జలాల్-ఉద్-దిన్ (క్రికెటర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జలాల్-ఉద్-దిన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1959-06-12) 1959 జూన్ 12 (వయసు 64)
కరాచీ, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 91)1982 అక్టోబరు 14 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1985 అక్టోబరు 16 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 39)1982 మార్చి 12 - శ్రీలంక తో
చివరి వన్‌డే1983 అక్టోబరు 2 - ఇండియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 6 8
చేసిన పరుగులు 3 5
బ్యాటింగు సగటు 3.00 2.50
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 2 5
వేసిన బంతులు 1,197 306
వికెట్లు 11 14
బౌలింగు సగటు 48.81 15.07
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/77 4/32
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 1/–
మూలం: ESPNcricinfo, 2006 ఫిబ్రవరి 4

జలాల్-ఉద్-దిన్ (జననం 1959, జూన్ 12) పాకిస్తాన్ మాజీ క్రికెటర్. 1982 నుండి 1985 వరకు ఆరు టెస్ట్ మ్యాచ్‌లు, ఎనిమిది వన్డే ఇంటర్నేషనల్‌లలో ఆడాడు. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ క్రికెట్ జట్టు తరపున కూడా ఆడాడు.

క్రికెట్ కెరీర్[మార్చు]

స్పెషలిస్ట్ రైట్ ఆర్మ్ పేస్ బౌలర్గా రాణించాడు. వన్డే క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించిన మొదటి ఆటగాడిగా రికార్డు సాధించాడు. 1982, సెప్టెంబరు 20న హైదరాబాద్‌లోని నియాజ్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఇతను ఆ రికార్డును సాధించాడు.[1][2][3]

ఇప్పుడు కోచ్ గా ఉన్నాడు. ఈసిబి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్థాయి 3 కోచ్‌గా గుర్తింపు పొందిన ఏకైక పాకిస్తానీ టెస్ట్ క్రికెటర్.[4][5][6] 2021, ఫిబ్రవరిలో స్థాయి 4 కోచ్ గా ఉన్నాడు.[7]

2018 జనవరిలో, పాకిస్తాన్ మహిళల జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా నియమితుడయ్యాడు.[8] 2019 మార్చిలో, ఇతని స్థానంలో పాకిస్థాన్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ ఉరూజ్ ముంతాజ్ ఆ స్థానంలోకి వచ్చింది.[9]

2020 అక్టోబరులో, సౌత్-వెస్ట్ జోన్ కోసం యుఎస్ఏ జాతీయ సెలెక్టర్‌గా నియమించబడ్డాడు. పురుషుల సీనియర్లు, యూత్ టీమ్‌లను ఎంపిక చేసే బాధ్యతను కలిగి ఉన్నాడు.[10]

క్రికెట్ అకాడమీలు[మార్చు]

పాకిస్తాన్‌లో "క్రికెట్ అకాడమీల కాన్సెప్ట్" మార్గదర్శకుడిగా పరిగణించబడుతున్న జలాల్ 1999లో కస్టమ్స్ క్రికెట్ అకాడమీని, 2009లో వైటల్ ఫైవ్ క్రికెట్ అకాడమీని స్థాపించాడు, రెండూ కరాచీలో ఉన్నాయి.[11]

2009 ఆగస్టులో, కోరంగి టౌన్ అడ్మినిస్ట్రేషన్ కరాచీలోని జమాన్ టౌన్‌లో ఉన్న అతని మరొక క్రికెట్ అకాడమీ జలాలుద్దీన్ క్రికెట్ అకాడమీని ప్రారంభించింది.[12] అట్టడుగు స్థాయిలో ప్రతిభను పెంపొందించే లక్ష్యంతో, స్థానిక క్రికెటర్లకు అధిక శిక్షణ పొందిన నిపుణుల ద్వారా ఉచిత కోచింగ్‌ను అందిస్తుంది.[13]

మూలాలు[మార్చు]

  1. "Full Scorecard of Pakistan vs Australia 1st ODI 1982/83 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2022-08-31.
  2. Ali, Syed INtikhab (20 January 2015). "Hat-trick man Jalaluddin gets glowing tributes". The News International (in ఇంగ్లీష్). Retrieved 2022-08-31.
  3. Hashmi, Nabeel (2012-03-13). "Include someone who possesses coaching skills: former cricketer Jalaluddin". The Express Tribune (in ఇంగ్లీష్). Retrieved 2022-08-31.
  4. "Jalal-ud-Din profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo. Retrieved 2022-08-31.
  5. "Jalaluddin takes first ODI hat-trick". Cricket Country (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-09-22. Retrieved 2022-08-31.
  6. Jabri, Parvez (2016-06-06). "Ex-Test Cricketer Jalaluddin inaugurates Nazimabad Super Cup T20". Business Recorder (in ఇంగ్లీష్). Retrieved 2022-08-31.
  7. "Comment: Young blood, strong head coach can revive women team's fortunes". Dawn News. 17 February 2021.
  8. "PCB names Jalaluddin as women's new chief selector". Daily Times. 25 January 2018.
  9. "Urooj replaces Jalaluddin as women's chief selector". Dawn News. 21 March 2019.
  10. "Former Pakistan cricketers Asif Mujtaba, Jalaluddin land jobs with USA Cricket". Geo Super. 28 October 2020.
  11. "Jalaluddin to work with Michigan Cricket Association in US". Dawn News. 4 August 2017.
  12. "Academy named after Jalaluddin". Dawn News. 18 August 2009.
  13. Hussain, Bilal (10 March 2013). "Striving for excellence". Jang.