జార్జ్ ఆల్ఫ్రెడ్ లారెన్స్ హెర్నే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జార్జ్ హెర్నే
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1888-03-27)1888 మార్చి 27
క్యాట్‌ఫోర్డ్, కెంట్
మరణించిన తేదీ1978 నవంబరు 13(1978-11-13) (వయసు 90)
బార్బెర్టన్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
బంధువులుఫ్రాంక్ హెర్నే (తండ్రి)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1922 23 December - England తో
చివరి టెస్టు1924 16 August - England తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 3 41
చేసిన పరుగులు 59 1,981
బ్యాటింగు సగటు 11.80 28.30
100లు/50లు 0/0 2/10
అత్యధిక స్కోరు 28 138
వేసిన బంతులు 714
వికెట్లు 14
బౌలింగు సగటు 28.64
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 3/9
క్యాచ్‌లు/స్టంపింగులు 3/0 38/2
మూలం: CricInfo, 2017 28 October

జార్జ్ ఆల్‌ఫ్రెడ్ లారెన్స్ హెర్నే (1888, మార్చి 27 - 1978, నవంబరు 13) దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు.

జననం, కుటుంబం[మార్చు]

హెర్న్ 1888, మార్చి 27న కెంట్‌లోని క్యాట్‌ఫోర్డ్‌లో జన్మించాడు. 1889లో తన కుటుంబంతో కలిసి కేప్ కాలనీకి వలస వెళ్ళాడు. ఇతని తండ్రి, ఫ్రాంక్ హెర్న్ ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా రెండింటికీ టెస్ట్ క్రికెట్ ఆడిన ప్రొఫెషనల్ క్రికెటర్, హర్నే క్రికెటర్ల కుటుంబంలో సభ్యుడు. ఇతను కెంట్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు ఆడాడు. పశ్చిమ ప్రావిన్స్‌తో కోచ్ పదవిని చేపట్టడానికి అనారోగ్యం కారణంగా వలస వెళ్ళాడు.[1][2]

క్రికెట్ రంగం[మార్చు]

జార్జ్ హెర్న్ 1910/11, 1926/27 మధ్య పశ్చిమ ప్రావిన్స్ తరపున కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, వికెట్ కీపర్‌గా ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. 1922/23, 1924 మధ్య దక్షిణాఫ్రికా తరపున మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[3] 1922, డిసెంబరులో ఇంగ్లాండ్‌పై జోహన్నెస్‌బర్గ్‌లో తన అరంగేట్రం చేశాడు, 1922/23 పర్యటనలో రెండు మ్యాచ్‌లు ఆడాడు. హెర్న్ 1924లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లాండ్‌లో పర్యటించాడు, ఓవల్‌లో సిరీస్‌లోని చివరి టెస్టులో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.[3]

మరణం[మార్చు]

హీర్న్ తన 90 సంవత్సరాల వయస్సులో 1978, నవంబరు 13న దక్షిణాఫ్రికాలోని బార్బర్టన్‌లో మరణించాడు.[3]

మూలాలు[మార్చు]

  1. Frank Hearne, Obituaries in 1949, Wisden Cricketers' Almanack, 1950. Retrieved 2017-10-28.
  2. A short history of Kent cricket, Wisden Cricketers' Almanack, 1907. Retrieved 2017-10-28.
  3. 3.0 3.1 3.2 Hearne, George Alfred Lawrence, Obituaries before 1979, Wisden Cricketers' Almanack, 1980. Retrieved 2017-10-28.

బాహ్య లింకులు[మార్చు]