Jump to content

జిమ్నాస్టిక్స్

వికీపీడియా నుండి
2007 పాన్ అమెరికన్ ఆటల పోటీలలో జిమ్నాస్టిక్స్ లో భాగమైన బాలెన్స్ బీం అంశాన్ని ప్రదర్శిస్తున్న దానియెల్ హైపొలితొ

జిమ్నాస్టిక్స్ వ్యాయామ సంబధిత ఒక రకమైన క్రీడ. ఇందులో బలం, వశ్యత, సమతుల్యత, చురుకుదనం, ఓర్పు, నియంత్రణ అవసరమైతాయి. ఈ క్రీడ ప్రాచీన గ్రీకులు తమ గుర్రాలను అధిరోహించడానికి, దిగడానికి చేసే వ్యాయామ విన్యాసాల నుండి అలాగే వారి సర్కస్ నైపుణ్యాల నుండి ఉద్భవించింది. ఒకరకంగా చెప్పాలంటే వారి ఆనాటి సాహసకృత్యాలే ఈ క్రీడకు ఆద్యంగా పేర్కొనవచ్చు.

జిమ్నాస్టిక్స్ లో చాలా క్రీడాంశాలు సమ్మిళితమై ఉంటాయి. వివిధ అంశాలలో పోటీలు కూడా జరుగుతాయి. ఈ పోటీలు అన్నిటిని ఆంతర్జాతీయ జిమ్నాస్టిక్ సమాఖ్య పర్యవేక్షిస్తుంటుంది. ప్రతి దేశం తన స్వంత జిమ్నాస్టిక్ పాలకమండలిని కలిగి ఉంటుంది. అయా పాలకమండళ్ళు ఆంతర్జాతీయ జిమ్నాస్టిక్ సమాఖ్యకు అనుసంధానమై దాని పర్యవేక్షణలో పనిచేస్తూ ఉంటాయి.పోటీ అంశాలలో ముఖ్యంగా చెప్పుకోదగినది కళాత్మక జిమ్నాస్టిక్స్. ఇందులో మహిళల కొరకు నిర్వహించే పోటీ అంశములో వాల్ట్,అన్‌ఈవెన్ బార్స్, బాలెన్స్ బీం, ఫ్లోర్ ఎక్సర్‌సైజు విభాగాలు ఉంటాయి. అలాగే పురుషుల కొరకు నిర్వహించే పోటీ అంశములో ఫ్లోర్ ఎక్సర్‌సైజు,పొమ్మెల్ హార్స్, స్టిల్ రింగ్స్, వాల్ట్, పారలెల్ బార్స్, హారిజాంటల్ బార్స్ విభాగాలు ఉంటాయి

ఆంతర్జాతీయ జిమ్నాస్టిక్ సమాఖ్య నిర్వహించే, గుర్తింపు పొందిన ఇతర జిమ్నాస్టిక్ అంశాలలో లయబద్దమైన (రిధమిక్) జిమ్నాస్టిక్స్,ట్రాంపోలైనింగ్, టంబ్లింగ్, ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ ఉన్నాయి.ఆంతర్జాతీయ జిమ్నాస్టిక్ సమాఖ్య గుర్తింపు పొందని అంశాలలో కళాసౌందర్యాత్మకమైన (ఏస్థటిక్) బృంద జిమ్నాస్టిక్స్, పురుషుల లయబద్దమైన (రిధమిక్) జిమ్నాస్టిక్స్, టీమ్‌జిమ్‌ అంశాలు ఉన్నాయి. ఈ పోటీలలో వివిధ అంశాలలో పాల్గొనేవారు ఆయా అంశాల నియమాల ఆధారంగా వివిధ వయస్సుల క్రీడాకారులు పాల్గొనవచ్చు. ఉదాహరణకు కిండర్‌జిం, చిన్నారుల జిమ్నాస్టిక్స్ అంశాలలో పాల్గొనే క్రీడాకారుల వయస్సు కనీసం 20 నెలలు ఉండవచ్చు. అలాగే మనోరంజన / కాలక్షేప (రిక్రియేషన్) జిమ్నాస్టిక్ పోటీలలో కనీసం 5 సంవత్సరాల వయస్సు గల క్రీడాకారులు పాల్గొనవచ్చు. వివిధ స్థాయు పోటీలలో పాల్గొనే క్రీడాకారుల నైపుణ్యం ఆయా స్థాయిని బట్టి ఉంటుంది. అత్యుత్తమ నైపుణ్యం ఉన్న క్రీడాకారులు ప్రపంచ స్థాయి పోటీలలో పాల్గొంటారు.

శబ్ధలక్షణము

[మార్చు]

జిమ్నాస్టిక్స్ అనే పదము గ్రీకు విశేషణము γυμνός (gymnos) జిమ్నోస్ నుండి ఉద్భవించింది. జిమ్నోస్ అనగా గ్రీకు భాషలో నగ్నత్వము అని అర్థము .[1].ఈ పదము యొక్క క్రియా విశేషణము γυμνάζω (జిమ్నాజో ) అనగా నగ్నముగా శిక్షణ ఇవ్వడము అనగా జిమ్నాస్టిక్ శిక్షణ ఇవ్వడము లేదా వ్యాయామ శిక్షణ ఇవ్వడము.[2].ఈ క్రియకు ఈ విధమైన అర్థము రావడానికి కారణము ప్రాచీనకాలములో క్రీడాకారులు వ్యాయామము చేయునపుడు, పోటీలలో పాల్గొనేటపుడు ఒంటిమీద నూలుపోగు కూడా ధరించేవారు కాదు. జిమ్నాస్టిక్స్ అను పదము 1570 లో లాటిన్ జిమ్నాస్టకస్ (gymnasticus) నుండి, గ్రీకు పదము జిమ్నాస్టికోస్ (gymnastikos ) (శారీరక వ్యాయామములో నైపుణ్యము సాధించుటకు ఇష్టపడుట) నుండి, జిమ్నాజిన్ (gymnazein) (వ్యాయామము చేయుట లేదా శిక్షణ పొందుట) (gymnasium వ్యాసమును చూడండి) నుండి ఉద్భవించింది.

చరిత్ర

[మార్చు]

జిమ్నాస్టిక్స్ మొదట ప్రాచీన గ్రీస్ దేశములో పుట్టింది. మొదట్లో ఇది యుద్ధం కోసం సిద్దమయ్యే సైనికుల శిక్షణ కోసం ఉద్దేశించబడింది. ఆధునిక జిమ్నాస్టిక్స్ పితామహులుగా జర్మనీకి చెందిన ఇద్దరు ప్రముఖ వ్యాయామ అధ్యాపకులు  – జొహాన్ ఫ్రెడెరిక్ గట్స్‌మత్స్ (1759–1839), ఫ్రెడెరిక్ లుడ్‌విగ్ జాన్ (1778–1852) – లను పేర్కొనవచ్చు.వీరు 18వ శతాబ్దపు చివరి దశకంలో, 19వ శతాబ్దపు ప్రారంభంలో కొన్ని వ్యాయామ పరికరాలను రూపొందించి వాటిని ఉపయోగించి బాలురు, యువకులు చేసేందుకు వీలుగా కొన్ని వ్యాయామాలకు రూపొందించారు. కాలక్రమేణా అవే వ్యాయామాలు జిమ్నాస్టిక్స్ గా రూపాంతరం చెందాయి.ఫ్రాన్స్ దేశంలో మొట్టమొదటిసారిగా విజ్ఞానాత్మకమైన జిమ్నాస్టిక్స్ ను పరిచయం చేసిన వ్యక్తిగా డాన్ ఫ్రాన్సిస్కో అమొరొసి ఒండియానొను చెప్పవచ్చును.డాన్ ఫ్రాన్సిస్కో అమొరొసి ఒండియానొ ఒక స్పానిష్ సైన్యాధిపతి. ఇతడు 1770 ఫిబ్రవరి 19 న వలెంసియాలో జన్మించాడు, 1848 ఆగస్టు 8 న పారిస్లో మరణించాడు.ఫ్రెడెరిక్ లుడ్‌విగ్ జాన్ జిమ్నాస్టిక్స్ లో పారలల్ బార్స్, రింగ్స్, హై బార్స్ ల వాడుకలను అంతర్జాతీయ జిమ్నాస్టిక్ పోటీలలో బాగా ప్రోత్సహించాడు.[3]

20వ శతాబ్దపు ప్రారంభంలో స్వీడన్ లోని స్టాక్‌హోమ్లో జిమ్నాస్టిక్స్ అభ్యస్తున్న ఒక బృందము

1881 లో అంతర్జాతీయ జిమ్నాస్టిక్ సమాఖ్య (FIG) ఏర్పడినది.[4] 19వ శతాబ్దపు చివరి నాటికి పురుషుల జిమ్నాస్టిక్ పోటీలు బాగా ప్రాచుర్యం పొందాయి. దీనితో 1896లో పురుషుల జిమ్నాస్టిక్స్ ఒలింపిక్ పోటీలలో ప్రవేశపెట్టబడింది. అప్పటినుండి 1950 వరకు జాతీయ, అంతర్జాతీయ పోటీలలో వివిధ రకములైన వ్యాయామములు ప్రదర్శించేవారు. వీటిలో జట్టు లయబద్దంగా నేలమీద ప్రదర్శించే కసరత్తులు (synchronized team floor calisthenics), త్రాడు ఎక్కుట, గెంతుట ( high jumping), పరుగు, సమాంతర నిచ్చెన (horizontal ladder) లాంటి వివిధ రకముల వ్యాయామ ప్రదర్శనలు ఉండేవి. 1920 నాటికి మహిళకు కూడా జిమ్నాస్టిక్ పోటీలను నిర్వహించడం, పాల్గొనడం చేసేవారు. 1928 లో జరిగిన ఆమ్‌స్టర్‌డామ్ ఒలింపిక్ పోటీలలో మొట్టమొదటిసారి మహిళలు కూడా పాల్గొన్నారు. కానీ వారికి కేవలం కొన్ని అంశాలు అనగా జట్టు లయబద్దంగా నేలమీద ప్రదర్శించే కసరత్తులు, ట్రాక్, ఫీల్డ్ పోటీలలో మాత్రమే పాల్గొనే అవకాశం దొరికింది.

