జీబోర్డు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీబోర్డు
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుగూగుల్
ప్రారంభ విడుదలమే 12, 2016; 7 సంవత్సరాల క్రితం (2016-05-12)
Stable release(s)
10.5.03.367007960 / మే 3, 2021; 2 సంవత్సరాల క్రితం (2021-05-03)
ఆపరేటింగ్ సిస్టంiOS, iPadOS, ఆండ్రాయిడ్
లైసెన్సుప్రొప్రైటరీ

జీబోర్డు (Gboard) అనేది గూగుల్ చే అభివృద్ధి చేయబడిన మొబైల్ అనువర్తనం (యాప్), ఇది మొదట 2016 మేలో ఐఓఎస్ లో విడుదలైంది,ఆ తర్వాత ఆండ్రాయిడ్‌లో 2016 డిసెంబరులో విడుదలైంది[1],ఆండ్రాయిడ్‌లో ఇప్పటికే స్థాపించబడిన గూగుల్ కీబోర్డ్ యాప్‌కి ప్రధాన నవీకరణగా వచ్చింది.ఇది అత్యంత ప్రజాదరణ పొందిన అండ్రాయిడ్ అనువర్తనాలలో ఒకటిగా నిలిచింది[2]. అంచనా వేసే సమాధానాలు, జిఫ్, ఎమోజి కంటెంట్‌ని సులభంగా శోధించడం, భాగస్వామ్యం చేయడం,సందర్భాన్ని బట్టి తదుపరి పదాన్ని సూచించే ప్రిడిక్టివ్ టైపింగ్ ఇంజిన్‌తో సహా గూగుల్ శోధనను కలిగి ఉంటుంది, జీబోర్డు తో జీఐఎఫ్ లు కూడా తయారు చేయ‌వచ్చు.[3] ఇది ఆండ్రాయిడ్ కీబోర్డుల్లో  అత్యధిక అప్షన్లు ఉన్న కీబోర్డు[4].ఫ్లోటింగ్ కీబోర్డ్, గూగుల్ అనువాదం అందుబాటులో ఉన్నాయి. 2016 మే నవీకరణ నుండి ఆండ్రాయిడ్‌లో వన్-హ్యాండ్ మోడ్‌కు మద్దతు ఇస్తుంది. GBoard QWERTY, QWERTZ, AZERTY, Dvorak, Colemakతో సహా విభిన్న కీబోర్డ్ లేఅవుట్‌లకు మద్దతు ఇస్తుంది,22 భారతీయ భాషలకు మద్దత్తు 2017 లో అందించబడినది[5].ప్రస్తుతం 40కి పైగా రైటింగ్ సిస్టమ్‌లలో 500 భాషలకు మద్దతు ఇస్తుంది[6].వ్యాకరణ దిద్దుబాటు 2021 అక్టోబరులో ప్రవేశపెట్టబడింది.

తెలుగుని ఎంపిక చేసుకోవటం[మార్చు]

సాధారణంగా కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ లో జీబోర్డు అప్రమేయంగా ఉంటుంది, లేకుంటే ప్లే స్టోర్ నుంచి దిగుమతి చేసుకోవాలి తరువాత మొబైల్ లోని సెట్టింగ్స్ లో లాంగ్వేజ్ కీబోర్డు ఇన్ పుట్ మెథడ్ కు వెళ్లి జీ బోర్డు క్లిక్ చేయాలి. ఆప్షన్లలో లాంగ్వేజ్ ను ఎంచుకోవాలి. అక్కడ యూజ్ సిస్టమ్ లాంగ్వేజ్ ను డీయాక్టివేట్ చేయాలి లాంగ్వేజ్ ఆప్షన్‌లో “తెలుగు” లేదా మీకు కావల్సిన భాషని టిక్ చేసి ఎంచుకోవాలి. అలాగే “ఎనేబిల్ వాయిస్ టైపింగ్” అనే ఆప్షన్‌ని కూడా టిక్ చేసి ఒకే చేయాలి అందులో కనిపించే భాషల్లో సాధారణంగా ఇంగ్లీష్ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది. దాన్ని డీయాక్టివేట్ చేయాలి. ఆ మెనూలో కిందకి వస్తే తెలుగు కనిపిస్తుంది. దాన్ని యాక్టివేట్ చేసి సేవ్ చేసుకోవాలి. టైప్ చేయాలనుకున్న చోట కీబోర్డ్ ఆక్టివేట్ అయిన వెంటనే దాని కింది భాగంలో కనిపించే గ్లోబ్ ని క్లిక్ చేయాలి. గ్లోబ్ ను క్లిక్ చేస్తే తెలుగు నుంచి ఇంగ్లిష్ కు ఇంగ్లిష్ సెలెక్ట్ అయి ఉంటే తెలుగులో మారిపోతుంది. ఒకవేళ కీబోర్డ్ కింద స్పేస్ బార్ పై ఇంగ్లిష్ అని ఉంటే గ్లోబ్ ని ఒక సారి సెలెక్ట్ చేయాలి ఇక్కడ మీకు కావలసిన టైపింగ్ విధానం ఎంపిక చేసుకోవచ్చు.   

వాయిస్ టైపింగ్[మార్చు]

జీ బోర్డులో వాయిస్ టైపింగ్ ద్వారా టైప్ చేయడం మరింత సులభం వాయిస్ టైపింగ్ కీబోర్డ్ సులభంగా మీ స్థానిక భాష టైప్ చేయవచ్చు ఏ భాషలోనైనా మాట్లాడితే, ఆ భాషలో పదాలు వాటంతట అవే టైప్ అయిపోతుంటాయి, తెలుగు వాయిస్ టైపింగ్ ఎనేబుల్ చేసిన తర్వాత తర్వాత కీబోర్డ్ లోనే పైన కనిపించే మైక్ సింబల్ ని ఆన్ చేసి నిదానంగా ఒక పదం తర్వాత ఒక పదం పెద్దగా పలుకుతుంటే తెలుగులో టైపు అవుతూ ఉంటుంది.   

మూలాలు[మార్చు]

  1. https://www.gadgets360.com/apps/news/google-gboard-app-for-ios-finally-comes-to-android-as-an-update-to-google-keyboard-1637246
  2. "Gboard - the Google Keyboard – Apps on Google Play". play.google.com (in Indian English). Retrieved 2023-02-16.
  3. "మరిన్ని కొత్త హంగులతో ముందుకొచ్చిన ఆండ్రాయిడ్". ETV Bharat News. Retrieved 2023-02-16.
  4. "ఫోన్లో ఫాస్టుగా టైప్ చేయడానికి 9 సింపుల్ టిప్స్ మీకోసం - - టిప్స్ అండ్ ట్రిక్స్". computervignanam.net. Retrieved 2023-02-16.
  5. "Gboard for Android gets new languages and tools". Google (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-04-26. Retrieved 2023-02-16.
  6. "Gboard now supports 500 languages across more than 40 writing systems". Android Authority (in ఇంగ్లీష్). 2018-12-19. Retrieved 2023-02-16.
"https://te.wikipedia.org/w/index.php?title=జీబోర్డు&oldid=4076005" నుండి వెలికితీశారు