ్యురాలుగా పనిచేసింది. 1978 నుండి 1981 వరకు రాజ్యసభ సభ్యురాలుగా పనిచేసింది.
జమున దేవి అర్జున్ సింగ్, మోతీలాల్ వోరా శ్యామా చరణ్ శుక్లా ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు, దిగ్విజయ సింగ్ మంత్రివర్గంలో జమున దేవి ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.
2003లో భారత జాతీయ కాంగ్రెస్ మధ్యప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయినప్పుడు, జమునా దేవి 2003 నుండి 2010 వరకు మధ్య ప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేశారు.[3][4]
మరణం
[మార్చు]జమునాదేవి క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేసి, 2010 సెప్టెంబరు 24న ఇండోర్‌లో మరణించింది.[4][5][6][7][8]
మూలాలు
[మార్చు]- ↑ "MP Legislative Assembly".
- ↑ "Congress leader Jamuna Devi passes away". 24 September 2010.
- ↑ Cong leader Jamuna Devi passes away
- 1 2 MP Leader of Oppn Jamuna Devi dies at 80
- ↑ Singh, Mahim Pratap (24 Sep 2010). "Veteran Congress leader Jamuna Devi passes away" (in ఇంగ్లీష్). Bhopal: thehindu.com. The Hindu. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 June 2018.
- ↑ "Cong leader Jamuna Devi passes away" (in ఇంగ్లీష్). Bhopal: indiatoday.in. ITGD Bureau. 24 Sep 2010. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 June 2018.
- ↑ "MP's senior INC leader Jamuna Devi passes away" (in హిందీ). Indore: hindi.oneindia.com. 24 Sep 2010. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 June 2018.
- ↑ "MP Leader of Oppn Jamuna Devi aka Buaji is dead" (in ఇంగ్లీష్). Indore: news.webindia123.com. UNI. 24 Sep 2010. the original నుండి 17 జూన్ 2018 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 June 2018.