1954 నాటికి ఒలింపిక్ పోటీలలో పురుషుల, మహిళల ఉపకరణాలు, ఆధునిక క్రీడా నియమాలు ప్రణాళీకరణ పూర్తిఅయినది. పోటీదారుల ప్రదర్శన ఆధారంగా వారికి గ్రేడులు (1 నుండి 15 వరకు పాయింట్లు) ఇచ్చే విధానం కూడా ప్రారంభించబడింది. ఇదే సమయంలో సోవియట్ దేశ క్రీడాకారులు తమ అత్యద్భుత ప్రదర్శనలతో, క్రమశిక్షణతో ప్రేక్షకులను దిగ్భ్రమ పరిచారు. వీరు తమ ప్రదర్శనతో జిమ్నాస్టిక్ పోటీలలో నూతన ఒరవడిని సృష్టించారు. జిమ్నాస్టిక్ పోటీల ప్రాచుర్యం పెంచే క్రమంలో టెలివిజన్ పాత్రను కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రీడ అత్యధిక ప్రేక్షకులకు చేరువ కావడానికి టెలివిజన్ దోహదపడినది.వర్తమానకాలంలో పురుషుల, మహిళల జిమ్నాస్టిక్ పోటీలు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోదగిన ఆసక్తిని కలిగిస్తున్నాయి. అత్యద్భుత జిమ్నాస్టిక్ క్రీడాకారులను నేడు మనం ప్రతి ఖండములోనూ చూడవచ్చును.

2006వ సంవత్సరంలో కళాత్మక జిమ్నాస్టిక్స్ (Artistic gymnastics) పోటీలలో విజేతలను నిర్ణయించుకొరకు నూతన పాయింట్ల వ్యవస్థ ప్రవేశపెట్టబడింది. ఇందులో భాగంగా A స్కోరు (లేదా D స్కోరు) అనునది అత్యధిక గణణ (స్కోరు), ఇదే విధానము 2009 నాటికి ఒక అభ్యాసంలో భాగంగా (వాల్ట్ మినహా) ఇవ్వబడే మొదటి 8 అధిక స్కోరింగ్ అంశాలుగా నిర్థారించబడింది. B స్కోర్ (లేదా E స్కోర్), అనునది అయా అభ్యాసములను క్రీడాకారులు ఎలా ప్రదర్శించారు అనే ఆధారంగా ఇవ్వబడుతుంది.[5]

ఆంతర్జాతీయ జిమ్నాస్టిక్ సమాఖ్య (FIG) చే గుర్తింపు పొందబడిన జిమ్నాస్టిక్ రీతులు (Forms)

[మార్చు]

కళాత్మక జిమ్నాస్టిక్స్

[మార్చు]

కళాత్మక జిమ్నాస్టిక్స్ సాధారణంగా పురుషుల, మహిళల జిమ్నాస్టిక్స్ గా విభజించబడింది. పురుషులు ఆరు విభాగాలలో పోటీ పడతారు. అవి : నేలమీద చేసే వ్యాయామాలు (Floor Exercise), పొమ్మెల్ హార్స్ (Pommel Horse), స్టిల్ రింగ్స్ (Still Rings), వాల్ట్, పారలల్ బార్స్, హారిజాంటల్ బార్. మహిళలు నాలుగు విభాగాలలో పోటీ పడతారు. అవి వాల్ట్, అన్‌ఈవెన్ బార్స్, బాలన్స్ బీమ్‌, నేలమీద చేసే వ్యాయామాలు (Floor Exercise). కొన్నిదేశాలలో మహిళలు ఒకే సమయంలో వివిధ అంశాలలో పోటీపడతారు అనగా ఉదాహరణకు రింగ్స్, హై బార్, పారలల్ బార్స్ (1950వ దశకలో USSR దేశంలో మాదిరిగా)

2016లో అంతర్జాతీయ జిమ్నాస్టిక్ సమాఖ్య (FIG ) కొత్త మూల్యాంకన విధానాన్ని ప్రవేశపెట్టినది. ఇందులో సాధించదగిన పాయింట్లు కేవలం 10 కాకుండా అంతకన్నా ఎక్కువకూడా ఉండవచ్చు అనే సవరణ ప్రవేశపెట్టబడింది. ఈ విధానము అమెరికా దేశంలో జరిగిన కొన్ని ఉన్నతస్థాయి పోటీలలో వాడబడింది.[5]. అంతకుముందు ఉన్న పాత పద్ధతిలో కాకుండా ఈ విధానములో రెండు వేరు వేరు స్కోర్లు ఇవ్వబడతాయి. ఒకటి జిమ్నాస్టిక్ అంశాన్ని ప్రదర్శించినందుకు ఇచ్చే స్కోరు కాగా మరొకటి కష్టతరమైన అంశాన్ని ఎంచుకొన్నందుకు ఉద్దేశించిన స్కోరు. ఇంతకు ముందున్న విధానములో కేవలము జిమ్నాస్టిక్ అంశాన్ని ప్రదర్శించినందుకు ఇచ్చే స్కోరు మాత్రమే ఉండేది. ఈ విధానములో ఒక క్రీడాకారుడికి ఇచ్చే పాయింట్లు గరిష్ఠంగా 10 వరకు ఉండవచ్చు. ఇందుకు చిన్న చిన్న వ్యాయామ అంశాలు మినహాయించబడ్డాయి. జిమ్నాస్టిక్ క్రీడాకారుడు విన్యాసాలను ప్రదర్శించు సమయమున అతడి ప్రదర్శనలో ఏదైనా తప్పు దొర్లినపుడు న్యాయ నిర్ణేత ఈ స్కోరులో నుండి కొన్ని పాయింట్లని తగ్గించేవాడు. ఉదాహరణకు ఉన్నత స్థాయిలో జరిగే పోటీలలో జిమ్నాస్ట్ ( జిమ్నాస్టిక్ క్రీడాకారుడు) పొరపాటున క్రిందపడిపోయినచో ఒక పాయింటు కోతవిధించేవారు. కొత్త విధానములో క్రీడాకారుడు ఎంచుకున్న కష్టమైన అంశానికి రెండవ స్కోరు ప్రవేశపెట్టడము అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఈ విధానములో జిమ్నాస్ట్ ఎంచుకొన్న కష్టతరమైన అంశాలకు గాను అతడు ఎంచుకున్న అన్ని అంశాలను ప్రదర్శించాడా లేదా, ఒక అంశం తర్వాత ప్రదర్శించవలసిన తర్వాత అంశానికి ఏవిధముగా సమంవయం అయ్యాడన్న దానిని బట్టి ఈ రెండవ స్కోరు ఇవ్వబడుతుంది. ఈ స్కోరు ఉండటం వలన జిమ్నాస్ట్ అన్ని నైపుణ్యాలను సాధించి దానిని ప్రదర్శించే అవకాశము ఉంది. ఈ విధానము లేనపుడు ఎక్కువమంది జిమ్నాస్ట్‌లు కష్టతరమైన అంశాలను ప్రదర్శించడానికి వెనుకాడేవారు. ఒకదానికొకటి కనెక్ట్ అవ్వవలసిన అంశాల విషయములో ఈ స్కోర్లు మారవచ్చు. ఎందుకనగా అనేక అంశాలను ప్రదర్శించేటపుడు వాటిని సమన్వయం చేసుకోవడం కొంచెం కష్టంతో కూడుకున్ పని. మొదటి అంశాన్ని సరిగా ప్రదర్శించనపుడు రెండవ అంశానికి వెళ్ళడము చాలా కష్టమైనది. ఈ నూతన విధానము జిమ్నాస్ట్‌లు వారు ఎంచుకున్న కష్టతరమైన అంశాలను బట్టి, వారు వాటిని ఏవిధముగా ప్రదర్శించారు అనే అంశంపై ఆధారపడి వారు ఎక్కువ స్కోరు సాధించడానికి తోడ్పడుతుంది. రెండవ స్కోరుకు గరిష్ఠ పరిధి లేదు. జిమ్నాస్ట్ ఎంచుకున్న కఠినతర అంశం, వాటిని ప్రదర్శించే నైపుణ్యం ఆధారంగా ఈ స్కోరు మారుతుంది.

మహిళల కళాత్మక ప్రదర్శనలు (ఆర్టిస్టిక్ ఈవెంట్స్)

[మార్చు]
పైక్డ్ సుకహార వాల్ట్.
వాల్ట్
[మార్చు]

ఆక్రో డాన్స్ లో భాగంగా ఫ్రంట్ హాండ్‌స్ప్రింగ్ భంగిమను ప్రదర్శిస్తున్న జిమ్నాస్ట్.

వాల్ట్ విభాగపు పోటీలలో రెండు దశలు ఉంటాయి. ఇవి గాలిలోకి ఎగరడానికి ముందు, తర్వాతి దశలు. ఇందులో జిమ్నాస్ట్‌లు 25 మీటర్లు (82 అ.) నిడివిగల రన్‌వే మీదనుండి పరిగెత్తుతూ వచ్చి, ఒక స్ర్పింగ్ బోర్డు మీద నుండి దూకటంగానీ లేదా దానిమీద చేతులతో అదిమి గాని, గాలిలోకి లేచి సవ్యదిశలోగాని లేక అపసవ్య దిశలోగాని గాలిలో గింగిరాలు తిరుగుతూ రెండు కాళ్ళ ఆధారంగా నేలమీదికి దిగుతారు. ప్రతి ఒక్క జిమ్నాస్ట్ వారి ఎత్తు, బలమును బట్టి రన్‌వే మీద నిర్థిస్ఠ స్థానమునుండి తమ పరుగును ప్రారంభిస్తారు. గాలిలో ఎగిరిన తర్వాత ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు సల్టోలు (ఒక రకమైన పల్టీలు), సోమర్‌సాల్ట్‌లు (తల క్రిందికు, పాదాలు పైకి చేస్తూ చేసే పల్టీ), శరీరాన్ని మెలితిప్పి చేసే పల్టీలు ఉంటాయి. ఉన్నత స్థాయి పోటీలలో యుర్‌చెన్‌కొ అనే పల్టీలు కొట్టడానికి అనువుగా ఉండే వాల్ట్ ఉంటుంది. ఈ యుర్‌చెన్‌కొ వాల్ట్ ఉపయోగించేటపుడు మొదట జిమ్నాస్ట్ అరిచేతులు రన్‌వే పై ఉంచి తర్వాత వారి అరికాళ్ళు స్ర్పింగ్‌బోర్డ్ మీద ఉంచుతారు (రౌండ్ ఆఫ్ భంగిమ). తర్వత అదే భంగిమలో వ్రతిరేక దిశలో కదిలి చేతుల ఆధారంగా వెనుక వైపు పల్టీ కొట్టి హాండ్‌స్ర్పింగ్ (back handspring) తమ అరిచేతులు వాల్టింగ్ బల్లపై అన్చుతారు. తర్వాత వాల్టింగ్ బల్లపై కొద్దిసేపు వివిధ రకములైన శరీరాన్ని మెలితిప్పే భంగిమలు (twisting), /లేదా సోమర్‌సాల్టింగ్ ప్రదర్శనలు చేస్తారు. అలా కొద్ది సేపు తమ కళలను ప్రదర్శించిన తర్వాత చివరగా తమ గాలిలోకి ఎగిరి తమ అరికాళ్ళను నేలపై ఆన్చి తమ ప్రదర్శను ముగిస్తారు. దిగువ స్థాయి పోటీలలో, ఈ చివరి దశను ప్రదర్శించరు. ఈ దిగువ స్థాయి పోటీలలో పాల్గొనే జిమ్నాస్ట్‌లు స్ర్పింగ్‌బోర్డ్ మీదకు రెండు అరికాళ్ళు ఒకే సారి ఆన్చే విధముగా దుమికి వాల్ట్ పై రౌండ్ ఆఫ్ భంగిమనుగాని లేదా చేతుల ఆధారంగా ముందుకు పల్టీలు కొట్టే భంగిమను కానీ ప్రదర్శిస్తారు

