జి.అనుపమా చక్రవర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి.అనుపమా చక్రవర్తి

తెలంగాణ వ్యాట్‌ ట్రిబ్యునల్‌ చైర్‌పర్సన్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
-
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

శ్రీకాకుళం జిల్లా అదనపు జిల్లా జడ్జి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2008

కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019-2020 సెప్టెంబర్‌

వ్యక్తిగత వివరాలు

జననం 1970
పాలకొండ, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
తల్లిదండ్రులు ఎన్‌.కృష్ణచందర్‌రావు, మహాలక్ష్మి
జీవిత భాగస్వామి లక్ష్మణరావు
సంతానం ఒక కుమారుడు

జి.అనుపమా చక్రవర్తి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆమెను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసింది.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

జి.అనుపమా చక్రవర్తి 1962లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, పాలకొండలో ఎన్‌.కృష్ణచందర్‌రావు, మహాలక్ష్మి దంపతులకు జన్మించింది. ఆమె విశాఖపట్నంలోని ఎన్‌బీఎం లా కాలేజీ నుండి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1994లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుంది.[3]

వృత్తి జీవితం

[మార్చు]

జి.అనుపమా చక్రవర్తి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాక సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వద్ద జూనియర్‌గా చేరి అనంతరం సొంతంగా ప్రాక్టీస్ మొదలు పెట్టి 2006 నుండి 2008 వరకు అసిస్టెంట్‌ జీపీగా పని చేసి 2008లో జిల్లా జడ్జిగా ఎంపికై అదనపు జిల్లా జడ్జిగా విధుల్లో చేరింది. ఆమె అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేసి అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ మెంబర్‌ సెక్రటరీగా, కోఆపరేటివ్‌ ట్రైబ్యునల్‌ చైర్‌పర్సన్‌గా, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా[4] వివిధ హోదాల్లో పని చేసి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాట్‌ ట్రిబ్యునల్‌ చైర్‌పర్సన్‌గా విధులు నిర్వహిస్తుంది.ఆమెను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[2][5] సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2022 మార్చి 22న ఆమోదించాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (2 February 2022). "తెలంగాణ హైకోర్టుకు మరో 12 మంది జడ్జిలు!". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
  2. 2.0 2.1 TV9 Telugu (2 February 2022). "తెలంగాణా హైకోర్టుకు 12 మంది కొత్త జడ్జీల నియామకానికి సుప్రీం కోర్టు ఆమోదం." Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (24 March 2022). "తపించారు.. సాధించారు". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.
  4. Namasthe Telangana (2 September 2021). "హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా అనుపమ చక్రవర్తి". Archived from the original on 7 February 2022. Retrieved 7 February 2022.
  5. Andhra Jyothy (3 February 2022). "హైకోర్టుకు 12 మంది కొత్త న్యాయమూర్తులు". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
  6. Sakshi (23 March 2022). "హైకోర్టుకు కొత్తగా 10 మంది జడ్జీలు". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.