Jump to content

జాండ్ర

వికీపీడియా నుండి

జాండ్ర బి.సి.బి.గ్రూపులోని కులం. రాష్ర్ట వ్యాప్తంగా జాండ్ర కులస్థులు దాదాపు 8 లక్షల మంది ఉన్నారు. వీరి కులవృత్తి నేతపని. చాలామంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నవారు ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లారు. వలసలు ప్రారంభం కాకమునుపు ఇక్కడ ఆ రోజుల్లో రోజుకు రెండు రూపాయలు మజూరీ(కూలీ) ఇస్తే పనిచేసేవారు. ఇంట్లో వారు అంతా కలిసి పనిచేసేవారు కనుక ఎంతో కొంత మిగుల్చుకునేవారు. చేనేత మగ్గాలపైనే కుటుంబం మొత్తం ఆధారపడి జీవిం చేది. ఇంట్లో ఒక్క మగ్గం ఉందంటే ఇంటిల్లిపాదీ పనిచేసేవారు. అప్పట్లో చాలామంది విద్యావంతుల య్యారు. ఉన్నత పదవులు కూడా పొందారు. జాండ్ర సామాజిక వర్గానికి చెందిన విద్యా వంతులు తమ విద్యా ర్థులను ప్రోత్సహించే దిశగా ప్రయ త్నాలు సాగిస్తున్నారు. 1960 వరకు ఈ వృత్తిదారులకు ప్రాధాన్యత ఉండేది. వపర్‌ లూమ్స్ ఊపందుకోవటంతో చేనేత కార్మికుల మాదిరే వీరికీ ఉపాధి కరువైంది. పది మందికి ఉపాధి కల్పించే పనిని ఒక్క పవర్‌ లూమ్‌ లాగేసుకుంది. కనుకనే వీరిలో నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆది నుంచి మగ్గం గుంటలో కూర్చొని నేయటానికి అలవాటుపడిన వారు బరువులు మోసి, బండలెత్తే పనులు చేయలేకపోవంతో వీరికి ఎక్కడా ఉపాధి లభించలేదు. మహిళలు బీడీలు చుట్టే పనిని ఎంచుకున్నారు. కనుకనే నేటికీ వీరిలో అధిక శాతం బీడీలు చుడుతూ కనిపిస్తారు. నేత పనిచేసే ఇతర కులాలవారికన్నా జాండ్ర కులస్థులకు ప్రత్యేక గుర్తింపు ఉంది, కనుకనే రాష్ర్టంలోని కొన్ని పట్టణాలలో జాండ్రపేటల పేర్లతో పిలువబడుతున్న కాలనీలను నేటికీ మనం చూడొచ్చు. చేతివేళ్లతో అద్భుత కళాఖండాలను సృష్టించేవారు వీరిలో ఉన్నారు. కొత్త డిజైన్ల రూపకల్ప నతోపాటు, రంగులు అద్దకాల అంశంలోనూ వీరికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.

శ్రావణ మాసోత్సవం

[మార్చు]

ప్రతి ఏడాదీ శ్రావణమాసం అమావాస్యకు ముందు వచ్చే సోమవారం వీరు ఉత్సవం జరుపుకుంటారు. ఈ ఉత్సవం కోసం ఎక్కకెక్కడి వారు స్వస్థలాలకు చేరుకుని అందులో పా ల్గొంటారు. శ్రావణ మాసంలో వస్తుంది కనుక శ్రావణ మాసో త్సవంగా దీనిని చెప్పుకుంటారు. ఈ ఉత్సవంలో సందికోల పేరుతో 30 అడుగుల కరన్రు అలంకరిస్తారు. ఆదివారం అంతా భక్తి గీతాలు, భజనలతో కాలం గడుపుతారు. సోమవారం ఉద యం నుంచి రాత్రి వరకు వివిధ కార్యక్రమాలు జరుపుతారు. విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలు కూడా చేపడతారు.


గ్రామీణ ప్రాంతాలలోని జాండ్ర పిల్లల చదువుకోసం హాస్టళ్లు, కులవృత్తి చేస్తు శ్యాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులు ఇచ్చే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్నికోరుతున్నారు. కమ్యూనిటీ హాలు నిర్మాణం కోసం కర్ణాటకలోని జాండ్ర కులస్థులు ఆర్థిక సహాయం అందించేందుకు ముం దుకు వచ్చారని ప్రభుత్వ పరంగా కూడా జిల్లాలలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి స్థలం మంజూరు చేయాలని కోరుతున్నారు.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జాండ్ర&oldid=2822860" నుండి వెలికితీశారు