జుల్ఫికర్ అహ్మద్ (క్రికెటర్)
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | లాహోర్, పంజాబ్, బ్రిటిష్ ఇండియా | 1926 నవంబరు 22|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2008 అక్టోబరు 3 లాహోర్, పాకిస్తాన్ | (వయసు 81)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 13) | 1952 23 October - India తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1956 11 October - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2019 12 July |
జుల్ఫికర్ అహ్మద్ (జననం 1926, నవంబరు 22 - 2008, అక్టోబరు 3[1]) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1952 నుండి 1956 వరకు తొమ్మిది టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[2]
జననం
[మార్చు]జుల్ఫికర్ అహ్మద్ 1926, నవంబరు 22న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించాడు. లాహోర్‌లోని ఇస్లామియా కళాశాలలో చదువుకున్నాడు. ఇతని సోదరి షాజాది, పాకిస్థాన్ తొలి టెస్టు క్రికెట్ కెప్టెన్ అబ్దుల్ హఫీజ్ కర్దార్‌ను వివాహం చేసుకుంది.[3]
క్రికెట్ రంగం
[మార్చు]ఆఫ్-స్పిన్ బౌలర్ గా, లేట్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు.[4] 1955లో కరాచీలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 79 పరుగులకు 11 వికెట్లు తీసుకున్నాడు.
1952-53లో భారత పర్యటనలో పాకిస్తాన్ మొదటి టెస్ట్ జట్టులోకి వచ్చాడు. 1954లో ఇంగ్లాండ్‌లో పాకిస్తాన్ పర్యటనలోనూ, 1955-56, 1956-57లో వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన స్వదేశీ సిరీస్‌లలో ఎంపికయ్యాడు. మొత్తం తొమ్మిది టెస్టులు ఆడి 200 పరుగులు చేసి 20 వికెట్లు తీశాడు. 1955లో న్యూజిలాండ్‌తో జరిగిన కరాచీ టెస్టులో అహ్మద్ 79 పరుగులకు 11 వికెట్లు తీసుకున్నాడు.
మరణం
[మార్చు]జుల్ఫికర్ అహ్మద్ తన 81 ఏళ్ళ వయసులో 2008, అక్టోబరు 3న లాహోర్ లో మరణించాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Former Test cricketer Zulfiqar passes away". Daily Times. 4 October 2008. Archived from the original on 5 October 2008. Retrieved 27 April 2019.
- ↑ "Zulfiqar Ahmed Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-22.
- ↑ "Cricketing dynasties: The 22 families of Pakistan Test cricket — Part 2 | Sports | thenews.com.pk". www.thenews.com.pk.
- ↑ Pakistan v New Zealand, Karachi 1955-56
- ↑ "Former Test cricketer Zulfiqar passes away". Daily Times. 4 October 2008. Archived from the original on 5 October 2008. Retrieved 27 April 2019.