2001 సంవత్సరం నుండి సంప్రదాయక వాల్ట్ హార్స్ విభాగమును కొత్త ఉపకరణములతో భర్తీ చేశారు. దీనినే టంఘ్, హార్స్ లేదా వాల్టింగ్ టేబిల్ గా వ్యవహరిస్తున్నారు. మునుపటి వాల్ట్ హార్స్ తో పోలిస్తే ఈ సరికొత్త ఉపకరణములు సుస్థిరమైనవి, పాతవాటి కన్నా దాదాపు 1 మీటరు పొడవైనవి, 1 మీటరు వెడల్పైనవి. ఇవి జిమ్నాస్ట్‌లకు తమ నైపుణ్యములను ప్రదర్శించుటకు మునుపటి కన్నా ఎక్కువ స్థలమును అందుబాటులోనికి తెస్తాయి. అంతేకాకుండా ఇవి గతంలో వాడిన వాల్ట్ హార్స్ కన్నా ఎక్కువ సురక్షితమైనవి. ఈ సౌలభ్యం వలన జిమ్నాస్ట్‌లు ఎలాంటి జానికి లేకుండా మునుపటి కన్నా కఠినమైన, కష్టతరమైన అంశాలను ప్రదర్శించుటకు ముందుకు వస్తున్నారు. ఇది శుభపరిణామము.[6]

వాల్ట్ విభాగం ఎలా ఉంటుందో 2012 ఒలింపిక్స్ పోటీలలో మహిళల వాల్ట్ పోటీలు వీడియో చూసి తెలుసుకోవచ్చు.

యుర్‌చెన్‌కొ వాల్ట్ పై రౌండ్ ఆఫ్ భంగిమను అభ్యసిస్తున్న జిమ్నాస్ట్
అన్ ఈవెన్ బార్స్
[మార్చు]

అన్‌ఈవెన్ బార్స్ పై విన్యాసము ప్రదర్శిస్తున్న జిమ్నాస్ట్

అన్ ఈవెన్ బార్స్ అంశమును ప్రదర్శించునపుడు జిమ్నాస్ట్ మొదట నేలపై సమాంతరంగా, వేరు వేరు ఎత్తులలో బిగించబడిన రెండు కమ్మీలను ఆధారంగా చేసుకొని పలు భంగిమలను ప్రదర్శిస్తారు. ఈ కమ్మీలు ఫైబర్ గ్లాస్‌తో తయారుచేయబడి చెక్కతొడుగులతో కప్పబడి ఉంటాయి. ఈ విధముగా ఉండటం వలన వీటిపై విన్యాసములు చేయునపుడు ఇవి విరిగిపోకుండా జిమ్నాస్టుకు రక్షణనిస్తాయి. గతంలో ఉన్న కమ్మీలు చెక్కతో చేయబడటం వలన విరిగిపోవడానికి ఆస్కారం ఉండేది. దీనివలన జిమ్నాస్టులకు సరైన రక్షణ ఉండేది కాదు. మారుతున్న సాంకేతికతను ఉపయోగించుకొని ఈ కమ్మీలను దృఢముగా తయారుచేయడం జరిగింది. జిమ్నాస్టుల ఎత్తు, శరీర నిర్మాణానికి అనుగుణముగా ఈ కమ్మీల ఎత్తును, వెడల్పును పెంచడంగాని లేదా తగ్గించడంగాని చేయవచ్చును. గతంలో ఈ కమ్మీల మధ్య దూరం చాలా తక్కువగా ఉండేది. ప్రస్తుతము దీనిని సరిచేసి జిమ్నాస్టులు ఊగుతూ చేయు విన్యాసములు, గుండ్రముగా తిరుగుతూ చేసే విన్యాసాలు,పరివర్తనీయ విన్యాసాల వంటివి చేయడానికి అనువుగా వీటి మధ్య దూరాన్ని సవరించారు. ఉన్నత స్థాయి పోటీలలో ఈ విన్యాసాలలో రెండు చేతులపై భారంవేసి చేసే హాండ్‌స్టాండ్ విన్యాసం తప్పనిసరిగా చేయాలి. జిమ్నాస్ట్‌లు సాధారణంగా ఈ కమ్మీలను అధిరోహించడానికి స్ర్పింగుబోర్డు లేదా ఒక చిన్న చాపను ఉపయోగిస్తారు. జిమ్నాస్ట్‌లు ఈ పోటీలలో పాల్గొనునపుడు తోలుతో చేయబడిన ఒక ప్రత్యేకమైన చేతి తొడుగులను ధరిస్తారు. ఇందులో వేళ్ళు దూర్చుటకు రంధ్రములు చేయబడి విన్యాసాలు చేయునపుడు జిమ్నాస్టులకు సరైన పట్టు దొరికేలా ఇవి ఉపకరిస్తాయి. జిమ్నాస్టులు తమ చేతులకు సరైన పట్టు లభించుటకు, చేతిలో ఏర్పడే చెమటవలన పట్టు జారిపోకుండా ఉండుటకు ఈ తొడుగులతో బాటుగా సుద్దపొడిని కూడా చేతులకు రాసుకుంటారు. దీనివలన చేతిలోని సున్నితమైన చర్మముకూడా చీరుకుపోకుండా రక్షణ లభిస్తుంది. ప్రత్యేకముగా తయారుచేయబడిన డోవెల్ గ్రిప్స్ అనబడే చేతి తొడుగులు కూడా జిమ్నాస్టులకు కమ్మీలపై దృఢమైన పట్టును దొరకబుచ్చుకోవడానికి తోడ్పడుతాయి.

బాలెన్స్ బీమ్
[మార్చు]
2013 లో బాలెన్స్‌ బీమ్‌ విన్యాసములో భాగంగా ఒక చేతితో నొక్కిపెట్టే విన్యాసాన్ని ప్రదర్శిస్తున్న జిమ్నాస్ట్ దొరినా బొక్జొకొ.

బాలెన్స్ బీమ్‌లో భాగంగా జిమ్నాస్ట్ 90 సెకెండ్ల పాటు నృత్యరీతులతో కూడిన విన్యాసాలను ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనలో భాగంగా గెంతులు, అక్రోబాటిక్ విద్యలు, సోమర్‌సాల్ట్‌లు, తిరుగుట, నృత్యములు ఒక కమ్మీ మీద ప్రదర్శిస్తారు. ఈ కమ్మీ నేల నుండి 125 సెంటీమీటర్లు (4 అ. 1 అం.) ఎత్తులో ఉంటూ 500 సెంటీమీటర్లు (16 అ. 5 అం.) పొడవు, 10 సెంటీమీటర్లు (3.9 అం.) వెడల్పు ఉంటుంది.[7]. ఈ కమ్మీ పొడవు, వెడల్పు, ఎత్తులను సరిచేసుకొనే ఏర్పాటు ఉంటుంది. ఈ విన్యాసములో ముఖ్యంగా క్రీడాకారుడు సమతూకము, సారళ్యము (ఫ్లెక్సిబిలిటి), శక్తిని కలిగిఉండి ఏకాగ్రతతో తమ విద్యను ప్రదర్శించవలసి ఉంటుంది.

ఫ్లోర్
[మార్చు]
ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా స్టాగ్ లీప్ విన్యాసాన్ని ప్రదర్శిస్తున్న జిమ్నాస్ట్.

