జి. కుమార్ నాయక్
జి. కుమార్ నాయక్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 | |||
ముందు | రాజా అమరేశ్వర నాయక్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | రాయచూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బెంగళూరు , కర్ణాటక | 1963 సెప్టెంబరు 12||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | గోవిందస్వామి నాయక్,శారదమ్మ | ||
జీవిత భాగస్వామి | షీలా కులకర్ణి (మ. 11 నవంబర్ 1993) | ||
సంతానం | 2 | ||
నివాసం | నెం. 62, 16వ క్రాస్, 14వ B మెయిన్ రోడ్ HSR లేఅవుట్, సెక్టార్ 4, బెంగళూరు బెంగళూరు కర్ణాటక[1] |
జి. కుమార్ నాయక్ (జననం 12 సెప్టెంబర్ 1963) భారతదేశానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాయచూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
వృత్తి జీవితం
[మార్చు]కుమార్ నాయక్ 1990 కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి. ఆయన 1992లో మైసూర్ జిల్లా హున్‌సూర్ సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్‌గా, 1999 నుండి 2002 వరకు రాయచూర్‌లో డిప్యూటీ కమిషనర్‌గా, సెప్టెంబర్ 2023లో ఇంధన శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా తర్వాత బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్‌గా పని చేసి రాజకీయాల పట్ల ఆసక్తితో పదవీ విరమణ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[4]
రాజకీయ జీవితం
[మార్చు]కుమార్ నాయక్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాయచూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజా అమరేశ్వర నాయక్ పై 79781 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. కుమార్ నాయక్‌కు 6,70,966 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి అమ్రేష్ నాయక్‌కు 5,91,185 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ఎస్. నరసన్నగౌడ్ నాయక్‌కు 9,289 ఓట్ల వచ్చాయి.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (5 June 2024). "A former IAS officer, Kumar Naik wins it for the Congress in Raichur by a comfortable margin" (in Indian English). Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
- ↑ The Hindu (4 June 2024). "Kumar Naik wins against incumbent MP Raja Amareshwar Naik in Raichur constituency" (in Indian English). Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
- ↑ TimelineDaily (22 April 2024). "Congress To Leverage From Good Work Of Former IAS Officer G Kumar Naik In Raichur" (in ఇంగ్లీష్). Archived from the original on 26 July 2024. Retrieved 26 July 2024.
- ↑ India Today (13 July 2024). "Ex-administrators | From desk to dais" (in ఇంగ్లీష్). Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Raichur". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ TV9 Bharatvarsh (5 June 2024). "रायचूर लोकसभा सीट से जीतने वाले कांग्रेस के जी. कुमार नाइक कौन हैं, जानिए अपने सांसद को". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- Pages using the JsonConfig extension
- CS1 Indian English-language sources (en-in)
- Date of birth not in Wikidata
- 1963 జననాలు
- భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు
- 18వ లోక్‌సభ సభ్యులు
- కర్ణాటక నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
- కర్ణాటక రాజకీయ నాయకులు
- కర్ణాటక వ్యక్తులు