జితేంద్రనాథ్ గోస్వామి
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
జితేంద్రనాథ్ గోస్వామి (జననం: 1950 నవంబరు 18) భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత.
తొలినాళ్ళ జీవితం
[మార్చు]జితేంద్రనాథ్ గోస్వామి 1950, నవంబర్ 18 న అస్సాం లోని జోర్హాట్లో జన్మించాడు. ఈయన గౌహతి విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్సి డిగ్రీ పొందాడు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో చేసాడు. బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పరిశోధనా పండితుడిగా కూడా పనిచేశాడు. 1978 లో గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పట్టా పొందాడు.
కెరీర్
[మార్చు]ఈయన తన పీహెచ్‌డీ తరువాత యుసి బర్కిలీ, వాషింగ్టన్ విశ్వవిద్యాలయం, లూనార్ అండ్ ప్లానెటరీ ఇన్స్టిట్యూట్, మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ వంటి అనేక ప్రతిష్టాత్మక సంస్థలలో పరిశోధనా శాస్త్రవేత్తగా పనిచేశాడు. ఈయన తన ప్రధాన పరిశోధన అంశం సౌర వ్యవస్థ, ఆస్ట్రోఫిజిక్స్ అధ్యయనం. సౌర వ్యవస్థ యొక్క ఏర్పడినపుడు దానికి అవసరమైన శక్తికి ప్రధాన వనరు, 26Al న్యూక్లైడ్ అర్ధ జీవితం అని తన బృందంతో కలిసి నిరూపించాడు. ఈయన కాస్మిక్ కిరణాలపైన, టెక్టోనిక్ ఫలకాల పైనా కూడా పనిచేసి అనేక సిద్ధాంతాలను వెలువరించాడు. ఫిజికల్ రీసెర్చి లాబొరేటరీలో పనిచేసేటపుడు, ఇస్రో తొలినాళ్లలో శాస్త్రీయ పరిశోధనల ప్రాజెక్టులో పనిచేసాడు. కాస్మిక్ రే ఎక్స్పెరిమెంట్ లో ఆయన అసోసియేట్ శాస్త్రవేత్త. అంతరిక్ష నౌక, స్పేస్‌ల్యాబ్ -3 లో చంద్రశిలల నమూనాలపై ముఖ్య శాస్త్రవేత్తగా పని చేసాడు.
మరిన్ని విశేషాలు
[మార్చు]జితేంద్రనాథ్ గోస్వామి చంద్రయాన్ -1 కు చీఫ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ డెవలపర్ గా పనిచేశాడు. గుజరాత్ లోని అహ్మదాబాదులో ఉన్న ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ డైరెక్టర్‌గా పనిచేశాడు. అతను చంద్రయాన్ -2, మంగళ్‌యాన్ లతో కూడా పనిచేశాడు.