మొదట్లో ఫ్లోర్ విన్యాసాలను నేలమీద కానీ లేదా నేలమీద పరిచిన చాపలమీద కానీ ప్రదర్శించడం జరిగేది. కానీ ఆధునిక కాలంలో ఈ విద్యను 12 మీటర్లు పొడవు వెడల్పు గల చతురస్రాకారంలోని ఒక గట్టి ఉపరితలంపై నిర్వహిస్తున్నారు. ఈ ఉపరితలం క్రింద స్రింగులు లేదా ఫోం బ్లాక్స్ ల సహాయంతో అమర్చబడిన ప్లైవుడ్ ఉంటుంది. ఈ మొత్తం వేదికను స్ర్పింగ్ ఫ్లోర్ అంటారు. ఈ స్ర్పింగ్ ఫ్లోర్ దృఢముగా ఉండి జిమ్నాస్టులు విన్యాసాలలో భాగంగా పైకి ఎగరడానికి గట్టిగా అదిమినపుడు వీరు మరింత ఎత్తుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. అలాగే గాలిలో పల్టీలు కొట్టి కిందికి దిగునపుడు వారు గాయాల పాలు అవకుండా దీని మెత్తటి ఉపరితలం వారికి రక్షణగా నిలుస్తుంది. జిమ్నాస్టులు ఈ ఫ్లోర్ విన్యాసాలలో భాగంగా 90 సెకెండ్లపాటు తమ విద్యలను ఈ ఫ్లోర్ పై ప్రదర్శిస్తారు. పోటీ స్థాయిని బట్టి జిమ్నాస్టులు ఫ్లోర్ విన్యాసాలను ప్రదర్శించవచ్చో లేదో నిర్ణయించుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు ఫ్లోర్ విన్యాసాలు తప్పనిసరి జిమ్నాస్టిక్స్ విభాగంలో ఉన్నపుడు జిమ్నాస్టులు దీనిని తప్పనిసరిగా ప్రదర్శించాలి. ఫ్లోర్ పై జిమ్నాస్టులు విన్యాసాలు చేయునపుడు నేపథ్యములో సంగీతం వినిపించడం తప్పనిసరి. 3 నుండి 6 స్థాయిల వరకు అయా స్థాయిలలోని ప్రదర్శనలతో పాటు ఈ సంగీతం కూడా ఒకేలా ఉంటుంది. కానీ ఉన్నత స్థాయిలుగా పేర్కొనబడే 7 నుండి 10 స్థాయిలలో జిమ్నాస్టులు మరిన్ని కఠినతరమైన ప్రదర్శనలు చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా వీరికి తమకు నచ్చిన ఎలాంటి పదములు లేని నేపథ్య సంగీతమును ఎంచుకొనే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ ప్రదర్శనలలో టంబ్లింగ్ టైల్స్, వరుసగా గాలిలోకి పల్టీలు కొట్టడం, గెంతడం, నృత్య ప్రదర్శనలు, అక్రోబాటిక్ నైపుణ్యములు మరయు ఒంటికాలిపై గిర గిరా తిరుగుట లాంటివి ఉంటాయి. పోటీలలో పాల్గొను జిమ్నాస్టులు నాలుగు టంబ్లింగ్ లైన్స్ వరకూ ప్రదర్శించవచ్చు. ఇందులో చేతుల ఆధారం తీసుకోకుండా కనీసం ఒక పోరాట భంగిమను అయినా ప్రదర్శించవలెను. వివిధ స్థాయిలలో జిమ్నాస్టులు ప్రదర్శించే టంబ్లింగ్ లైన్స్ సంఖ్య మారుతూ ఉంటుంది. అమెరికా దేశంలో జరిగె 7 వ స్థాయి పోటీలలో పాల్గొను జిమ్నాస్టులు కనీసం 2 నుండి 3 టంబ్లింగ్ లైన్స్ ప్రదర్శించవలసి ఉంటుంది. అలాగే 8 నుండి 10 స్థాయిల వరకు కనీసం 3 నుండి 4 వరకు టంబ్లింగ్ లైన్స్ ప్రదర్శించవలసి ఉంటుంది.[8]

పురుషుల కళాత్మక ప్రదర్శనలు (ఆర్టిస్టిక్ ఈవెంట్స్)

[మార్చు]
ఫ్లోర్
[మార్చు]

పురుషుల జిమ్నాస్టిక్ ఫ్లోర్ పోటీలలో జిమ్నాస్టులు 12 మీటర్లు పొడవు వెడల్పు గల స్ర్పింగ్ ఫ్లోర్ పై తమ విన్యాసాలను ప్రదర్శిస్తారు. ఇందులో భాగంగా వరుసబెట్టి టంబ్లింగ్ పాసెస్ ను ప్రదర్శిస్తారు. ఇది వీరి శక్తి, సమతూకం, సరళత్వం (flexibility) ని అంచనా వేయుటకు ఉపయోగపడుతుంది. శక్తిని ఉపయోగించి చేసే విన్యాసాలలో భాగంగా గుండ్రంగా తిరిగే విన్యాసాలు (circles), సమతూకం పాటించే విన్యాసాలు (scales), చేతితో నొక్కి చేసే విన్యాసాలు (press handstands) ఉంటాయి. పురుషుల ఫ్లోర్ విన్యాసాలలో 60 నుండి 70 సెకెండ్ల వరకు సాగే వివిధ విన్యాసాలు ఉంటాయి. స్త్రీల పోటీలకు విరుద్దంగా వీరి విన్యాసాలకు నేపథ్య సంగీతం వినిపించడం ఉండదు. పురుష జిమ్నాస్టులు తమ ఫ్లోర్ విన్యాసాలను ప్రదర్శించునపుడు ఫ్లోర్ యొక్క ప్రతి మూలను కనీసం ఒక్కసారి అయినా తాకవలెననే తప్పనిసరి నిబంధన ఉంది.

పొమ్మెల్ హార్స్ విన్యాసాన్ని ప్రదర్శిస్తున్న క్రిస్ కామెరాన్
పొమ్మెల్ హార్స్
[మార్చు]

సాధారణంగా పొమ్మెక్ హార్స్ ప్రదర్శనలో ఒక కాలు, రెండు కాళ్ళతో చేసే విన్యాసాలు ఉంటాయి. ఒక కాలితో చేసే విన్యాసాలలో కత్తెర వలె కాలు తిప్పడం (scissors) అనే అంశం సర్వసాధారణంగా ఉంటుంది. కానీ రెండు కాళ్ళతో చేసే విన్యాసాలు పొమ్మెల్ హార్స్ అంశంలో అతి ముఖ్యమైనవి. ఇందులో భాగంగా జిమ్నాస్టులు తమ రెండు కాళ్ళను సవ్య, అపసవ్య దిశలలో వృత్తాకారంలో తిప్పుతూ పొమ్మెల్ హార్స్ ఉపకరణంపై దాదాపు అన్ని భాగాలపై వీటిని ప్రదర్శిస్తారు. వీటిని మరింత ప్రత్యేకంగా చూపుటకై జిమ్నాస్టులు ఈ విన్యాసాలలో వేరు వేరు రూపాంతరములు (variations ) చూపిస్తారు. ఇందులో తమ కాళ్ళను వివిధ ఆకారాలలో వేగంగా తిప్పడం, తల క్రిందులుగా నిలిచి కాళ్ళను వేగంగా ఆడించి ఈ ప్రదర్శనకు తమదైన విలక్షణతను జోడించే ప్రయత్నం చేస్తారు. చివరికి ముగింపుకు వచ్చేసరికి జిమ్నాస్టులు ఈ పొమ్మెక్ హార్స్ ఉపకరణంపై నుండి క్రిందికి దిగడం గానీ లేదా తమ శరీరాన్ని ఉపకరణంపై వేగంగా కదిలించడం ద్వారా కానీ లేదా చేతితో ఉపకరణాన్ని పట్టుకొని ఒక చివరి రూపాంతరమును ప్రదర్శించడం ద్వారా కానీ ఈ ప్రదర్శనను ముగిస్తారు.

స్టిల్ రింగ్స్
[మార్చు]

స్టిల్ రింగ్స్ అనునవి నేల నుండి 5.75 మీటర్ల ఎత్తులో రెండు తీగలలు అమర్చబడిన రెండు వలయాలు. ఈ ప్రదర్శన చేస్తున్న జిమ్నాస్టులు నియమిత చర్యగా సమతూకాన్ని, శక్తి సామర్థ్యాలను, చలనములో తమ శరీరాన్ని నియంత్రించుకోవడం వంటి విన్యాసాలను ప్రదర్శించడం చేయాలి. ఈ ప్రదర్శనలో కనీసం ఒక నిశ్చలమైన కదలిక (static strength move) తప్పనిసరిగా చేయాలి. కానీ చాలామంది జిమ్నాస్టులు ఒకటి కంటే ఎక్కువగా ఈ నిశ్చల కదలిక విన్యాసమును ప్రదర్శిస్తారు. ముగింపునకు గుర్తుగా జిమ్నాస్టు ఈ రింగులను వదిలివేసి గాలిలో గింగిరాలు తిరుగుతా నేలమీదికి వాలుతాడు.

వాల్ట్
[మార్చు]

వాల్ట్ ప్రదర్శనలో భాగంగా జిమ్నాస్టులు గరిష్ఠంగా 25 మీటర్ల నిడివి ఉన్న ఒక ధావన పధము (runway) నుండి పరుగు ప్రారంభించి ఒక స్ర్పింగు బోర్డుమీద కాలు మోపుతారు. ధావన పధములో ఎక్కడునుండి తమ పరుగు ప్రారంభించవలెనో ఎంచుకొనే సౌలభ్యము జిమ్నాస్టులకు ఇవ్వబడింది. ఈ క్రమంలో తమ శరీర భంగిమను సమతుల్యం చేసుకొని వాల్టింగ్ వేదికపై భుజముల ఆసరాతో పంచ్ చేస్తారు.తర్వాత గాలిలో నిలబడిన భంగిమను ప్రదర్శిస్తారు. మరింత కఠినతరమైన జిమ్నాస్టిక్స్ లో జిమ్నాస్టులు గాలిలో ఎగిరిన తర్వాత గింగిరాలు తిరుగుతూ, సోమర్‌సాల్ట్ భంగిమలు ప్రదర్శిస్తూ నేలమీదికి వాలుతారు. ఈ ప్రదర్శనను విజయవంతం చేయడంలో అనేక అంశాలు దోహదం చేస్తాయి. అందులో జిమ్నాస్టు పరుగు వేగం, వాల్ట్ పరికరం (hurdle) యొక్క పొడవు, జిమ్నాస్ట్ తన కాళ్ళు, భుజాలనుండి ఉత్పన్నం చేయగలిగిన శక్తి, గాలి గతి యొక్క అంచనా, నేలమీదకు దిగే సమయంలో అదనపు విన్యాసాలు చేయునపుడు గాలిలో వీరు ఎంతవేగంతో గింగిరాలు కొడుతున్నారు అనే అంశాలన్నీ నిర్ణయిస్తాయి.[9]

పారలల్ బార్స్
[మార్చు]

పురుష జిమ్నాస్టులు ఒకదానికొకటి సమాంతరంగా అమర్చబడిన రెండు కమ్మీల ఆధారంగా పలు విన్యాసాలను ప్రదర్శిస్తారు. ఈ కమ్మీలను పారలర్ బార్స్ అంటారు. ఈ విన్యాసాలలో భాగంగా కమ్మీల సహాయంతా గాలిలో ఊగడము, సమతూకం పాటించడం, శరీరం, మెదడు సమన్వయంతో పలు విన్యాసాలు ప్రదర్శిస్తారు. రెండు కమ్మీలమధ్య దూరాన్ని జిమ్నాస్టులు చేయబోయే విన్యాసాల ఆధారంగా అమర్చుకోవచ్చు. ఈ కమ్మీలు సాధారణంగా 2మీటర్ల ఎత్తులో ఉంటాయి.[10]

