జిఎస్‌ఎల్‌వి-D1 ఉపగ్రహ వాహకనౌక
జీఎస్ఎల్వి–D1 ఉపగ్రహ వాహకనౌక లేదా ప్రయోగనౌక ఇస్రోవారు తయారుచేసి అభివృద్ధిపరచిన భూసమస్థితి ఉపగ్రహ ప్రయోగవాహనం శ్రేణికి చెందినది. భారతీయ అంతరిక్ష పరిశోధనసంస్థ (ఇస్రో) ఎక్కువ బరువున్న ఉపగ్రహాలను స్వయంగా భారతదేశంనుండి ప్రయోగించుటకై తయారుచేసిన ఉపగ్రహప్రయోగ వాహకం శ్రేణికి చెందినదే భూసమస్థితి ఉపగ్రహ ప్రయోగ వాహనం (Geo-synchronous Satellite Launch Vehicle).అంతకు ముందు ఇస్రోవాళ్ళు నిర్మించి ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి వాహకనౌక ద్వారా ఉపగ్రహాలను కనిష్ఠ ఎత్తు భూకక్ష్యలో (low earth orbit) మాత్రమేప్రవేశ పెట్టగలిగేవారు.జీఎస్ఎల్ వి శ్రేణి ఉపగ్రహ ప్రయోగ/వాహక నౌక ద్వారా ఎక్కువ బరువున్న ఉపగ్రహాలను భూసమస్థితి బదిలీ కక్ష్యలో (Geo-Synchronous Transfer Orbit : GTO ) ప్రవేశ పెట్టగల అంతరిక్ష విజ్ఞానాన్ని, సాంకేతికను సంతరించుకున్నారు. జీఎస్ఎల్ వి ఉపగ్రహ వాహకనౌకలో కుడా పీఎస్ఎల్‌వి ఉపగ్రహ వాహకంలో ఉన్నట్లుగానే మొదటి రెండుదశల్లో ఘన, ద్రవ ఇంధనాలను కలిగి ఉండి, మూడవ పైదశలో క్రయోజనిక్ దశ అమర్చబడిఉండును. పీఎస్ఎల్వీఉపగ్రహ వాహకంలో నాలుగు దహన దశలు/స్టేజిలు ఉండగా, జీఎస్ఎల్‌విలో కేవలం మూడు దశలు మాత్రమే ఉండును.
జీఎస్ఎల్‌వి–D1 పొడవు 49 మీటర్లు.మొదటిదశలో (GS1) ఘనచోదక మోటరు (S125) దానికి అనుబంధంగా నాలుగు ద్రవచోదక స్ట్రాపాన్ (L40 ) మోటర్లు బిగింపబడిఉండును.రెండవ దశ (GS2) లో ఒంటరి ద్రవ చోదక ఇంజను (L37.5).ఉండును. మూడవ దశ (GS3) క్రయోజనిక్ దశ/స్టేజి (C12) రీస్టార్టబుల్ ఇంజను కలిగి ఉండును[1].
పరామితులు | మొదటిదశ S125 బూస్టరులు | మొదటిదశL4స్ట్రాపానులు | రెండవదశ | మూడవదశ |
పొడవు (మీటర్లు) | 20.3 | 19.7 | 11.6 | 8.7 |
వ్యాసం (మీటర్లు) | 2.8 | 2.1 | 2.8 | 2.8 |
మొత్తం బరువు టన్నులు | 156 | 46 | 42.8 | 15 |
చోదన ఇంధనం (టన్నులు[2] | 129 | 40 | 38 | 12.5 |
కేస్/ట్యాంకునిర్మాణ లోహం | M250స్టీలు | అల్యూమినియం మిశ్రమథాతువు | అల్యూమినియం మిశ్రమథాతువు | అల్యూమినియం మిశ్రమథాతువు |
చోదకం/చాలక ఇంధనం | HTPB | UDMH & N2O4 | UDMH & N2O4 | LH2 & LOX |
దహన కాలం (సెకన్లు) | 100 | 160 | 150 | 720 |
గరిష్ఠ త్రోయు పీడనం (kN) | 4700 | 680 | 720 | 73.5 |
నిర్దిష్ట ప్రేరణ (Ns/kg) | 2610 | 2750 | 2890 | 4510 |
నియంత్రణ విధానం | Multi-port SITVC | EGC single plane gimballing |
EGC two plane gimballing for pitch & yaw control. Hot gas RCS for roll control. |
2 steering engines for thrust phase control & cold gas RCS for coast phase control. |
ఉపగ్రహ వాహకనౌక ప్రయోగం
[మార్చు]జీఎస్‌ఎల్‌వి-D1 ఉపగ్రహ వాహకనౌకను మొదట శ్రీహరికోట లోని సతిష్‌థాన అంతరిక్షకేంద్రంనుండి 2001 మార్చి 28లో ప్రయోగించుటకు సన్నహాలు చేసారు, ప్రయోగానికి చివరి క్షణంలో ముందు, స్ట్రాపన్ (L40) మోటరులలో ఒకదానిలో అనుకున్నస్థాయిలో త్రోయుశక్తి (thrust) ఏర్పడక పోవడం తో, ప్రయోగాన్ని ఆపివేసారు[2]. ఈ రాకెట్ ద్వారా జీఈశాట్-1 ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతిష్ థావన్ అంతరిక్ష కేంద్రంనుండి 2001 ఏప్రిల్ 18న ఈ ఉపగ్రహవాహనాన్ని ప్రయోగించారు[3].అయితే మూడోదశలో ఇంజను పూర్తి సమయం వరకు దహన క్రియ జరుగనందున అనుకున్నదానికన్న తక్కువ ఎత్తులో ఉపగ్రహాని కక్ష్యలో ప్రవేషపెట్టినది.మూడవదశలోని క్రయోనిక్ ఇంజన్ ను రష్యానుండి సరఫరా అయ్యినది.12KRB క్రయోజెనిక్ ను రష్యా వారు సరాఫరాచేసారు.ఈ ఇంజన్, పైస్టేజిలో 710 సెకన్ల పాటు మండవలసి ఉండగా, అది కేవలం 698 సెకన్లు మాత్రమే మండటం వలన ఉపగ్రహము కక్ష్యలోకి వెళ్ళలేకపోయింది.పీఎస్ఎల్వీవాహకనౌకలో ఉపయోగించిన వాహన నావిగేషన్ (వాహన మార్గదశ ) విధానాన్ని జీఎస్ఎల్వి వాహకనౌకలో వాడటంకూడా ఇందుకు కారణం కావోచ్చును.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు/ఆధారాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "GSLV-D1". isro.gov.in. Archived from the original on 2015-08-21. Retrieved 2015-09-08.
- ↑ 2.0 2.1 "First developmental flight of geosynchronous satellite launch vehicle (GSLV-D1)" (PDF). iisc.ernet.in. Archived from the original (PDF) on 2016-03-05. Retrieved 2015-09-08.
- ↑ "ISRO Press Brief on GSLV-D1/GSAT-1". spaceref.com. Retrieved 2015-09-08.[permanent dead link]