Jump to content

జీవన్

వికీపీడియా నుండి
జీవన్
జననం1915 అక్టోబర్ 24
శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ భారతదేశం
మరణం1987 జూన్ 10
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1935 – 1986
పిల్లలుకిరణ్ కుమార్,

ఓంకార్ నాథ్ ధర్ (24 అక్టోబర్ 1915 – 10 జూన్ 1987), జీవన్‌ అనే పేరుతో సుపరిచితుడు, ఒక భారతీయ నటుడు. జీవన్ హిందీ సినిమాలలో మొత్తం 49 సార్లు నారద ముని పాత్రను పోషించాడు. [1] [2] తరువాత, జీవన్ 1960లు, 1970లు 1980లలోని ప్రముఖ బాలీవుడ్ సినిమాలలో ప్రతి నాయకుడిగా నటించారు. జీవన్ కుమారుడు కిరణ్ కుమార్ కూడా సినిమా నటుడు. [3]

బాల్యం

[మార్చు]

జీవన్ ఒక కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించాడు. జీవన్ తాత, గిల్గిట్ ఏజెన్సీకి గవర్నర్‌గా పనిచేశారు. జీవన్ తల్లి ప్రసవ సమయంలో మరణించింది . జీవన్ మూడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు తన తండ్రిని కోల్పోయాడు. [1]

నట జీవితం

[మార్చు]

చిన్నప్పటి నుంచీ జీవన్‌కు సినిమాలంటే ఆసక్తి ఉండేది. ఎప్పటికైనా సినిమా నటుడు కావాలని జీవన్ కలలు కంటూ ఉండేవాడు. జీవన్ తాత గవర్నరు కాబట్టి, వారి కుటుంబం ప్రభువులలో పరిగణించబడుతుంది. జీవన్ 18 సంవత్సరాల వయస్సులో ఇంటి నుండి పారిపోయి ముంబాయికి వచ్చాడు. అప్పుడు జీవన్ జేబులో 26 రూపాయలు ఉన్నాయి.

కొంతకాలం తర్వాత, జీవన్ ఒక్క స్టూడియోలో ఉద్యోగం సంపాదించాడు. గోడలకు పత్రిక ప్రకటనలను అతికించడం జీవన్ పని.

జీవన్ నారద మునిగా 60కి పైగా సినిమాలలో నటించాడు. త్రిలోక్ కపూర్ నిరూపా రాయ్‌ కలిసి నటించిన 1950 హిట్ చిత్రం "హర్ హర్ మహాదేవ్ సినిమాలో జీవన్ చివరి సారిగా నారదుడి పాత్రను పోషించాడు". జీవన్ 1935లో వచ్చిన రొమాంటిక్ ఇండియా, 1946లో వచ్చిన అఫాసనా 1942లో స్టేషన్ మాస్టర్‌లో వచ్చిన సినిమాలతో గుర్తింపు పొందాడు. జీవన్ 1946 నుండి 1978 మద్యకాలంలో విడుదలైన అనేక సినిమాలలో ప్రతి నాయకుడిగా నటించాడు. దేవ్ ఆనంద్ చిత్రాలలో అమర్ అక్బర్ ఆంథోనీ ధరమ్ వీర్ వంటి మన్మోహన్ దేశాయ్ చిత్రాలలో ప్రతి నాయకుడిగా నటించాడు. జీవన్ పంజాబీ సినిమా తేరీ మేరీ ఏక్ జింద్రీలో కూడా నటించాడు. జీవన్ చివరి సినిమా ఇన్సాఫ్ కి మంజిల్, 1986లో విడుదలైంది, దీనిని రామ్ నందన్ ప్రసాద్ నిర్మించారు బ్రజ్ భూషణ్ దర్శకత్వం వహించారు. జీవన్ 10 జూన్ 1987న తన 71వ ఏట మరణించాడు [1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 http://cineplot.com/jeevan-memories Memories of Jeevan
  2. Agnihotri, Ram Awatar (1992). Artistes and their films of modern Hindi cinema: cultural and sociopolitical impact on society, 1931-1991. Commonwealth Publishers. ISBN 978-81-7169-180-7. Retrieved 10 July 2011.
  3. "In the limelight: Seasoned actor Kiran Kumar talks of the many shades of his career". The Hindu. 13 Nov 2008. Archived from the original on 9 March 2009.
"https://te.wikipedia.org/w/index.php?title=జీవన్&oldid=4054531" నుండి వెలికితీశారు