హారిజాంటల్ బార్
[మార్చు]

నేలపై నుండి 2.5 మీటర్ల ఎగువన అమర్చబడిన 2.8 సెంటీమీటర్ల మందము గల ఒక ఫైబర్ కడ్డీని ఆధారంగా చేసుకొని జిమ్నాస్టులు పలు విన్యాసములు చేయవలసి ఉంటుంది. దీనిని పట్టుకొని ఊయల ఊగడము, కడ్డీ చుట్టూ గిరగిరా తిరగడము, మెలికలు తిరగడము, దిశలు మార్చుకుంటూ తిరగడము, కళాత్మకంగా నేలపై వాలడము లాంటి విన్యాసములు జిమ్నాస్టులు ప్రదర్శిస్తారు.తమ గమనాన్ని మార్చుకొంటూ ఒక ప్రత్యేక దిశలో తమ బలాన్నంతటినీ కేంద్రీకృతం చేయడం ద్వారా తమకు కావలసిన ఎత్తుకు ఎగరడానికి వీరు ప్రయత్నిస్తారు. ఇది ట్రిపుల్-బ్యాక్-సాల్టో లాంటి విన్యాసములు చేయునపుడు వీరికి మిక్కిలి సహాయకారిగా ఉంటుంది. లెదర్ గ్రిప్స్ విన్యాసాలు చేయుటకు వీరికి సాధారణంగా తమ పట్టును కడ్డీపై సడలకుండా చూసుకోవలసి ఉంటుంది.

మహిళా జిమ్నాస్టులకు ఏవిధంగా వర్తిస్తుందో అలాగే పురుష జిమ్నాస్టులు కూడా తమ ప్రదర్శనలను వారు ఏవిధంగా ప్రదర్శించారు, వారి ప్రదర్శనలో ఎటువంటి కఠినమైన విన్యాసాలను ప్రదర్శించారు, మొత్తం మీద ఎటువంటి నైపుణ్యాలను ప్రదర్శించారు అన్న అంశాల ఆధారంగా న్యాయ నిర్ణేతలు బేరీజు వేస్తారు.

పరిగణన (స్కోరింగ్ (code of points))

[మార్చు]

జిమ్నాస్టు ఒక పోటీలో విజయం సాధించవలెనంటే అతని/ఆమె యొక్క స్కోరింగ్ పై ఆధారపడి ఉంటుంది. ఈ స్కోరింగ్ అనునది ఆయా జిమ్నాస్ట్ ప్రదర్శించే విన్యాసాల ఆధారంగా న్యాయ నిర్ణేతలు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కోరింగ్ అనునది జిమ్నాస్ట్ యొక్క ప్రధమ విలువ (start value) నుండి కొన్ని తీసివేతల తర్వాత వచ్చిన పాయింట్లు. ప్రధమ విలువ (start value) అనునది జిమ్నాస్ట్ ఎంచుకొనే విన్యాసాల పై, ఆ విన్యాసాలను జిమ్నాస్ట్ ఏవిధంగా ప్రదర్శించాడు, అందులోని సంక్లిష్టత మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. విన్యాసాల కూర్పు ప్రతి ఉపకరణం కోసం భిన్నంగా ఉంటాయి. ఈ స్కోరును 'డి స్కోర్ ' (D score) గా వ్యవహరిస్తారు. [11]ప్రదర్శనలు, నృత్యాలు జరుగు సమయాన జిమ్నాస్టుల ప్రదర్శన ఆధారంగా వారి స్కోరింగ్ నిర్ణయించడానికి గరిష్టంగా 10.0 పాయింట్లతో ప్రారంభించి వారి తప్పులకు, ప్రదర్శనలో వారు చేసే పొరపాట్లకు గాను ఇందులో నుండి కొన్ని పాయింట్లను తీసివేస్తూ వస్తారు. ఈ స్కోరును 'ఈ స్కోరు ' (E score) గా వ్యవహరిస్తారు.[12] తుది స్కోరును E స్కోరు నుండి కొన్ని తీసివేతల తర్వాత వచ్చిన స్కోరుకు D స్కోరును కలపడం ద్వారా వచ్చిన స్కోరును జిమ్నాస్ట్ యొక్క తుది స్కోరుగా నిర్ణయిస్తారు.[13]

2007 సంవత్సరం నుండి ఈ స్కోరింగ్ విధానంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. బోనస్, ప్రదర్శన పాయింట్లను కలిపి వచ్చిన స్కోరును తుది స్కోరుగా పరిగణిస్తున్నారు.

దిగడము (లాండింగ్)
[మార్చు]

టంబ్లింగ్ పాస్, డిస్‌మౌంట్ లేదా వాల్ట్ విభాగాలలో మొదట టేకాఫ్, ఫ్లైట్ తర్వాత చివరగా నేలమీదకు దిగడము (లాండింగ్) ఉంటుంది.[14]. దిగడము అనునది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఇది క్రీడాకారుడి నైపుణ్యమునకు, అతడి ప్రదర్శన మూల్యాంకనకు అత్యంత ప్రధానమైనది. సరిగ్గా ప్రదర్శించని ఎడల ఈ ప్రక్రియలో క్రీడాకారులు గాయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.ఈ గాయాలు సాధారణంగా శరీర దిగువ అంచులైన మృదులాస్థి, కీళ్ళ సంధులు, ఎముకలలో పగుళ్ళు లాంటివి.[15] క్రీడాకారులు ఇలాంటి గాయాలబారిన పడకుండా అత్యున్నత స్కోరును సాధించవలెనంటే ప్రదర్శన సమయంలో క్రీడాకారులు అత్యున్నత నైపుణ్యతతో తమ అంశాలను ప్రదర్శించవలసి ఉంటుంది. ప్రదర్శనలో చివరి భాగమైన లాండింగ్ దశను సురక్షితంగా రెండు పాదాలు ఒకే సమయంలో భూమిని తాకించడం ద్వారా సాధించవచ్చు.[16] జిమ్నాస్టిక్స్ లో విజయవంతమైన ల్యాండింగ్ ఒక సున్నిత ప్రక్రియగా చెప్పబడినది. దీని అర్థం మోకాలి, హిప్ జాయింట్లు 63 డిగ్రీలు కంటే ఎక్కువగా వంచబడి నేలమీదికి దిగడము.[14]


ఎక్కువ సమయం చేసే ప్రదర్శనలో క్రీడాకారుడు నేలమీదికి దిగేటపుడు అధిక క్షితిజ లంబ ప్రతికూల బలం అవసరమవుతుంది( vertical ground reaction force). ఈ ప్రతికూల బలాన్ని క్రీడాకారుడు అధిగమించవలసి ఉంటుంది. ఇందుకు క్రీడాకారుడికి తగినంత కండర బలం అవసరమవుతుంది. ఇది క్రీడాకారుడి దీర్ఘ, కోణీయ వేగాన్ని ప్రభావితం చేస్తుంది. ఇదే కాకుండా నేలమీదికి దిగడానికి తీసుకొనే సమయం కూడా క్రీడాకారుడి దీర్ఘ, కోణీయ వేగాన్ని ప్రభావితం చేసే అంశాలలో ఒకటి. ఈ ప్రభావం నుండి బయటికి రావడానికి క్రీడాకారుడికి ఉన్న అవకాశం ఏమనగా నేల మీదికి దిగడానికి తీసుకొనే సమయాన్ని పెంచుకోవడం. ఈ ప్రక్రియను సాధన ద్వారా జిమ్నాస్టిక్ క్రీడాకారులు మెరుగు పరుచుకోవచ్చు. తమ తుంటి భాగము, మోకాలు, చీలమండ ల మధ్య అంతరాన్ని తమకు వీలైనంత ఎక్కువగా పెంచడము ద్వారా ఈ ప్రక్రియ పై పట్టు సాధించవచ్చు.[14]

టంబ్లింగ్ పాస్, అవరోహణం లేదా వాల్ట్ అంశాలలో విన్యాసాలను ముగించి నేలమీదకు వాలే అంశము తుది అంకము. ఇందులో జిమ్నాస్టు తన విన్యాసాలను ప్రదర్శించి దానిని క్రమబద్దముగా ముగించి ఒక లయలో గాలిలో నుండి పల్టీలు కొడుతూ నేలమీద వాలతాడు.[14]. ప్రదర్శనను విజయవంతంగా ముగించి మంచి స్కోరు సాధించడంలో ఈ చివరి ప్రక్రియ మికీలి కీలకమైనది. ఇందులో ఏమాత్రం అజాగ్రత్త వహించినా అది ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనితో పాటు జిమ్నాస్ట్ తీవ్రగాయాల పాలై కొన్ని సార్లు ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చు. జిమ్నాస్టు సరైన పరిణామంలో శక్తిని విడుదల చేయకుండా జాప్యము చేయునపుడు సోమర్‌సాల్ట్ అంశంలో తీవ్ర గాయాలు పాలవ్వడానికి అవకాశాలు ఉంటాయి.ఈ గాయాలు సాధారణంగా దిగువ అంత్య భాగాల వద్ద సంభవిస్తాయి. ఉదాహరణకు : మృదులాస్థి గాయాలు, స్నాయువు వద్ద బెణకడం, ఎముకలకు గాయాలు / పగుళ్లు.[17] ఇటువంటి గాయాల బారిన పడకుండా ఉండుటకు, అత్యుత్తమ ప్రదర్శనలతో మంచి స్కోరు సాధించడానికి జిమ్నాస్టు సరైన విధానము అవలంభించి ఈ చివరి అంశాన్ని పూర్తిచేయవలసి ఉంటుంది.

లయబద్దమైన (రిధమిక్) జిమ్నాస్టిక్స్

[మార్చు]
రష్యాకు చెందిన రిధమిక్ జిమ్నాస్ట్ ఇరినా చాచినా అభ్యసనమునకు ముందు తన శరీరభాగాలను సాగదీస్తున్న చిత్రం.

