జింకు ఫ్లోరైడ్
పేర్లు | |
---|---|
ఇతర పేర్లు
Zinc difluoride
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [7783-49-5] |
పబ్ కెమ్ | 24551 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | ZH3200000 |
SMILES | F[Zn]F |
| |
ధర్మములు | |
ZnF2 | |
మోలార్ ద్రవ్యరాశి | 103.406 g/mol (anhydrous) 175.45 g/mol (tetrahydrate) |
స్వరూపం | white needles hygroscopic |
సాంద్రత | 4.95 g/cm3 (anhydrous) 2.30 g/cm3 (tetrahydrate) |
ద్రవీభవన స్థానం | 872 °C (1,602 °F; 1,145 K) (anhydrous) 100 °C, decomposes (tetrahydrate) |
బాష్పీభవన స్థానం | 1,500 °C (2,730 °F; 1,770 K) (anhydrous) |
.000052 g/100 mL (anhydrous) 1.52 g/100 mL, 20 °C (tetrahydrate) | |
ద్రావణీయత | sparingly soluble in HCl, HNO3, ammonia |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం
|
tetragonal (anhydrous), tP6 |
P42/mnm, No. 136 | |
ప్రమాదాలు | |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
జింకు ఫ్లోరైడ్ఒక అకర్బన రసాయన సమ్మేళనపదార్ధం.జింకు, ఫ్లోరిన్ మూలకాల సంయోగం వలన జింకు ఫ్లోరైడ్ సంయోగపదార్ధం ఏర్పడినది.ఈ సంయోగపదార్ధం యొక్క రసాయన సంకేత నామం ZnF2. జింకు ఫ్లోరైడ్ అనార్ద్ర/ నిర్జల, జలయుత/సార్ద్ర రూపాలలోనూలభిస్తుంది. నాలుగు జలాణువులున్న సజల (hydrous) జింకు ఫ్లోరైడ్ రోంబోహెడ్రాల్ స్పటిక రూపసౌష్టవాన్ని కల్గి ఉండును. ఎక్కువ ద్రవీభవన స్థానం కల్గిన సంయోగపదార్ధం.ZnCl2, ZnBr2, ZnI2 (జింకు అయోడైడ్) వంటి ఇతర జింకు సంయోగ పదార్థాల వలె కాకుండా, జింకు ఫ్లోరైడ్ నీటిలో కరుగుతుంది.
ఉత్పత్తి
[మార్చు]జింకు ఫ్లోరైడ్ ను పలు రకాల పద్ధతులలో తయారు చేస్తారు.
- సజల ద్రవ రూపాలలో జింకు క్లోరైడ్‌తో ఫ్లోరైడ్ లవణం రసాయనచర్య జరపడం వలన జింకుఫ్లోరైడ్, క్లోరైడ్ లవణపదార్ధం ఏర్పడును.
- ఫ్లోరిన్ వాయువుతో జింకు లోహం రసాయనచర్య వలన కూడా జింకు ఫ్లోరైడ్‌ను ఉత్పత్తి చెయ్యవచ్చును.
- హైడ్రోఫ్లోరిక్ ఆమ్లంతో జింకు లోహం రసాయనిక చర్య వలన హైడ్రోజన్ వాయువు, జింకు ఫ్లోరైడ్ ఏర్పడును.
భౌతిక లక్షణాలు
[మార్చు]జింకు ఫ్లోరైడ్ తెల్లని సూదులవంటి స్పటికరూపంలో, ఘనరూపంలో ఉండును[1]. జింకు ఫ్లోరైడ్ ఆర్ద్రతాకర్షణ కలిగిన సంయోగపదార్ధం.అనార్ద్ర జింకు ఫ్లోరైడ్ అణుభారం 103.406 గ్రాములు/మోల్.నాలుగు జలాణువులున్న నార్ద్ర/జలయోజిత జింకు ఫ్లోరైడ్ అణుభారం 175.45 గ్రాములు /మోల్.అనార్ద్ర జింకు ఫ్లోరైడ్ సాంద్రత 4.95గ్రాములు/సెం.మీ3[1][2]., నాలుగు జలాణువులున్న/జలయోజిత నార్ద్ర జింకు ఫ్లోరైడ్ సాంద్రత 2.30 గ్రాములు/సెం.మీ3.అనార్ద్ర జింకు ఫ్లోరైడ్ ద్రవీభవన స్థానం 872 °C (1,602 °F; 1,145K).నార్ద్ర/జలయోజిత జింకు ఫ్లోరైడ్‌ను వేడిచేసిన 100 °C వద్ద వియోగం చెందును.అనార్ద్ర జింకు ఫ్లోరైడ్ బాష్పీభవన స్థానం 1,500 °C. జింకు ఫ్లోరైడ్ నీటిలో కరుగుతుంది.[1] జింకు ఫ్లోరైడ్ yokka CAS # 7783-49-5 .
రసాయన చర్యలు
[మార్చు]- జింకు ఫ్లోరైడ్‌ను వేడినీటితో జలవిశ్లేషణ కావించిన జింకు హైడ్రోక్సిఫ్లోరైడ్ Zn (OH) Fఏర్పడును.
- పొటాషియంతో తీవ్రంగా చర్య జరుపును.సేంద్రియ సమ్మేళనాలలో రసాయనిక చర్యవలన ఫ్లోరిన్‌ను (Fluorinate) జతపరచును/ చెయ్యును.వేడి ఆమ్లాలలో కరుగును.[3]
ఆరోగ్యం పై ప్రభావం
[మార్చు]- శ్వాసించిన/ముక్కుద్వారాపిల్చినచో ముక్కు దురద పెట్టడం, పొడిబారిపోవడం, ముక్కునుండి రక్తం కారడం సంభవించును.కళ్ళలో పడిన ఇరిటెసన్ కల్గించును.చర్మంపై ఎక్కువ సమయం తాకిన బొబ్బలు, పొక్కులు ఏర్పడును.కడుపులోకి వెళ్ళిన పొత్తికడుపులో నొప్పి, విరేచనాలు, డిహైడ్రెసన్ జరగడం, వాంతులు రావడం, దప్పిక కల్గడం వంటి ధుష్ఫలితాలు కల్గును[3].
ఇవికూడా చూడండి
[మార్చు]ఆధారాలు/మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Zinc Fluoride". americanelements.com. Retrieved 2016-02-17.
- ↑ "Zinc fluoride". sigmaaldrich.com. Retrieved 2016-02-17.
- ↑ 3.0 3.1 "ZINC FLUORIDE". cameochemicals.noaa.gov. Retrieved 2016-02-17.