అంతర్జాతీయ జిమ్నాస్టిక్ సమాఖ్య (FIG) నిబంధనల ప్రకారము రిధమిక్ జిమ్నాస్టిక్స్ లో కేవలము స్ర్తీలు మాత్రమే పాల్గొనాలి. ఈ క్రీడాంశంలో బాలెట్, జిమ్నాస్టిక్స్, నృత్యము, ఉపకరణాలతో చేసే విన్యాసాలు ఉంటాయి. ఈ అంశంలో ఐదు వేరు వేరు విభాగాలలో వేరు వేరు ఉపకరణాలతో క్రీడాకారుల ప్రదర్శన ఆధారంగా మూల్యాంకణం చేయబడును. ఈ ఉపకరణాలు బంతి, రిబ్బను, వలయాకారపు చట్రము (హూప్), దుడ్డు కర్రలు (clubs), తాళ్ళు / మోకులు, వీటిని ఉపయోగించి కళాసౌందర్యాత్మకమైన ప్రదర్శనలు చేయవలసి ఉంటుంది. ఈ ప్రదర్శనలు వ్యాయామముల వలె కాకుండా కళాసౌందర్యపోషకంగా ప్రదర్శించగలగాలి. ఈ అంశంలో వ్యక్తిగతంగా నే కాకుండా 5 మంది సభ్యులతో కూడిన బృందంగా కూడా పోటీపడవచ్చు. సభ్యులు 5 ఉపకరణాలనుండి తమకు ఇష్టమైన ఏదో ఒక ఉపకరణాన్ని ఎంచుకొని ఈ ప్రదర్శనలో పాలుపంచుకోవచ్చు. లయబద్దమైన అభ్యాసముతో చేయబడే ఈ ప్రదర్శనల మూల్యాంకనము గరిష్టంగా 30 పాయింట్ల వరకు ఉండవచ్చు. సంగీతం, నాట్యమునకు కూడా మూల్యాంకనము ఉంటుంది. ఈ మూల్యాంకనము, క్రీడాకారుల ప్రదర్శనలోని కష్టతరమైన భంగిమల మూల్యాంకన తో కూడిన సగటు మూల్యాంకనము ను తుది మూల్యాంకనమునకు కూడిక చేసి జట్టు లేదా వ్యక్తిగత ప్రదర్శన యొక్కు తుది మూల్యాంకనను లెక్కిస్తారు.[18]

అంతర్జాతీయ జిమ్నాస్టిక్ పోటీలు స్త్రీ పురుషుల కొరకు సీనియర్, జూనియర్ విభాగాలలో నిర్వహించబడును. జూనియర్ విభాగంలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న క్రీడాకారులు పాల్గొంటారు. సీనియర్ విభాగంలో 16 సంవత్సరాల పైబడిన వయస్సు కల క్రీడాకారులు పాల్గొంటారు. సాధారణంగా రష్యా, యూరోపియన్ దేశాలలోని జిమ్నాస్టిక్ క్రీడాకారులు చాలా చిన్న వయస్సు నుంచే శిక్షణ ప్రారంభించి 15-19 సంవత్సరాల వయస్సుకు చేరుకొనేసరికి తమ అత్యుత్తమ ప్రతిభను అందిపుచ్చుకుంటారు. జిమ్నాస్టిక్ క్రీడలలో అత్యున్నత క్రీడాపోటిలు అనదగ్గవి ఒలింపిక్ క్రీడలు, ప్రపంచ జిమ్నాస్టిక్ పోటీలు, యూరోపియన్ ఛాంపియన్‌షిప్, ప్రపంచ కప్, గ్రాండ్ పిక్స్ సిరీస్

లయబద్దమైన (రిధమిక్) జిమ్నాస్టిక్స్ ఉపకరణములు

[మార్చు]
హూప్ విధానములో భాగంగా స్ప్లిట్ లీప్ విన్యాసాన్ని చేస్తున్న జిమ్నాస్ట్ ఎవ్‌జెనియ కనీవ
బంతితో చేసే జిమ్నాస్టిక్ విన్యాసాలలో భాగంగా బంతిని నియంత్రిసున్న సోవియట్ జిమ్నాస్ట్ గలీన షుగురోవ
బంతి
బంతిని రబ్బరుతో కాని లేదా తత్సమాన పదార్థంతో కానీ తయారు చేస్తారు. ఈ బంతి ఎలా తయారైనా కానీ రబ్బరు లాంటి సాగుదల గుణమును కలిగి ఉంటుంది. ఇది సుమారు 18 నుండి 20 సెంటీమీటర్ల వ్యాసముతో, దాదాపు 400 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. బంతి రంగు ఎలాంటిది అయినా ఉండవచ్చు కానీ ఇది జిమ్నాస్ట్ యొక్క మణికట్టు పై కాక అరచేతిలో ఇమిడి ఉండాలి. ఈ బంతితో చేసే విన్యాసాలు సాధారణంగా బంతిని విసిరివేయడము, పైకి ఎగురునట్లు క్రింద గట్టిగా పడేయడము, నేలపై దొర్లించడము ఉంటాయి. ఈ బంతితో విన్యాసాలు ప్రదర్శించునపుడు జిమ్నాస్ట్ తన రెండు చేతులను ఉపయోగించవలసి మొత్తం ప్రదర్శనా వేదికను కలియతిరగవలసి వస్తుంది. ఈ బంతి విన్యాసాలు సాధారణంగా జిమ్నాస్టు తన శరీర నియంత్రణలోనే ఉంచి బంతిని ఎలా తిప్పుతున్నాడు, అతడు వివిధ వైవిద్య విన్యాసాలు ఎలా చేయగలుగుతున్నాడు అనే అంశాలను న్యాయ నిర్ణేతలు ప్రధానంగా పరిశీలించి మూల్యాంకనము చేస్తారు.
హూప్
హూప్ అనునది చెక్కతో కానీ లేక ప్లాస్టిక్ తో చేయబడిన ఒక వర్తులాకారపు ఉపకరణము. దీనిని రిధమిక్ జిమ్నాస్టిక్స్ లో ప్రదర్శనలు చేయునపుడు క్రీడాకారులు ఉపయోగిస్తారు. దీని వ్యాసము 51 సెంటీమీటర్ల నుండి 90 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. బరువు కనీసము 300 గ్రాములు ఉంటుంది. దీని రంగు దాని తయారీకి వాడిన పదార్థపు రంగుతో కానీ లేదా పాక్షికంగా లేదా పూర్తిగా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రంగుల మిశ్రమంగా కానీ ఉంటుంది. దీని పైభాగాన అదే రంగు లేదా వేరే రంగుతో కానీ ఉన్న ఒక పట్టీ జిగురుతో అంటించబడి ఉండవచ్చు. జిమ్నాస్టులు హూప్ ని ఉపయోగించి ప్రదర్శించే విన్యాసాలలో తప్పనిసరిగా ఉండవలసిన అంశాలు... హూప్ ని చేతి చుట్టూరా తిప్పడము, శరీరం చుట్టూ తిప్పడము, దొర్లించడము, దీనితో వలయాలు సృష్టించడము, పిల్లి మొగ్గలు వేయడము.క్రీడాకారులు హూప్‌లోని ప్రావీణ్యత, నిత్యకృత్యాలు.. ఉపకరణాల నిర్వహణ, శరీర ఇబ్బంది రెండింటిలోనూ పాండిత్యం కలిగి ఉండవలెను.
రిబ్బన్
రిబ్బన్ అనునది శాటిన్ లేదా ఏదైనా రంగు యొక్క మరొక సారూప్య పదార్థ వస్త్రంతో తయారు చేయబడింది, బహుళ రంగులతో పాటు దానిపై డిజైన్లను కలిగి ఉంటుంది. రిబ్బన్ కనీసం 35 గ్రా , 4–6 సెం.మీ (1.6–2.4 ") వెడల్పు ఉండాలి, సీనియర్ వర్గానికి కనీసం 6 మీ (20 ') (జూనియర్లకు 5 మీ (16.25') పొడవు ఉండాలి. రిబ్బన్ తప్పనిసరిగా ఒక ముక్కలో ఉండాలి. కర్రతో జతచేయబడిన ముగింపు గరిష్టంగా 1 మీ (3 ') ఉండవచ్చును.ఇది రెండు వైపులా కుట్టినది. పైభాగంలో, చాలా సన్నని ఉపబల లేదా యంత్రాల కుట్టు వరుసలు గరిష్టంగా 5 సెంటీమీటర్ల పొడవు అధికారం కలిగి ఉంది. రిబ్బన్‌ను అటాచ్ చేయడానికి అనుమతించడానికి ఈ అంత్యభాగం పట్టీలో ముగుస్తుంది, లేదా ఐలెట్ (చిన్న రంధ్రం, బటన్హోల్ కుట్టుతో లేదా లోహ వృత్తంతో అంచున) ఉండవచ్చు. రిబ్బన్ కర్రకు దారము, నైలాన్ త్రాడు లేదా ఉచ్చారణ వలయాల శ్రేణి వంటి వాటితో స్థిరంగా కట్టబదీ ఉంటుంది . అటాచ్మెంట్ గరిష్టంగా 7 సెం.మీ (2.8 ") పొడవును కలిగి ఉంటుంది, ఈ పొడవులో స్టిక్ చివరిలో ఉన్న పట్టీ లేదా లోహపు ఉంగరాన్ని లెక్కించరు. రిబ్బన్ తో చేయబడే విన్యాసాలలో తప్పనిసరిగా ఫ్లిక్స్న్ వలయాలు, సర్ప ఆకారాలు, స్పిరల్ వలయాకారాలు ఉంటాయి. రిబ్బన్ విన్యాసాలు ప్రదర్శించడానికి జిమ్నాస్ట్ కు అధిక స్థాయి సమన్వయం అవసరం. ఈ ప్రదర్శనలో ఏదైనా పొరపాటు జరిగి వేరే ఆకారాన్ని ప్రదర్శించినచో జిమ్నాస్ట్ కి అది ప్రతిబంధకంగా మారవచ్చు. ఈ క్రమంలో జిమ్నాస్ట్ పాయింట్లలో కోత కూడా విధించే అవకాశం ఉన్నది. న్యాయ నిర్ణేతలు సాధారణంగా రిబ్బన్ దినచర్యలో, పెద్ద, మృదువైన, సున్నిత కదలికల కోసం చూస్తారు.
క్లబ్స్
క్లబ్ అంటే ఒక విధంగా మన దగ్గర ఉన్న కోలాటం కర్రల మాదిరిగా చెప్పవచ్చు. మల్టీ-పీస్ క్లబ్‌లు అత్యంత ప్రాచుర్యం పొందిన క్లబ్‌లు. క్లబ్ అంతర్గత నిర్మాణంలో భాగంగా ఒక రాడ్ వెంట నిర్మించబడి ఉంటుంది. దీనికి పాలియోలిఫిన్ ప్లాస్టిక్‌తో తయారు చేసిన హ్యాండిల్‌ను చుట్ ఉండటం వలన ఇది , దానికి, అంతర్గత రాడ్‌కు మధ్య ఒక శూన్య పొరను ఏర్పాటు చేస్తుంది. ఈ పొర ఫ్లెక్స్, కుషనింగ్ ప్రభావాన్ని అందిస్తుంది, క్లబ్ చేతులను మృదువుగా చేస్తుంది. ఫోం నిర్మాతంతో చేయబడిన దీని అంచులు క్లబ్‌ను మరింత పరిపుష్టం చేస్తాయి. మల్టీ-పీస్ క్లబ్బులు సన్నని యూరోపియన్ శైలిలో లేదా పెద్ద శరీర అమెరికన్ శైలిలో, వివిధ పొడవులలో తయారు చేయబడతాయి, సాధారణంగా ఇవి 19 నుండి 21 అంగుళాలు (480 నుండి 530 మిమీ) వరకు ఉంటాయి. హ్యాండిల్స్, శరీరాలు సాధారణంగా అలంకార ప్లాస్టిక్స్, టేపులతో చుట్టబడి ఉంటాయి. క్లబ్ ఉపయోగించి చేయబడే నైపుణ్యాలు సాధారణంగా శరీరము, ఉపకరణాల మధ్య అత్యంత సమంవయం తో చేయవలసి ఉంటుంది. జిమ్నాస్ట్ రెండు చేతులలో రెండు క్లబ్ లను పట్టుకొని ఒకదాని తర్వాత ఒకటిగా పైకి విసురుతాడు. మొదటిసారి విసిరిన క్లబ్ క్రిందుగా రెండవ క్లబ్ విసరవలసి ఉంటుంది. కుడి చేతితో విసిరిన క్లబ్ ను ఎడమ చేతితో, ఎడమ చేతితో విసిరిన క్లబ్ ను కుడి చేతితో అందుకోవలసి ఉంటుంది. ఏదేమైనా, క్లబ్ లను వేగంగా, మరింత పైకి విసిరివేసి మరిన్ని ఆకారాలు సృష్టించి మంచి మార్కులు పొందడానికి డబుల్, ట్రిపుల్ స్పిన్‌లు తరచూ ప్రదర్శించబడతాయి. 360 పాటర్న్ అనునది ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చును.

ట్రాంపోలైనింగ్, టంబ్లింగ్

[మార్చు]
డబుల్ మినీ-ట్రంపొలిన్ విన్యాసములో ఒక పోటీదారు

ట్రాంపోలైనింగ్

[మార్చు]

ట్రాంపోలైనింగ్, టంబ్లింగ్ అంశాలలో నాలుగు విభాగాలు ఉంటాయి. వ్యక్తిగత, సమకాలీకరించబడిన (synchronized ) ట్రాంపోలైనింగ్, టంబ్లింగ్ (పవర్ టంబ్లింగ్ లేదా రాడ్ ఫ్లోర్ అని కూడా పిలుస్తారు). 2000 సంవత్సరం నుండి వ్యక్తిగత ట్రాంపోలైనింగ్ ఒలింపిక్ క్రీడలు లో చేర్చబడినది.

వ్యక్తిగత ట్రాంపోలైన్
[మార్చు]

ట్రాంపోలిన్ లో భాగంగా జిమ్నాస్ట్ ప్రదర్శించు పలు విన్యాసాలలో మొదటగా బిల్డప్ దశ ఉంటుంది. ఇందులో భాగంగా జిమ్నాస్ట్ గరిష్టంగా ఎగరగలిగే ఎత్తు ను చేరుకోవడానికి పదే పదే పలు మార్లు గాలిలో ఎగరడం జరుగుతుంది.ఆ తరువాత విరామం లేకుండా పది బౌన్స్‌ల క్రమం ఉంటుంది, ఈ సమయంలో జిమ్నాస్ట్ వైమానిక నైపుణ్యాల క్రమాన్ని ప్రదర్శిస్తారు. రొటీన్లు గరిష్టంగా 10 పాయింట్ల స్కోరుతో గుర్తించబడతాయి. ఎత్తుగడల యొక్క సగటు ఎత్తుకు సూచనగా ఉన్న పది నైపుణ్యాలను పూర్తి చేయడానికి తీసుకున్న కదలికల కష్టం, సమయం యొక్క పొడవును బట్టి అదనపు పాయింట్లు (గరిష్ట స్థాయి పోటీ లేకుండా) సంపాదించవచ్చు. ఉన్నత స్థాయి పోటీలలో ఈ విభాగంలో రెండు అంచెలు ఉంటాయి. మొదటి అంచెలో జిమ్నాస్ట్ కష్టసాధ్యమైన రెండు విన్యాసాలు చేయవలసి ఉంటుంది. దాని తర్వాత రెండవ అంచెలో జిమ్నాస్ట్ తనకు ఇష్టమైన లేదా చేయగలిగిన ఏ విన్యాసాన్ని అయినా ప్రదర్శించవచ్చు.

సింక్రోనైజ్డ్ ట్రాంపొలిన్
[మార్చు]

సింక్రోనైజ్డ్ ట్రాంపొలిన్ అనునది వ్యక్తిగత ట్రాంపోలైన్ తో సారూప్యతను కలిగి ఉంటుంది. తేడా ఒక్కటే, అది ఏమనగా, ఈ అంశంలో ఇద్దరు జిమ్నాస్టులు తమ విన్యాసాలను ఏకకాలంలో ప్రదర్శించవలసి ఉంటుంది. ఇద్దరి మధ్య సమన్వయం, ప్రదర్శించే విన్యాసాలలో కష్టతరము ఆధారంగా న్యాయ నిర్ణేతలు స్కోరు నిర్ణయించడం జరుగుతుంది.

డబుల్-మినీ ట్రాంపొలిన్
[మార్చు]

Double mini trampoline involves a smaller trampoline with a run-up, two moves are performed per routine. Moves cannot be repeated in the same order on the double-mini during a competition. Skills can be repeated if a skill is competed as a mounter in one routine and a dismount in another. The scores are marked in a similar manner to individual trampoline.

టంభ్లింగ్

[మార్చు]

In tumbling, athletes perform an explosive series of flips and twists down a sprung tumbling track. Scoring is similar to trampolining. Tumbling was originally contested as one of the events in Men's Artistic Gymnastics at the 1932 Summer Olympics, and in 1955 and 1959 at the Pan American Games. From 1974 to 1998 it was included as an event for both genders at the Acrobatic Gymnastics World Championships. The event has also been contested since 1976 at the Trampoline World Championships. Since the recognition of Trampoline and Acrobatic Gymnastics as FIG disciplines in 1999, official Tumbling competitions are only allowed as an event in Trampoline gymnastics meets.

అక్రోబాటిక్స్ జిమ్నాస్టిక్స్

[మార్చు]
ఆక్రోబాటిక్ మహిళా జిమ్నాస్ట్ ద్వయం - ఒక విన్యాసాన్ని ప్రదర్శిస్తున్న చిత్రం.

అక్రోబాటిక్స్ జిమ్నాస్టిక్స్ (గతంలో : స్పోర్ట్స్ ఆక్రోబాట్స్) అనునవి జనబాహుళ్యంలో '''ఆక్రో ''' గా కూడా వ్యవహరించబడుతాయి. ఇందులో కొన్ని విన్యాసాలను స్త్రీ, పురుష జిమ్నాస్ట్లు కలసికట్టుగా ఆయా విభాగాలలో ప్రదర్శింపవలసి ఉంటుంది. ఇందులో బృందాలుగా.. ఒక్కో బృందంలో ఇద్దరు లేదా ముగ్గురు లేదా నలుగురు సభ్యులు కలిసి ఈ విన్యాసాలను తమ బృంద సభ్యుల తలలతో, చేతులతో, పాదాలతో అత్యంత సమన్వయం తో ప్రదర్శిస్తారు. ఈ విన్యాసాలను ప్రదర్శించేటప్పుడు ఆయా పోటీల నియమాలను అనుసరించి ఇతర నేపధ్య సంగీతం లేదా క్రీడా కారులు తామే స్వంతంగా సమకూర్చుకున్న నేపధ్య సంగీతాన్ని వాడుకోవచ్చు.

There are four international age categories: 11-16, 12-18, 13-19, and Senior (15+), which are used in the World Championships and many other events around the world, including European Championships and World Games. All levels require a balance and dynamic routine, 12-18, 13-19, and Seniors are also required to perform a final (combined) routine.

Currently, acrobatic gymnastics is marked out of 30.00 (can be higher at Senior FIG level based on difficulty):

  • 10.00 for routine difficulty, (valued from the tables of difficulties)
  • 10.00 For technical performance, (how well the skills are executed)
  • 10.00 For Artistry, (the overall performance of the routine, namely choreography)

ఏరోబిక్ జిమ్నాస్టిక్స్

[మార్చు]

Aerobic gymnastics (formally Sport Aerobics) involves the performance of routines by individuals, pairs, trios or groups up to 6 people, emphasizing strength, flexibility, and aerobic fitness rather than acrobatic or balance skills. Routines are performed for all individuals on a 7x7m floor and also for 12–14 and 15-17 trios and mixed pairs. From 2009, all senior trios and mixed pairs were required to be on the larger floor (10x10m), all groups also perform on this floor. Routines generally last 60–90 seconds depending on age of participant and routine category.

ఇతర విభాగాలు

[మార్చు]

The following disciplines are not currently recognized by the Fédération Internationale de Gymnastique.

కళాసౌందర్యాత్మకమైన జట్టు జిమ్నాస్టిక్స్

[మార్చు]

Aesthetic Group Gymnastics (AGG) was developed from the Finnish "naisvoimistelu". It differs from Rhythmic Gymnastics in that body movement is large and continuous and teams are larger' Athletes do not use apparatus in international AGG competitions compared to Rhythmic Gymnastics where ball, ribbon, hoop and clubs are used on the floor area. The sport requires physical qualities such as flexibility, balance, speed, strength, coordination and sense of rhythm where movements of the body are emphasized through the flow, expression and aesthetic appeal. A good performance is characterized by uniformity and simultaneity. The competition program consists of versatile and varied body movements, such as body waves, swings, balances, pivots, jumps and leaps, dance steps, and lifts. The International Federation of Aesthetic Group Gymnastics (IFAGG) was established in 2003.[19]

పురుషుల రిధమిక్ జిమ్నాస్టిక్స్

[మార్చు]

Men's rhythmic gymnastics is related to both men's artistic gymnastics and wushu martial arts. It emerged in Japan from stick gymnastics. Stick gymnastics has been taught and performed for many years with the aim of improving physical strength and health. Male athletes are judged on some of the same physical abilities and skills as their female counterparts, such as hand/body-eye co-ordination, but tumbling, strength, power, and martial arts skills are the main focus, as opposed to flexibility and dance in women's rhythmic gymnastics. There are a growing number of participants, competing alone and on a team; it is most popular in Asia, especially in Japan where high school and university teams compete fiercely. As of 2002, there were 1000 men's rhythmic gymnasts in Japan.[ఆధారం చూపాలి]

The technical rules for the Japanese version of men's rhythmic gymnastics came around the 1970s. For individuals, only four types of apparatus are used: the double rings, the stick, the rope, and the clubs. Groups do not use any apparatus. The Japanese version includes tumbling performed on a spring floor. Points are awarded based a 10-point scale that measures the level of difficulty of the tumbling and apparatus handling. On November 27–29, 2003, Japan hosted first edition of the Men's Rhythmic Gymnastics World Championship.

టీం జిమ్

[మార్చు]

TeamGym is a form of competition created by the European Union of Gymnastics, named originally EuroTeam. The first official competition was held in Finland in 1996. TeamGym events consist of three sections: women, men and mixed teams. Athletes compete in three different disciplines: floor, tumbling and trampette. In common for the performance is effective teamwork, good technique in the elements and spectacular acrobatic skills.[20]

చక్రంతో చేసే జిమ్నాస్టిక్స్

[మార్చు]

Wheel gymnasts do exercises in a large wheel known as the Rhönrad, gymnastics wheel, gym wheel, or German wheel, in the beginning also known as ayro wheel, aero wheel, and Rhon rod.

There are three core categories of exercise: straight line, spiral, and vault.

మల్లకంభ

[మార్చు]

Mallakhamba (Marathi: मल्लखांब) is a traditional Indian sport in which a gymnast performs feats and poses in concert with a vertical wooden pole or rope. The word also refers to the pole used in the sport.

Mallakhamba derives from the terms malla which denotes a wrestler and khamba which means a pole. Mallakhamba can therefore be translated to English as "pole gymnastics".[21] On April 9, 2013, the Indian state of Madhya Pradesh declared mallakhamba as the state sport.

పోటీలో లేని ఇతర జిమ్నాస్టిక్స్

[మార్చు]

General gymnastics enables people of all ages and abilities to participate in performance groups of 6 to more than 150 athletes. They perform synchronized, choreographed routines. Troupes may consist of both genders and are not separated into age divisions. The largest general gymnastics exhibition is the quadrennial World Gymnaestrada which was first held in 1939. In 1984 Gymnastics for All was officially recognized first as a Sport Program by the FIG (International Gymnastic Federation), and subsequently by national gymnastic federations worldwide with participants that now number 30 million.[22]

పూర్వ ఉపకరణాలు, సంఘటనలు

[మార్చు]

తాడు (రిధమిక్ జిమ్నాస్టిక్స్)

[మార్చు]

This apparatus may be made of hemp or a synthetic material which retains the qualities of lightness and suppleness. Its length is in proportion to the size of the gymnast. The rope should, when held down by the feet, reach both of the gymnasts' armpits. One or two knots at each end are for keeping hold of the rope while doing the routine. At the ends (to the exclusion of all other parts of the rope) an anti-slip material, either coloured or neutral may cover a maximum of 10 cm (3.94 in). The rope must be coloured, either all or partially and may either be of a uniform diameter or be progressively thicker in the center provided that this thickening is of the same material as the rope. The fundamental requirements of a rope routine include leaps and skipping. Other elements include swings, throws, circles, rotations and figures of eight. In 2011, the FIG decided to nullify the use of rope in rhythmic gymnastic competitions.

త్రాడు ఎక్కుట

[మార్చు]

సాధారణంగా, పోటీదారులు 6 మీ (6.1 మీ = 20 అడుగులు యుఎస్) లేదా 8 మీ (యుఎస్ లో 7.6 మీ = 25 అడుగులు), 38 మిమీ వ్యాసం (1.5-అంగుళాలు) సహజ ఫైబర్ తాడును వేగం కోసం ఉపయోగిస్తారు, ఇది కూర్చున్న స్థానం నుండి ప్రారంభమవుతుంది. నేల, చేతులు, చేతులు మాత్రమే ఉపయోగించడం. ఒక రకమైన "స్ట్రైడ్" లో కాళ్ళను తన్నడం సాధారణంగా అనుమతించబడుతుంది. చాలా మంది జిమ్నాస్ట్‌లు దీన్ని స్ట్రాడిల్ లేదా పైక్ పొజిషన్‌లో చేయగలరు, ఇది కాళ్ల నుండి ఉత్పన్నమయ్యే సహాయాన్ని తొలగిస్తుంది, అయితే దీనిని కాళ్లతో కూడా చేయవచ్చు.

ఎగిరే వలయాలు (Flying rings)

[మార్చు]

Flying rings was an event similar to still rings, but with the performer executing a series of stunts while swinging. It was a gymnastic event sanctioned by both the NCAA and the AAU until the early 1960s.

క్లబ్ స్విమ్మింగ్

[మార్చు]

Club Swinging a.k.a. Indian Clubs was an event in Men's Artistic Gymnastics sometimes up until the 1950s. It was similar to the clubs in both Women's and Men's Rhythmic Gymnastics but much simpler with few throws allowed. It was practice. It was competed in the 1904 and 1932 summer Olympic Games.

ఇతరములు (పురుషుల కళాత్మకములు)

[మార్చు]

Team Horizontal Bar and Parallel Bar in the 1896 Summer Olympics Team Free and Swedish System in the 1912 and 1920 Summer Olympics Combined and Triathlon in the 1904 Summer Olympics Side Horse Vault in 1924 Summer Olympics Tumbling in the 1932 Summer Olympics

ఇతరములు (మహిళల కళాత్మకములు)

[మార్చు]

Team Exercise at the 1928, 1936 and 1948 Summer Olympics Parallel Bars at the 1938 World Championships Team Portable Apparatus at the 1952 and 1956 Summer Olympics

సంబంధిత సమాచారము

[మార్చు]

గ్రంధములు

[మార్చు]

సినిమాలు

[మార్చు]

టెలివిజన్

[మార్చు]

వీడియో ఆటలు

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

లువా తప్పిదం: bad argument #2 to 'title.new' (unrecognized namespace name 'Portal')

మూలాలు

[మార్చు]
  1. γυμνός, Henry George Liddell, Robert Scott, A Greek-English Lexicon, on Perseus project
  2. γυμνάζω, Henry George Liddell, Robert Scott, A Greek-English Lexicon, on Perseus project
  3. Goodbody, John (1982). The Illustrated History of Gymnastics. London: Stanley Paul & Co. ISBN 0-09-143350-9.
  4. Artistic Gymnastics History Archived 2009-04-04 at the Wayback Machine at fig-gymnastics.com
  5. 5.0 5.1 "USA Gymnastics - FIG Elite/International Scoring". usagym.org. Archived from the original on 2016-08-04. Retrieved 2016-08-09.
  6. "Vault: Everything You Need to know about Vault". Archived from the original on 2014-04-13. Retrieved 2009-10-04.
  7. "Apparatus Norms". FIG. p. II/51. Archived from the original (PDF) on 2011-12-19. Retrieved 2009-10-04.
  8. "WAG Code of Points 2009–2012". FIG. p. 29. Archived from the original (PDF) on 2011-12-19. Retrieved 2009-10-02.
  9. https://www.youtube.com/watch?v=aZTouqqC6WM
  10. https://www.youtube.com/watch?v=TUo2UmD03es
  11. "WAG Code of Points 2009–2012". FIG. p. 11. Archived from the original (PDF) on 2011-12-19. Retrieved 2009-10-02.
  12. "WAG Code of Points 2009–2012". FIG. p. 13. Archived from the original (PDF) on 2011-12-19. Retrieved 2009-10-02.
  13. "WAG Code of Points 2009–2012". FIG. p. 14. Archived from the original (PDF) on 2011-12-19. Retrieved 2009-10-02.
  14. 14.0 14.1 14.2 14.3 Marinsek, M. (2010). BasicLanding. 59-67.
  15. Yeow, C., Lee, P., & Goh, J. (2009). Effect of landing height on frontal plane kinematics, kinetics and energy dissipation at lower extremity joints. Journal of Biomechanics, 1967-1973.
  16. Gittoes, M. J., & Irin, G. (2012). Biomechanical approaches to understanding the potentially injurious demands of gymnastic-style impact landings. Sports Medicine A Rehabilitation Therapy Technology, 1-9.
  17. Yeow, C., Lee, P., & Goh, J. (2009). Effect of landing height on frontal plane kinematics, kinetics and energy dissipation at lower extremity joints. Journal of Biomechanics, 1967-1973.
  18. Fédération Internationale de Gymnastique, Code of Points – Rhythmic Gymnastics 2009–2012
  19. Lajiesittely Archived 2014-06-21 at the Wayback Machine, Suomen Voimisteluliitto.
  20. TeamGym, British Gymnastics
  21. "Indian roots to gymnastics". NDTV - Sports. Mumbai, India. 6 December 2007. Archived from the original on 10 జూన్ 2014.
  22. "Gymnastics 101 - Group Gymnastics and Gymnastics For All". USA Gymnastics. Archived from the original on 2011-07-28. Retrieved 2011-12-29.

బయటి లంకెలు

[మార్చు]